పిల్లల్ని త్వరగా నిద్రలేపే మార్గాలు

Posted By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky

త్వరగా పడుకుని త్వరగా లేవాలి! గాఢనిద్ర అనేది చాలా ముఖ్యమైన పని, ఇది మీ పిల్లల శారీరిక, మానసిక సామర్ధ్యాన్ని నిర్ణయిస్తుంది. దీనికోసం, మీరు మీ పిల్లలకు మంచి నిద్ర అలవాటువు అనుసరించడానికి మీ బిడ్డకు శిక్షణ ఇవ్వాలి. మీ పిల్లలు ఉదయానే త్వరగా నిద్ర లేవడానికి పరోక్షంగా పనిచేసే అద్భుతమైన మార్గం.

త్వరగా నిద్ర లేవడం వల్ల పిల్లల మనసు, శరీరం తాజాగా, ఉల్లాసంగా ఉంటారు. ఇది వారి ఆరోగ్యంపై గొప్పగా ప్రతిబింబించి, వారిని మంచి విజ్ఞానంతో, సంతోషంగా తయారుచేస్తుంది. కానీ, కొన్నిసార్లు వారు తగినంత విశ్రాంతి పొందే ముందు పిల్లలు లేస్తారు.

ways to make kids wake up early

పిల్లలకు ఉండాల్సిన మంచి అలవాట్లు

ఒక తల్లిగా, మీ బిడ్డకు ఎంత నిద్ర అవసరమో మీరు తెలుసుకోవడం ముఖ్యం. ఇది బిడ్డ వయసును బట్టి మారుతూ ఉంటుంది. మీరు మంచి సలహా కోసం మీ పిల్లల డాక్టరుతో మాట్లాడండి. మంచి నిద్ర అనేది త్వరగా పిల్లల నిద్రలేవడానికి చేసే ఉత్తమమైన మార్గాలలో ఒకటి.

మీ పిల్లలు రోజువారీ షెడ్యూల్ కి కట్టుబడి ఉండేట్టు చూడండి, ఇది వారి జీవ గడియారం పనితీరు సరైన దారిలో వెళ్ళడానికి సహాయపడే ఉత్తమమైన మార్గం. మీ పిల్లల్ని త్వరగా నిద్రలేపడం ఎలా అని నిర్ణయం తీసుకున్న తరువాత ఒక ప్రణాళిక వేసుకుని షెడ్యూలును అనుసరించండి.

ways to make kids wake up early

పిల్లల నిరాశకు సంబంధించిన వాస్తవాలు

స్కూల్ సమయం, కుటుంబ షెడ్యూల్, పిల్లల్లో సౌకర్య స్థాయి వంటి ఎన్నో వాస్తవాలను పరిగణలోనికి తీసుకోవడం అవసరం. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని, పిల్లలు త్వరగా లేవడానికి చేసే కొన్ని మార్గాలు ఈకింద ఇవ్వబడ్డాయి.

పిల్లలు త్వరగా నిద్ర లేచెట్టు చేయడం

త్వరగా ప్రణాళిక చేసుకోవడం వేసవి సెలవల నుండి తిరిగి స్కూలు ప్రారంభించే సమయ౦ రావడం అనేది తల్లిదండ్రులకు అంత తేలికైన విషయం కాదు, పిల్లలకు ఖచ్చితంగా తేలిక కాదు. ప్రశాంతమైన ఉదయం పొందడానికి, మీరు ముందే ప్రణాలికను ప్రారంభించడం అవసరం. ఒక వారం ముందే మీ బిడ్డను సిద్ధం చేయాలి. మీ పిల్లలు త్వరగా లేవడానికి ఉపయోగించే మార్గాలలో ఇదొకటి.

ways to make kids wake up early

మించిన నిద్ర సమయం

మీ పిల్లల్ని త్వరగా నిద్రలేపడానికి ఏమిచేయాలో ఆలోచిస్తున్నట్లయితే, వారి నిద్ర సమయాన్ని మించిన మార్గాన్ని ఆలోచించండి. వారి రోజంతా ఎలా గడించింది, వారు ఎంత అలసిపోయారు అనేది తెలుసుకోవడ౦ చాలా అవసరమని దీనర్ధం. షెడ్యూల్ ని మించి వారికి బరువు పెట్టొద్దు, దీనివల్ల వారి జీవితం మరింత ఒత్తిడికి గురవుతుంది.

దినచర్యలోకి రావడం

నిద్రపోవడం, లేవడం వంటి కఠినమైన షెడ్యూల్ ని అనుసరించడం మనం అనుకున్నంత తేలిక కాదు. ఇది తల్లిదండ్రులు షెడ్యూల్ లో జోక్యం చేసుకోవడం వల్ల జరుగుతుంది. కాబట్టి, వారు దీన్ని నిదానంగా అలవాట్లలో కొంత భాగంగా ప్రయత్ని౦చాలి, లేకపోతే బలవంతంగా అనిపిస్తుంది.

ways to make kids wake up early

చిన్న చిన్న లంచాలు

పిల్లలు త్వరగా లేవడానికి చేసే ఉత్తమ మార్గాలలో ఒకటి త్వరగా పడుకున్నారని నిర్ధారించుకోవడం. కొన్నిసార్లు మీరు నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం కదలడానికి ఇష్టపడరు. ఇలాంటి సందర్భాలలో, చిన్న లంచాలు తెలివిగా పనిచేస్తాయి. జాగ్రత్తగా చేయండి. దీన్ని అలవాటు చేయకండి.

ఉదయాన్ని ప్రకాశవంతంగా ఉంచండి

మీ పిల్లలు ఎప్పుడూ ప్రకాశవంతమైన ఉదయాన్ని ఆశిస్తూ పడుకోవడానికి వెళ్ళాలి. మీ పిల్లలు త్వరగా లేచెట్టు చేసే ఈ ప్రయత్నం ప్రభావవంతంగా పనిచేస్తుంది.

కుటుంబంలో ప్రతి ఒక్కరూ దీనిపై పనిచేస్తుంటే, ఇది మించిన సంఘటిత ప్రయత్నం. మీరు పిల్లలను త్వరగా లేపడానికి చేసే ప్రయత్నాలను పరిసీలిస్తున్నపుడు, వారి మానసిక, శారీరిక ఆరోగ్యాన్ని కూడా పరిగణలోనికి తీసుకోండి.

English summary

Ways To Make Kids Wake Up Early | How To Make Kids Wake Up Early | Waking Up Your Kid Early Morning | Tips To Make Your Kid Wake Up Early Morning

If your kids are not waking up early, here are some best tips that you need to try. Kids are difficult to handle, but does not mean they don't listen to you. Speak to them nicely, bribe them and then they ll do what ever you want.
Story first published: Saturday, December 16, 2017, 11:20 [IST]