Latest Updates
-
రేప్ కేసులు, మర్డర్ కేసులు..బెంగాల్ అసెంబ్లీలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు..చట్టసభకు 190 మంది నేరచరితులు! -
అన్నం,చపాతీ,బగారా రైస్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..రెస్టారెంట్ స్టైల్ పుదీనా చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బటర్ మష్రూమ్ మసాలా.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఇన్స్టాగ్రామ్లో మీ పిల్లలు సేఫేనా? హనీట్రాప్ ముఠాల వలలో పడకుండా కాపాడుకోండిలా! -
సహజీవనం తర్వాత విడిపోతే అత్యాచారమా? సుప్రీంకోర్టు తీర్పుతో షాకింగ్ నిజాలు! -
భార్యను భర్తకు దూరంగా ఉండాలట! ఫ్యామిలీ కోర్టు వింత తీర్పుపై హైకోర్టు షాకింగ్ రియాక్షన్ -
పసుపు, తేనె కలిపి తీసుకుంటే శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..ఆ సమస్యకు కూడా ఇదే పవర్ ఫుల్ మెడిసిన్! -
హైదరాబాద్లో వాతావరణం మారుతోంది! గర్భిణులు, పసిబిడ్డల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
సమ్మర్ కూల్ డెజర్ట్..మజా వచ్చే మామిడి పాయసం..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ప్రొటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే పెసర రొట్టె..బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎందులో అయినా సూపర్!
గర్భధారణ సమయంలో వ్యాయామం చాలా అవసరం ఎందుకంటే?
గర్భధారణ సమయంలో వ్యాయామం చేయడం ఎంత ముఖ్యమో మీకు తెలుసా? తల్లికాభోతున్న వారికోసం వ్యాయామం గురించి ఒక శుభవార్త: వ్యాయామం వల్ల కడుపులో పెరిగే బిడ్డకు హైబిపి సమస్యను తగ్గిస్తుంది. అందువల్ల హైబిపి వల్ల శిశువు యొక్క బరువులో హెచ్చుతగ్గులుంటాయి. బరువులో హెచ్చుతగ్గుల వల్ల కూడా హైబిపితో పెరగాల్సి ఉంటుంది. కొత్తగా తల్లైయ్యే వారు వ్యాయామం చాలా సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు నిరూపించబడ్డాయి. కాబట్టి కొత్తగా తల్లైయ్యే వారు వ్యాయామం చేయడం చాలా అవసరం.
హైబిపి వల్ల ప్రధానంగా కార్డియోవాస్కులర్ సిస్టమ్ మీద హైబిపి ప్రధాన పాత్రపోషిస్తుంది. శారీరకంగా చురుకుగా ఉన్న మహిళల్లో పిల్లల యొక్క హైబిపి లెవల్స్ ను తగ్గించుకోవచ్చు. గర్భధారణ సమయంలో ఎవరైతే నడక మరియు చిన్నపాటి జాగింగ్ వంటి వ్యాయామాలు చేస్తారో అంటువంటి వారికి పుట్టే పిల్లల్లో హైబిపి సమస్యలుండవని కొన్ని పరిశోధనల ద్వారా నిరూపించారు . కాబట్టి, పొట్టలో పెరిగే బేబీస్ లో హైబిపి రిస్క్ ను తగ్గిస్తుంది కాబట్టి, గర్భిణీ స్త్రీలు వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు.

వ్యాయామం చేయడానికి ప్రధాన కారణం:
ఒత్తిడిని జయించవచ్చు: సాధారణంగా గర్భధారణ పీరియడ్స్ ఎక్కువగా ఒత్తిడికి లోనవుతుంటారు. వ్యాయామం ఒత్తిడి తగ్గించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది . కాబట్టి, మహిళలు వారి రోజువారి పనుల్లో వ్యాయామం ఒకటిగా చేర్చుకోవాలి . ఈ వాస్తవం వెనుక మరో రహస్యం కార్డియో వ్యాస్కులర్ సిస్టమ్ కు చాలా మేలు చేస్తుంది. ఎప్పుడైతే మజిల్స్ స్ట్రాంగ్ గా అవుతాయో, అప్పుడు మీరు చాలా చురుకు గా పనిచేయగలుగుతారు. మీరు ఉద్యోగస్తులు అయితే, వ్యాయామం వల్ల ఆఫీస్ కు చాలా చురుకుగా పనిచేయడానికి వెళ్ళవచ్చు . అయితే కొన్ని రకాల వ్యాయామాల గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి . మీరు ఏదైనా జబ్బుతో బాధపడుతున్నట్లైతే మీరు ఖచ్చితంగా వ్యాయామం చేయకూడదు. మీ డాక్టర్ వ్యాయామం చేయకూడదని సలహాలిచ్చినప్పుడు వర్కౌట్స్ కు ఖచ్చితంగా దూరంగా ఉండాలి.

మీరు బాగా నిద్రపోవచ్చు:
గర్భధారణ సమయంలో వ్యాయామం ఎందుకు అవసరం? వ్యాయామం చేయడం వల్ల నిద్రబాగా పట్టడానికి సహాపడుతుంది. బేబీ బంప్ వల్ల గర్భిణీ స్త్రీలు నిద్రపోవడానికి చాలా కష్టంగా భావిస్తారు . మొదటగా, మంచి నిద్రపొందడానికి పడుకొనే భంగిమ కూడా చాలా కష్టంగా ఉంటుంది . కాబట్టి, వర్కౌట్స్ చాలా బాగా సహాయపడుతాయి . ఎప్పుడైతే వ్యాయామం చేస్తారు అప్పుడు చాలా త్వరగా నిద్రపట్టేస్తుంది.

మీ శరీరం ఫ్లెక్సిబుల్ గా మారుతుంది.
గర్భదారణ సమయంలో ఎందుకు వ్యాయామం చేయాలి? మీ శరీరం చాలా ఫ్లెక్సిబుల్ గా మారుతుంది. వ్యాయామ సమయంలో మీ శరీరాన్ని స్ట్రెచ్ చేయడం వల్ల మీ శరీరం చాలా తేలిక పడుతుంది, దాంతో గర్భధారణ సమయంలో మీకు కష్టం అనిపించేవన్నీ కూడా చాలా తేలికగా చేసుకోగలుగుతారు. మరియు వెన్నునొప్పి ఉండదు. అలాగే శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

డెలివరీ చాలా తేలికగా అవుతుంది:
మీ శరీరం స్ట్రాంగ్ గా మరియు ఫ్లెక్సిబుల్ గా ఉన్నట్లైతే, మీరు చాలా తేలికగా ప్రసవించవచ్చు. అందుకు మీకు చాలా బలం మరియు స్టామినా అవసరం అవుతుంది . వ్యాయామం చేయడం చాలా సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో వ్యాయమం చేయడం వల్ల పొందే ప్రయోజనాల్లో ఇది ఒకటి. అయితే వ్యాయామం వల్ల తేలికగా ప్రసవం అవుతుందన్న విషయాన్ని నిర్ధారించలేదు కానీ, ఇప్పటి అంచనాల ప్రకారం ఎవరతై ఫిజికల్ గా ఫిట్ గా ఉంటారో అలాంటి వారిలో ప్రసవం సౌకర్యవంతంగా ఉంటుందని అంటారు.



Click it and Unblock the Notifications