Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఒంటిపై నూలుపోగు లేకుండా..మగవాళ్లతో కలిసి ఆడవాళ్ల నగ్న బైక్ రైడ్..వీడియో చూడండి
నిరసనలు చెప్పడంలో ఒక్కో దేశంలో ఒక్కో స్టైల్ ఫాలో అవుతూ ఉంటారు. హింసకు చోటు లేకుండా గట్టిగా నిరసన తెలియజేయడంలో చాలామంది వినూత్న పద్ధతులను ఫాలో అవుతుంటారు. అలాంటి ఒక ప్రయత్నమే నగ్న బైక్ రైడ్. ప్రతి ఏటా సమ్మర్ లో లండన్ లో నగ్న బైక్ రైడ్ జరుగుతుంది. ఇందులో భాగంగా వేలాది మంది మగవాళ్లు, అడవాళ్లు ఒంటిపై నూలుపోగు లేకుండా నగరం మొత్తం సైకిల్ పై తిరుగుతారు. ఆడవాళ్లు, మగవాళ్లు కలిసి ఫొటోలకు ఫోజులు కూడా ఇస్తారు. నిరసన సమయంలో నగ్నంగా తిరుగుతున్నా ఎలాంటి సిగ్గు పడరు. చూసేవారికి ఇది వింతగా, ఆశ్చర్యంగా అనిపించినా దీని వెనుక ఒక బలమైన సందేశం, ఒక ఉద్యమం ఉంది.
రాజకీయ నిరసగా స్టార్ట్
మొదట్లో ఇది రాజకీయ నిరసనగా ప్రారంభమైంది. రోడ్లపై కార్ల మధ్య సైకిల్ తొక్కే వారు ఎంత ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారో, ఎంత బలహీనంగా ఉంటారో చెప్పడానికి నగ్నత్వం ఒక ప్రతీక. కారులో ఉన్న మీకు, రోడ్డుపై సైకిల్ తొక్కుతున్న మేము కనబడుతున్నామా? అని ప్రశ్నించడమే వారి ఉద్దేశం. ప్రతి ఏటా చాలామంది సైక్లిస్టులు రోడ్డు ప్రమాదాల్లో గాయపడుతున్నారు, మరణిస్తున్నారు..దీనికి కారణంగా డ్రైవర్లు నేను వాళ్లను గమనించలేకపోయాను ఐ యామ్ సారీ అని చెప్పేస్తున్నారు..అయితే నగ్నంగా ఉంటే రోడ్డు కండీషన్ ఎలా ఉన్నా డ్రైవర్ కి మేం కనబడతాంగా.. కాబట్టి అదేవిధంగా నేను బట్టలు ధరించి ఉన్నప్పుడు కూడా చూడగల్గుతావుగా అని అంటూ ఇలా డ్రైవర్స్ తీరుకి నిరసనగా ఇది చేపట్టారు.

కార్ల సంస్కృతికి వ్యతిరేకంగా
ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న కార్ల వాడకం,పెట్రోల్, డీజిల్ పై ఆధారపడటం వల్ల పర్యావరణానికి కలుగుతున్న నష్టాన్ని తెలియజేయడం దీని ముఖ్య లక్ష్యం. కొవ్వును కరిగించండి, చమురును కాదు వంటి నినాదాలు వారి శరీరాలపై రాసుకుంటారు.
పర్యావరణ హితం
సైక్లింగ్ అనేది పర్యావరణానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రవాణా సాధనం అని ప్రజలలో అవగాహన కల్పించడం ఈ నగ్న బైక్ రైడ్ ఉద్దేశ్యం కూడా.
శరీర సానుకూలత
ఎలాంటి ఆకారంలో ఉన్నా సరే, మానవ శరీరాన్ని గౌరవించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని చెప్పడం కూడా దీనిలోని ఒక భాగం.
ఎప్పుడు, ఎలా మొదలైంది?
ఈ ఉద్యమ బీజాలు 2001లో స్పెయిన్‌లో పడ్డాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి సమన్వయంతో వరల్డ్ నేకెడ్ బైక్ రైడ్ పేరుతో అధికారికంగా ప్రారంభమైంది మాత్రం 2004లో. లండన్ ఈ ఉద్యమంలో మొదటి నుంచి చురుగ్గా పాల్గొంటూ వస్తోంది. జూన్ నెలలో జరిగే ఈ రైడ్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రసిద్ధి చెందిన నగ్న బైక్ రైడ్స్ లో ఒకటిగా నిలిచింది. కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి 70కి పైగా నగరాల్లో ఇప్పుడు ఈ రైడ్ ఏటా జరుగుతోంది.
ఆసక్తికర విషయాలు
ఈ రైడ్ లో పాల్గొనే వారు పూర్తిగా నగ్నంగా ఉండాలనే రూల్ ఏమీ లేదు. వారి నినాదం ధైర్యం ఉన్నంత నగ్నంగా. కొందరు పూర్తిగా నగ్నంగా పాల్గొంటే.. మరికొందరు పాక్షికంగా లేదా కేవలం లోదుస్తులతో పాల్గొంటారు. ఇది పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయం. చాలా మంది తమ శరీరాలను ఒక కాన్వాస్‌లా మార్చుకుంటారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నినాదాలు, అందమైన చిత్రాలు, రంగురంగుల డిజైన్లతో తమ నిరసనను సృజనాత్మకంగా వ్యక్తం చేస్తారు. ఇది నిరసన అయినప్పటికీ వాతావరణం చాలా ఉల్లాసంగా, పండగలా ఉంటుంది. సంగీతం, నృత్యాలు, కేరింతలతో రైడర్లు ముందుకు సాగుతారు. ఎలాంటి అశ్లీలతకు తావు లేకుండా, స్నేహపూర్వక వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.
చట్టబద్ధమేనా?
లండన్‌తో సహా అనేక దేశాల్లో నిరసనలో భాగంగా బహిరంగ నగ్నత్వాన్ని చట్టం అనుమతిస్తుంది. దీని ఉద్దేశం ఇతరులను ఇబ్బంది పెట్టడం లేదా భయపెట్టడం కానంత వరకు దీనిని నేరంగా పరిగణించరు.



Click it and Unblock the Notifications