Latest Updates
-
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం!
ఒత్తిడికి గురవుతున్నారా.. ఇది మీ జుట్టుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా.?
ఈ మధ్య కాలంలో చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోవడం జరుగుతుంది. గతంలో జుట్టు తెల్లబడటం అంటే వయసైపోతుంది అని అర్థం చేసుకునేవారు. కానీ ఇప్పుడు యుక్త వయసులోనే తెల్ల జుట్టు రావడంతో ఆందోళన చెందుతున్నారు. అసలు ఇందుకు కారణాలేంటి.. చూద్దాం..

జుట్టు తెల్లబడటం అనేది సాధారణంగా వృద్ధాప్యంతో ముడిపడి ఉంటుంది. కానీ నేటి జీవనశైలిలో మార్పుల కారణంగా చిన్న వయసులోనే ఈ సమస్య వస్తోంది. చిన్న వయసులోనే జుట్టు రంగు మారడం, తెల్లగా అయిపోవడం, బలహీనంగా అయిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే జుట్టు సహజ రంగు అనేది మెలనిన్ అనే వర్ణద్రవ్యంపై ఆధారపడి ఉంటుంది. ఈ వర్ణద్రవ్యం శరీరంలోని ప్రత్యేక కణాల ద్వారా ఉత్పత్తి అవుతుంది. అయితే ఈ కణాల పనితీరు ప్రభావితమై, దెబ్బతింటే జుట్టు క్రమంగా రంగు మారడం జరుగుతుంది.
అయితే చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి కారణంగా కూడా ఈ పరిస్థితి తలెత్తవచ్చని పలు అధ్యయనాలు సైతం చెబుతున్నాయని అంటున్నారు. వ్యక్తి ఆరోగ్యం బట్టి దాని ప్రభావం ఉండొచ్చని అంటున్నారు.
నేటి పోటీ ప్రపంచంలో తీరికలేని లైఫ్‌స్టైల్, పనిలో ఒత్తిడితో పాటు మానసికంగానూ స్ట్రెస్‌కి గురి కావడం.. చాలా మంది డైలీ రొటీన్‌లో భాగమయ్యాయి. తమకోసమంటూ ప్రత్యేకంగా సమయం కేటాయించుకోలేకపోతున్నారు. ఫలితంగా ఒత్తిడితో జుట్టు ఆరోగ్యం ప్రభావితమవుతోంది. అసలు ఒత్తిడికి, జుట్టు నెరిసిపోవడానికి కారణాలేంటి.. కురుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి.. ఇక్కడ చూద్దాం..
జుట్టుకి సహజ రంగుని అందించే మెలనోసైట్ కణాలు ఆరోగ్యకరంగా ఉత్పత్తి కావాల్సి ఉంటుంది. అయితే ఈ కణాలను ఉత్పత్తి చేసే శరీరంలోని మూల కణాలపై మనం తీసుకునే అధిక ఒత్తిడి ప్రభావం చూపిస్తోందని నిపుణులు అంటున్నారు. అధిక ఒత్తిడి కారణంగా ఈ మూలకణాలు తగ్గినప్పుడు లేదా కనుమరుగైపోయినప్పుడు.. మెలనిన్ ఉత్పత్తిపై ప్రభావం పడవచ్చు. ఫలితంగా జుట్టు సామర్థ్యం దెబ్బతింటుంది. ఫలితంగా చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోవడానికి దారితీస్తుంది.
అయితే ప్రతి వ్యక్తిలోనూ జుట్టు తెల్లబడటానికి ఒత్తిడి ఒక్కటే కారణమని అర్థం కాదని.. వారి శరీర స్పందన ప్రకారం ఇందులో మార్పులు ఉంటాయని చెబుతున్నారు. కొందరిలో దీర్ఘకాలికంగా ఉండే మానసిక ఒత్తిడి గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే మరికొందరిలో ఒత్తిడి ప్రభావం ఉండకపోవచ్చు. ఒత్తిడితోపాటు ఇతర ఆరోగ్య, జున్యుపరమైన కారణాలు దారితీయవచ్చు. ఈ క్రమంలో మీ జుట్టు చిన్న వయస్సులోనే తెల్లబడటం ప్రారంభమైనట్లయితే.. ఒత్తిడి మాత్రమే కారణం అని భావించకుండా అసలు కారణం తెలుసుకోవడం సంబంధిత వైద్యుడిని సంప్రదించడం ప్రధానం.
చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోవడానికి ఒత్తిడి మాత్రమే కాకుండా జన్యుపరమైన కారణాలు దారి తీయవచ్చు. మీ తల్లిదండ్రులు, పూర్వీకుల్లో ఈ సమస్య ఉన్నా.. మీకూ అదే వర్తించే అవకాశం ఉంది. జుట్టు ఆరోగ్యానికి విటమిన్ బి12, ఐరన్, రాగి, ఫోలేట్ వంటి పోషకాహారం అవసరం. కానీ వీటి లోపాలు, థైరాయిడ్ సమస్యలు, కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు, ధూమపానం, సరైన జీవనశైలి లేకపోవడం వంటి వాటి వల్ల కూడా జుట్టు నెరిసిపోవడం ప్రారంభమవుతుంది. మరికొందరిలో దీర్ఘకాలిక పోషకాహార లోపాలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఇందుకు కారణం అవుతాయని నిపుణులు అంటున్నారు.

జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శరీరానికి విటమిన్లు, ఐరన్, ఇతర ముఖ్యమైన పోషకాలు అవసరం. అందుకోసం తగినంతగా సమతుల్య, పౌష్టిక ఆహారం తీసుకోవాలి. తగినంత నిద్రపోవాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. క్రమం తప్పకుండా యోగా, ధ్యానం, వ్యాయామం చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ధూమపానానికి దూరంగా ఉండాలి.
జుట్టుపై కఠినమైన రసాయన ఉత్పత్తులను వాడటం ద్వారా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. వాటిని వాడటం మానేయాలి. జుట్టు, తల చర్మాన్ని క్రమం తప్పకుండా సంరక్షించుకోవాలి. చిన్న వయసులోనే జుట్టు నెరవడంతో పాటు, కురులు రాలిపోవడం, అలసట, ఇతర ఆరోగ్య సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
