Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ప్రసవానంతరం మహిళ శారీరక ఫిట్ నెస్ పొందాలంటే....!

1. నేలపై పరుండి నడుముకు సంబంధించిన తేలికైన కదలికలు చేయాలి. బ్లాడర్, బవెల్స్, వూంబ్, వెన్నెముక చివరి భాగం అన్నీ కదులుతాయి. కడుపు భాగానికి వ్యాయామం అవసరం. కూర్చోవటం, తిన్నగా నిలబడటం లేదా వెల్లకిలా పరుండి మోకాళ్లు వంచటం, కాళ్ళు వెడంగా పెట్టటం వంటివి చేయాలి. మూత్ర విసర్జన కండరాలను బిగిస్తూ పటుత్వం కలిగించాలి. ప్రతి బిగింపుకు మధ్య కొద్దిపాటి విశ్రాంతి నివ్వాలి.
2. వెల్లకిలా పరుండి మోకాళ్ళు వంచండి. వాటిని పొట్టవరకు లాగి వదులుతూండండి. వీటికి కూడా మద్యలో విశ్రాంతినివ్వాలి. ఈ వ్యాయామాలు చేసేటపుడు శ్వాస సాధారణంగానే వుండాలి. ప్రతిరోజూ చేయాలి. పక్కలకు తిరిగి పరుండి కాలు లేపటం, కూర్చుని లేవటం చేయాలి.
3. వెల్లకిలా పరుండి మెల్లగా ఒక మోకాలు పైకి లేపి దానికి వ్యతిరేక దిశలో వున్న చేతితో అందుకోండి. పొట్టకు పూర్వపు స్ధితి రావాలంటే, ఇది మంచి వ్యాయామం.
4. వెల్లకిలా పరుండి మోకాళ్ళు పొత్తికడుపు భాగానికి తగిలిస్తూచేతులు తొడలపై పెట్టుకోవడం డెలివరీ తర్వాత చేయగల మంచి వ్యాయామం. ప్రతిరోజూ 10 నుండి 12 సార్లు చేస్తూంటే పొట్ట భాగం బలాన్ని సంతరించుకుంటుంది.
5. నేలపై బోర్లా పడుకొని మో చేతులపై పైకి లేవండి. పొట్టను బిగించి కాళ్ళు వెనుకకు తన్నండి.
6. నేలపై కూర్చుని చేతులను ఎడమకు, కుడికి తిప్పండి. వెనుక భాగానికి బలం చేకూరుతుంది.
ఈ వ్యాయామాలతో పోయిన బలాన్ని మరోమారు పుంచజుకోండి. గతంలోని మీ సన్ననైన పొట్టను మరోమారు పొందండి.



Click it and Unblock the Notifications