For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ ఇల్లే ఓ కెమెరా... అక్కడ ఎవరెళ్లినా వెంటనే క్లిక్ మని ఫొటో తీసేస్తుంది...!

కర్నాటకకు చెందిన ఓ వ్యక్తి ఇంటినే కెమెరాగా మార్చేసుకున్నాడు.

|

మనందరికీ ఎన్నో కోరికలు, ఆశలు ఉంటాయి. అయితే కొంత మంది మాత్రమే వాటిని నెరవేర్చుకుంటారు. అయితే కొందరికి క్రేజీ ఐడియాలు వస్తుంటాయి. ముఖ్యంగా పెయింటింగ్, ఫొటోగ్రఫీ, సంగీతం తదితర రంగాల ప్రజలు ఎల్లప్పుడూ క్రియేటివిటికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంటారు.

Karnataka Photographer Builds Camera-Shaped House

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే కర్నాటకకు చెందిన రవి హాంగిల్ అనే వ్యక్తి ఇలాంటి క్రియేటివిని తనదైన శైలిలో ప్రపంచానికి తెలియజేశాడు. అదేంటంటే తన ఇంటిని మొత్తం కెమెరాగా మార్చేశాడు.

అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. తన కెమెరా ఇంటిని చూసిన వారు ఔరా అని నోరెళ్లబెడుతున్నారు. అంతేకాదు వారి ఇంటి ముందు ఎవరైనా వెళ్లి నిలబడితే క్లిక్ మనేలా ప్లాన్ చేశాడు. తను కెమెరా నివాసం ఇంట్లో ఉండటమే కాదు... తన కుటుంబానికి అందులో ఉండే కిక్కు ఏంటో తెలియజేస్తున్నాడు. మరో విశేషమేమిటంటే తన పిల్లలకు కూడా కెమెరాకు సంబంధించిన పేర్లే పెట్టాడు. ఈ సందర్భంగా అందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి...

ఇలా కూడా రివేంజ్ తీర్చుకుంటారా? మాజీ ప్రియురాలికి గట్టి షాకిచ్చిన ప్రియుడు...ఇలా కూడా రివేంజ్ తీర్చుకుంటారా? మాజీ ప్రియురాలికి గట్టి షాకిచ్చిన ప్రియుడు...

కేక పుట్టిస్తున్న కెమెరా హౌస్..

కేక పుట్టిస్తున్న కెమెరా హౌస్..

కర్నాటక రాష్ట్రం బెల్గాంకు చెందిన రవి ఫొటోగ్రఫీని కెరీర్ గా ఎంచుకున్నాడు. అతని అభిరుచి మేరకు అచ్చం కెమెరా లాంటి ఇంటిని నిర్మించుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇల్లు నిర్మించేటప్పుడు, ప్రతి ఒక్కరికీ ఏవేవో కోరికలు ఉంటాయి. అయితే అందరికీ అవి నెరవేరవు. ప్లేస్ తక్కువగా రావడమో.. ఉన్న ప్లేసులో తమకు నచ్చిన డిజైన్ ఎలా నిర్మించాలో అని మదన పడుతూ ఉంటారు. అయితే తనకు ఉన్న తక్కువ స్థలంలోనే అందమైన కెమెరా హౌస్ ను నిర్మించి అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు రవి.

అందరి కళ్లు ఆ ఇంటిపైనే..

అందరి కళ్లు ఆ ఇంటిపైనే..

అతను ఎప్పుడైతే ఆ ఇంటి నిర్మాణం పూర్తి చేశాడో.. ఆ ఊరిలో ఉండే అందరి కళ్లు తన ఇంటిపైనే పడ్డాయి. అంతలా అందరినీ ఆకట్టుకుంటోది ఆ కెమెరా హౌస్. ఈ ప్రత్యేకమైన డిజైన్ లో రీల్ కూడా ఉంది.

ఫోటోగ్రఫి క్రేజ్

ఫోటోగ్రఫి క్రేజ్

రవికి చిన్నప్పటి నుండి ఫోటోగ్రఫీపై క్రష్ ఉండేది. అతను తన పెంటాక్స్ కెమెరాను తీసుకొని గ్రామాలకు వెళ్లి ఫోటోలను కెమెరాలో బంధించేవాడు. అలా ఫోటోగ్రఫీ ఇతనికి ఒక అభిరుచిగా మారింది. ఆ తర్వాత ఇదే ఒక వృత్తి మారింది.

పిల్లలకూ కెమెరా పేర్లే..

పిల్లలకూ కెమెరా పేర్లే..

ఇతను వివాహం చేసుకున్న తర్వాత, పుట్టిన పిల్లలకు కూడా ఎప్సన్, కేనన్, నికాన్ (కంపెనీ బ్రాండ్లు) పేర్లనే పెట్టారు. చూశారా తనకు కెమెరా అంటే ఎంత ప్రేమో... ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. ఈ కెమెరా హౌస్ సోషల్ మీడియాలో సైతం వైరల్ అయ్యింది. ఈ ఇంటిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

All Images Credited to FB

English summary

Karnataka Photographer Builds Camera-Shaped House

Karntaka man passion for Photography, build a camera shaped house. Take a look.
Desktop Bottom Promotion