For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హీరో నాగార్జున గురించి నమ్మలేని నిజాలు..

|

టాలీవుడ్ మన్మథుడు, కింగ్ అక్కినేని నాగార్జున ఆగస్టు 29వ తేదీతో 60వ ఏట అడుగుపెడుగుతున్నాడు. షష్టి పూర్తి చేసుకునే వయసు వచ్చినప్పటికీ ఆయన ఇప్పటికీ చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. తాజాగా మన్మథుడు-2 సినిమాలోనూ కుర్రాడిగా నటించి తనకు ఇంకా వయసు పైబడలేదని నిరూపించాడు. సినిమారంగంలో ఇంత పేరు సంపాదించిన నాగార్జున ఈ ఒక్క రంగంలోనే కాదు ఇంకా అనేక రంగాల్లోనూ విజయవంతంగా రాణిస్తున్నాడు. అవెంటో ఈరోజు స్టోరీలో తెలుసుకుందాం..

Nagarjuna
 

అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణలకు జన్మించిన నాగార్జున చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి చూపించేవాడు. వారి నాన్నగారు కూడా ప్రోత్సహించడంతో సినిమాల్లో రాణించాడు. రామ్ గోపాల్ వర్మ తీసిన శివ సినిమాతో తెలుగు సినిమా ట్రెండ్ నే మొత్తం మార్చేశాడు. అప్పటి నుండి ప్రతి సినిమాల్లో కొత్త కొత్తగా కనిపించేవాడు. అది ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇటీవలే వర్మతో మరోసారి కొత్త ప్రయోగం చేశాడు. కానీ అది కాస్త బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. ఈ సినిమాకు చాలా డబ్బు నష్టపోయినట్లు తెలిసింది.

డైట్ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు..

నాగార్జున ఇప్పటికీ అతను ఇంత యంగ్ గా కనిపించడానికి కారణం తన డైట్ అని పలు సందర్భాల్లో చెప్పారు. ఇప్పటికీ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూనే ఉండటం ఆయన సీక్రెట్. సినిమాల కోసం కండలు పెంచడం నాగార్జునకు వెన్నతో పెట్టిన విద్య.

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ జోడిగా నటించిన మన్మథుడు-2 సినిమా కోసం జిమ్ లో గంటలకొద్దీ కష్టపడ్డాడు. ఆ సందర్భంలోనే నాగార్జున కొంచెం అనారోగ్యానికి గురైనట్లు వార్తలు వినిపించాయి. కానీ అందులో ఎంతవరకు నిజముందో ఎవరికీ తెలీదు.

Nagarjuna
 

ఎన్నో బిజినెస్ లు..

నాగార్జున ఓ వైపు సినిమా రంగంలో నిర్మాతగా, హీరోగా సంపాదిస్తూనే ఇతర రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టాడు. ఎన్ గ్రిల్ హోటల్, ఎన్ కన్వెన్షన్ హాల్ కు ఓనర్ గా వ్యవహరిస్తున్నారు. విశాఖలో సినిమా షూటింగ్ కోసం కొంత భూమిని కొనుగోలు చేసినట్లు తెలిసింది. అంతేకాదు మా టీవిని స్టార్ మాకు విక్రయించడంలో అందులో చిరంజీవితో కూడా పెట్టుబడులు పెట్టించి బిజినెస్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నాడు. అంతే కాదు కళ్యాణ్ జ్యువెలర్స్ ను తానే ప్రమోట్ చేశాడు. అలా జ్యువెలరీ రంగంలోనూ పెట్టుబడులు పెట్టాడు. అదొక్కటే కాదు వాణిజ్య ప్రకటనల ద్వారా చాలా డబ్బునే సంపాదిస్తున్నాడు. గడీ డిటర్జెంట్ ప్రకటనల్లోనూ మనకు నిత్యం దర్శనమిస్తూనే ఉంటాడు. తాజాగా బిగ్ బాస్ హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇలా రెండు చేతులా సంపాదిస్తూ అన్ని రంగాల్లోనూ అద్వితీయంగా రాణిస్తున్నాడు నాగార్జున.

కింగ్ నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు..

English summary

Nagarjuna 60th Birthday: Know about his Side Business and Facts

Akkineni Nageshwara Rao, Nagarjuna, who was born to Annapurna, has been interested in films since childhood. Their father also excelled in films. Ram Gopal has transformed the entirety of the Telugu film trend with the Siva film by Verma. Since then he has been a newcomer in every film. It was still going on. Recently, he made another experiment with Verma. But it kinda rolled at the box office. The film was reported to have lost a lot of money.
Story first published: Wednesday, August 28, 2019, 19:21 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more