Latest Updates
-
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్‌వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.!
గుండెకు బ్యాడ్ మార్నింగ్.. ఆ సమయాల్లో ఆహార ఎంపికలతో పెను ముప్పు.!
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎవరికైనా మొదటగా గుర్తొచ్చేది క్రమం తప్పని వ్యాయామాలు, కూరగాయలు అధికంగా తీసుకోవడం, ఏడాదికోసారి ఆరోగ్య పరీక్షలు అనే సమాధానం వస్తుంది. అయితే మొత్తం శరీర ఆరోగ్య వ్యవస్థకి దోహదం చేస్తాయని.. గుండె ఆరోగ్యం ప్రత్యేకంగా వీటిపైనే ఆధారపడి ఉండదని.. ఇందుకోసం మరిన్ని జాగ్రత్తలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రతి ఒక్కరి శరీరం సర్కాడియన్ రిథమ్‌పై ఆధారపడి ఉంటుంది. అదే జీవ గడియారం తీరు. సరైన జీవక్రియ ద్వారానే ఇవన్నీ సాధ్యమవుతాయి. పగటి పూట మనం తీసుకునే ఆహారాలు, వాటి నుంచి శక్తి స్థాయిలు మెటబాలిజంను ప్రభావితం చేస్తాయని నిపుణులు అంటున్నారు. మన దీర్ఘకాలిక ఆహారపు అలవాట్లే గుండె ఆరోగ్యానికి కారణమవుతాయి.
నేటి కాలంలో ఆహారపు అలవాట్లలో చోటుచేసుకున్న మార్పులే గుండె ఆరోగ్యంతో పాటు శరీర ఇతర వ్యవస్థలపై ప్రభావం చూపిస్తున్నాయి. మధ్యాహ్నం సమయంలో అధిక మోతారులో చక్కెర ఉన్న స్నాక్స్ తీసుకోవడం గుండెకి చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి. ఇక నీరు ఎక్కువగా తీసుకోకపోవడం కూడా మంచిది కాదు. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడదు. సాయంత్రం 6 తర్వాత టీ, కాఫీ ఎక్కువగా తీసుకున్నట్లయితే నిద్ర ఆలస్యమై దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడేలా చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారపు అలవాట్లలో సమయం, క్రమబద్ధతలు చాలా కీలకమని నిపుణులు అంటున్నారు. దీని వల్ల శరీరంలో అంతర్గత సర్కాడియన్ రిథమ్ సంరక్షణగా ఉంటుంది. ఫలితంగా జీవక్రియ మెరుగై ఆరోగ్యం కాపాడుతుంది. మీరు ఏం తింటున్నారనే దానితో పాటు ఏ సమయంలో తింటున్నారనేది కూడా చాలా ముఖ్యంగా భావించాలి. ఉదయం, సాయంత్రం ఎండలో కాసేపు నిలబడటం, వ్యాయామం చేయడం కూడా సర్కాడియన్ రిథమ్‌పై సానుకూల ప్రభావం చూపిస్తుంది.

ఈ క్రమంలో క్యాండీలు, పేస్ట్రీలు, షుగర్ కాఫీలకు వీలైనంతగా దూరంగా ఉండాలి. లేదంటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడం, అకస్మాత్తుగా పడిపోవడం జరుగుతాయి. ఫలితంగా గుండె నాళాల వ్యవస్థపై భారం పడి, ఇన్సులిన్‌ను నిరోధించేలా చేస్తుంది. రాత్రి సమయంలో సహజ నిద్ర కోసం సాయంత్రం 6 తర్వాత కాఫీలు, ఎనర్జీ డ్రింక్స్‌కి దూరంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌కి స్కిప్ చేయకూడదు. లేదంటే ఆకలి కారణంగా ఎక్కువ మోతాదులో తినడం, జంక్ ఫుడ్ వైపు మనసు మళ్లిస్తుంది. డీ హైడ్రేషన్‌కి గురికాకుండా పగటి పూట నీళ్లు పుష్కలంగా తాగడం చాలా అవసరం. లేదంటే మతిమరుపునకు దారితీయడంతో పాటు చక్కెర పానీయాలను తాగే ప్రమాదం ఉంది.

గుండె ఆరోగ్యం కోసం సరైన మోతాదులో ప్రొటీన్, ఫైబర్‌పై దృష్టి పెట్టాలి. గ్రీక్ యోగర్ట్, నట్స్, పండ్లు, కూరగాయలు వంటి వాటిని సమతుల్యంగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడం ద్వారా త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు శక్తిని ఇస్తాయి. కూర్చుని పనిచేసేవారు గంటకోసారైనా ఐదు నిమిషాల పాటు నడక అలవాటు చేసుకోవాలి. మధ్యాహ్నం, రాత్రి భోజనం తర్వాత కాసేపు చిన్నపాటి నడక చేయాలి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి.
రాత్రి సమయంలో వీలైనంత త్వరగా భోజనం ముగించాలి. దీని వల్ల మెటబాలిజం పనితీరు సజావుగా ఉంటుంది. ఫలితంగా కేలరీలు అధికంగా ఖర్చవుతాయి. పగటి సమయంలో కొద్దికొద్దిగా నీళ్లు తాగుతుండాలి. దీనివల్ల హైడ్రేషన్‌గా ఉంటారు. కెఫిన్, కూల్ డ్రింక్స్‌వైపు మనసు మళ్లకుండా ఉంటుంది. జీవనశైలిలో, ఆహరంలో మార్పులు, రక్కంలో చక్కెర స్థాయిల నియంత్రణతోనే గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications