Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
మొదటి బిడ్డ తర్వాత...మహిళల శారీరక ఫిట్ నెస్!

అయితే, ఈ వ్యాయామలు డెలివరీ అయిన వెంటనే మొదలు పెట్టరాదు. కొంత సాధారణ ఆరోగ్యం చేకూరిన తర్వాత మాత్రమే మహిళలు ఈ వ్యాయామాలను మొదలు పెట్టాలి. సిజేరియన్ ఆపరేషన్ పొందిన మహిళలకు మరింత విశ్రాంతి అవసరం కనుక వారు తమ ఫిట్ నెస్ వ్యాయామాలు మొదలు పెట్టే ముందుగా డాక్టర్ ను కూడా సంప్రదించాలి.
కాన్పు అనంతర వ్యాయామాలు చాలా నెమ్మదిగా మొదలు పెట్టాలి. అంటే ముందుగా నడక వంటి వాటితో మొదలు పెట్టి కొంత ఫిట్ నెస్ వచ్చిందనుకున్న తర్వాత మరింత శ్రమను కలిగించే వ్యాయామాలు చేయాలి. బిడ్డ పుట్టిన తర్వాత ఫిట్ నెస్ కొరకు మహిళలు చేయాల్సిన కొన్ని వ్యాయామాలు:
1. నేలపై మెల్లిగా కూర్చొని నడుము, బ్లాడర్, వూంబ్, వెన్నెముక చివరి భాగం మొదలైన భాగాలకు సున్నితంగా ఒత్తిడి కలిగించాలి. శరీరంలోని ఈ భాగాలు బలాన్ని సంతరించుకోవడం ఎంతో ప్రధానం. నేలపై కూర్చోవడం, తిన్నగా నిలబడటం, మోకాళ్ళు, కాళ్ళు వంటి వాటికి స్ట్రెచింగ్ వ్యాయామాలు, యూరిన్ పాసేజికి సంబంధించిన కండరాలను బలపరచటం, వజీనా ముందరి భాగం, వెనుక భాగాలను మూడు నుండి అయిదు సెకండ్ల పాటు బిగపట్టి వుంచి వదలడం చేయాలి. బిగించినపుడు కండరాలు పట్టు, వదిలినపుడు కండరాలు సడలింపు చేయాలి. ఈ రకంగా సుమారు 10 నుండి 20 సార్లు కండరాలు అలసట పొందేవరకు చేయాలి. ప్రతి ఒత్తిడి తర్వాత కొద్ది సెకండ్లు విశ్రాంతినివ్వాలి.
2. మోకాళ్ళు వంచి వీపుపై పరుండి పొట్టభాగాన్ని లోపలికి అదిమి పెట్టండి. మెల్లగా వదలండి. ఈ వ్యాయామాన్నికూడా, లోపలికి అదిమినపుడు 4 లేదా 5 సెకండ్లు, వదిలినపుడు అంతే సమయం తీసుకోవాలి. వ్యాయామాలు చేసేటపుడు శ్వాస సాధారణంగా వుండాలి. పక్కకు పరుండి కాలు, చేయి లేపటం కూడా చేయవచ్చు. మధ్యలో చిన్నపాటి బ్రేక్ ఇవ్వాలి. మొదట్లో ఒక్కొక్క పొజిషన్ అయిదు సార్లు చొప్పున చేస్తూ వుండాలి. క్రమం తప్పకుండా ప్రతి నిత్యం చేయాలి.
3. నేలపై వెల్లకిలా పడుకోండి. ఒక మోకాలును ఆపోజిట్ మోచేయితో టచ్ చేయండి. ఈ వ్యాయామం మీ పొట్ట షేప్ ను సరిచేయటానికి ప్రధానమైంది.
4. శిశు జననం తర్వాత సాధారణంగా నేలపై పరుండి మోకాళ్లు వంచి చేతులు వాటిపై పెట్టి స్వింగ్ చేయటం సాగివున్న పొట్ట టైట్ అవడానికి ఎంతో సహకరిస్తుంది. దీనితో పాటే శ్వాసను కూడా లోపలికి, బయటకు వదులుతూండాలి. ఈ వ్యాయామం 10 నుండి 12 సార్లు చేయాలి. కండరాలు అలసి వుండటం చేత దీనిని అతి నెమ్మదిగా చేయాలి.
5. మోచేతులపై పరుండండి. శరీర క్రింది వీపు భాగాన్ని నేలకు తాకించండి. పొట్ట కండరాలను బిగించండి. కాళ్ళను ముందుకు త్రోయండి. ఈ వ్యాయామాన్ని పది సార్లు చేయాలి. పొట్టలోని కొవ్వు కరిగి పొట్ట కండరాలు టైట్ అవుతాయి.
6.మరో వ్యాయామంగా చేతులు వీపు వెనుకకు కట్టుకోండి. ఎడమకు, కుడికి పది సార్లు చొప్పున తిరుగుతూండండి.
డెలివరీ తర్వాత ఈ వ్యాయామాలతో పొట్ట కండరాల పటుత్వాన్ని పెంచుకోండి. గతంలోని మీ సన్నని నడుమును, చిన్నదైన మీ పొట్టను మరోమారు పొందండి. ఆకర్షణీయంగా కనపడండి.



Click it and Unblock the Notifications
