Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
గర్భిణీ స్త్రీ నిరభ్యంతరంగా తినగలిగే 10 రకాల పండ్లు..!
గర్భం ధరించిన తర్వాత ఏదైనా ఆహారాన్ని తినాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఎందుకంటే గర్భిణీ తీసుకొనే ఆహారం మీద బిడ్డ యొక్క ఎదుగుదల మరియు తల్లి యొక్క ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మొదటి సారి గర్భం ధరించినట్టైతే, కడుపులోని బిడ్డ ఎదుగుదల తల్లి ఏరకమైన ఆహారాలు తింటోంది? అనే దానిపై ఉంటుంది. గర్భవతి దశలో మహిళ తన ఆహారం పట్ల జాగ్రత్త వహించాలి. సరైన ఆహారం తినకపోతే, కొన్ని సార్లు గర్భవిచ్ఛిన్నం కూడా అయ్యే అవకాశం ఉంటుంది.
గర్భం ధరించిన తర్వాత కుటుంబాల్లో గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, ముఖ్యంగా ఆహార వ్యవహారాలపై ఏ సమాజంలో అయినా ప్రత్యేక శ్రధ్ధ తీసుకుంటారన్నది బహుశా మనకందరికీ తెలిసిన విషయమే. దీనికి సంప్రదాయం తోడై కాబోయే తల్లుల ఆహారంలో తినదగినవి, తినకూడనివి అంటూ ఆంక్షలు, నిషేధాలు పెరగడంతో గర్భిణీ స్త్రీల ఆహార పాటింపుపై సమగ్ర విధానం అనేది ఎక్కడా ఆచరణలో లేదు.
ప్రెగ్నెన్సీ డైట్ లో ఆరోగ్యకరమైన మరియు పూర్తి పోషకాలున్న ఆహారాలకు ప్రాధానత్య కల్పించడం వల్ల తల్లికి రోజూ కావాల్సినన్ని పోషకాలు అందుతాయి. హెల్తీ ఫుడ్స్ అంటే ఆకుకూరలు, బ్రొకోలి, పెరుగు, రెడ్ బెల్ పెప్పర్, సోయా ప్రొడక్ట్స్, బీన్స్, ఓట్ మీల్, నట్స్, గుడ్లు, మరియు క్యారెట్స్ వంటివి గర్బాధారణ సమయంలో తప్పనిసరిగా తీసుకోవల్సిన ఆహారాలు. మరియు పండ్ల కథ ఏంటి?చాలా మంది గర్భధారణ సమయంలో కొన్ని రకాల పండ్లు అంటే బొప్పాయి, పైనాపిల్ వంటివి తినడానికి చాలా భయపడుతుంటారు. మరి అటువంటప్పుడు ప్రెగ్నెన్సీ సమయంలో మీరు ఎటువంటి పండ్లను తీసుకోవాలో తెలిపి కొన్ని పండ్ల లిస్ట్ ఇక్కడ మీ కోసం సిద్దంగా ఉంది..ఒక సారి చదవడమే కాదు హాపీగా తిని హెల్తీగా ఎంజాయ్ చేయండి.

అవొకాడో: పండ్లలో ఇది ఒక ఫ్రూట్. ఇందులో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. గర్భాధారణ సమయంలో మహిళలకు ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం కాబట్టి ఈ పండును తీసుకోవడం చాలా అవసరం.

మామిడి: ఈ సమ్మర్ ఫ్రూట్స్ నోరూరించడం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచి చేస్తాయి. ఇవి జీర్ణక్రియకు బాగా సహాయపడటమే కాదు ఇందులో ఉండే విటమిన్ ఎ మరియు విటమిన్ సి లు ప్రెగ్నెంట్ మహిళలకు చాలా అవసరం.

ఎర్ర ద్రాక్ష: చాలా మంది మహిళలు గర్భాధారణ సమయంలో ద్రాక్షతినడం అంత మంచిది కాదనుకుంటారు. అయితే ఎర్ర ద్రాక్ష ఆరోగ్య పరంగా చాలా మేలు కలిగిస్తుంది. ద్రాక్షలో ఉండే విటమిన్ ఎ మెటబాలిక్ రేట్ ను నిలకడగా ఉంచుతుంది . ఇంకా ఇందులో ఫొల్లెట్, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, మరియు సోడియం వంటివి ఉండటం వల్ల వీటిని మితంగా తినవచ్చు.

స్వీట్ లెమన్: కడుపులో వికారాన్ని, మార్నింగ్ సిక్ నెస్ మరియు గర్భధారణ సమయంలో వచ్చే వివిధ రకాలో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనుటలో అద్బుతంగా పనిచేస్తుంది ఈ స్వీట్ లెమన్. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ బిడ్డపెరుగుదలకు బాగా సహాయపడుతాయి.

నిమ్మ: నిమ్మరసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపడంతో పాటు డుపులో వికారాన్ని, మార్నింగ్ సిక్ నెస్ మరియు గర్భధారణ సమయంలో వచ్చే వివిధ రకాలో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనుటలో అద్బుతంగా పనిచేస్తుంది.

అరటి: గర్భధారణ సమయంలో సాధారణంగా వచ్చే మలబద్దకానికి అరటి పండు ఒక ఔషదం వంటిది.

బెర్రీస్: బెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలం. అందుకే వీటిని సూపర్ ఫుడ్స్ గా పిలుస్తుంటారు. కాబట్టి మీ ప్రెగ్నెన్సీ డైట్ లో వీటిని యాడ్ చేసుకోచ్చు.

ఆరెంజ్: వీటిలో గర్భిణీకి కావల్సిన పుల్లగా మరియు తియ్యగా లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్స్ మరియు న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉండటం వల్ల వీటి ఆరోగ్యంగా తీసుకోచ్చు.

యాపిల్స్: ఆరోగ్యానికి మేలు చేసే హెల్తీ విటమిన్స్ పుష్కలంగా ఉండటం చేత కడుపులో పెరిగే శిశువు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.

లిచి: ఈ సమ్మర్ ఫ్రూట్ ను గర్భిణీలకు ఆరోగ్యధాయకమని చెబుతారు. కాబట్టి ఈ లిచిని నిరభ్యంతరంగా తినవచ్చు.



Click it and Unblock the Notifications
