Latest Updates
-
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.!
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
మన తెలుగువారి భోజనంలో పచ్చడి లేకపోతే ఆ ముద్ద గొంతు దిగదు. రోజూ ఒకే రకమైన కూరలు, పప్పు తిని మీ నాలుక బోర్ ఫీల్ అవుతోందా? అయితే మీ భోజనం రుచిని మరో స్థాయికి తీసుకెళ్లే అద్భుతమైన రెసిపీ కోసం చూస్తున్నారా? అయితే స్పైసీగా, పుల్లగా, అసలైన ఆవకాయ ఘాటుతో నోరూరించే ఇన్ స్టంట్ పచ్చిమిర్చి నిల్వ పచ్చడిని ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని, పప్పు లేదా సాంబార్ కి నంజుకుని ఈ పచ్చడి తింటే అమృతంలా ఉంటుంది. చపాతీ, పరోటా, ఉప్మా ఇలా దేనితో తిన్నా సూపర్ కాంబినేషన్.

పచ్చిమిర్చి - 200 గ్రాములు
సోంపు - 2 టీస్పూన్లు
పసుపు ఆవాలు - 3 టీస్పూన్లు
ధనియాలు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
నల్ల ఆవాలు - 1 టీస్పూన్
మెంతులు - 1 టీస్పూన్
ఉప్పు - 2 టీస్పూన్లు
కాశ్మీరీ కారం - 1 టీస్పూన్
పసుపు - ఒకటిన్నర టీస్పూన్
ఇంగువ - 1 టీస్పూన్
వెనిగర్ - 2 టీస్పూన్లు
నూనె - తగినంత
పచ్చిమిర్చి నిల్వ పచ్చడి తయారీ విధానం
-ముందుగా 200 గ్రాముల ఫ్రెష్ పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి, కాటన్ క్లాత్ తో తుడిచి తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టాలి. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే తడి అస్సలు ఉండకూడదు.
-తర్వాత పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి పాన్ పెట్టుకుని మంటను సిమ్ లో ఉంచాలి. పాన్ లో సోంపు, పసుపు ఆవాలు, ధనియాలు, జీలకర్ర, నల్ల ఆవాలు, మెంతులు వేసి దోరగా వేయించాలి. ఈ మసాలా దినుసులు మాడకుండా, కమ్మటి సువాసన వచ్చే వరకు వేయించి, పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టి మెత్తటి పొడిలా చేసుకోవాలి.
-ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్లో గ్రైండ్ చేసిన మసాలా పొడిని వేయాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు,కశ్మీరీ కారం, పసుపు, పసుపు ఆవాలు, ఇంగువ, మెంతులు, పచ్చడికి అదనపు పులుపుతో పాటు నిల్వ ఉండేలా చేసే వెనిగర్ వేసి అన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలపాలి.
-ఇప్పుడు వేరొక పాన్ లో నూనెను బాగా వేడి చేయాలి. ఆ వేడి వేడి నూనెను నేరుగా మనం కలిపి పెట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమంపై పోయాలి. గరిటతో మొత్తం కలిసేలా ఒకసారి మిక్స్ చేయాలి.
-అంతే ఎంతో గుమగుమలాడే ఇన్ స్టంట్ పచ్చిమిర్చి పచ్చడి రెడీ. దీన్ని పూర్తిగా చల్లారనిచ్చి, గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేసుకుంటే రోజుల తరబడి తాజాగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications