ప్లమ్ ఫ్రూట్స్ తినడం వల్ల గర్భిణి పొందే ప్రయోజనాలు

By Super Admin

మహిళ గర్భం పొందడం ఒక అద్భుతమైన మార్పు. గర్భం పొందడం దేవుడిచ్చిన ఒక వరం.. గర్భం పొందిన తర్వాత మహిళలో ఆహారం, ఆరోగ్యం పట్ల వివిధ రకాల అపోహాలు, ఆందోళన కలిగి ఉంటారు .సరైన పౌష్టికాహారాలు తీసుకోవడం వల్ల బేబీకి న్యూట్రీషియన్స్ అందడం వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది.

అయితే , గర్భిణీ శరీరంలో హార్మోనుల మార్పుల వల్ల ఆహారాలను ఎక్కువగా తీసుకోలేరు. కొంత మందికి ఆహారాలను తినడానికి కూడా ఇష్టపడరు. అలాంటప్పుడు ఏం జరుగుతుంది . ఇది ఆరోగ్యంకరమైనది కాదు. మరైతే ఏం చేయాలి?వివిధ రకాల ఆహారాల వల్ల పొందే ప్రయోజనాలు మరియు సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోవాలి. నేచురల్ ఫుడ్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. జంక్ ఫుడ్ నివారించాలి, నిపుణుల అభిప్రాయం తీసుకోవాలి.

గర్భిణీలు వివిధ రకాల పండ్లు తీసుకుంటుంటారు. గర్భిణీ రెగ్యులర్ డైట్ లో పండ్లు చేర్చుకోవడం తల్లి, బిడ్డ ఆరోగ్యానికి చాలా మంచిది. అటువంటి ఫ్రూట్స్ లో ఒకటి ప్లమ్ ఫ్రూట్.. అయితే ఈ జ్యూసీ ఫ్రూట్ ను తీసుకోవడం వల్ల గర్భిణీలు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో తెలుసుకుందాం..

ప్రీమెచ్యుర్ లేబర్ నివారిస్తుంది:

ప్రీమెచ్యుర్ లేబర్ నివారిస్తుంది:

మహిళల్లో ప్రసవించాల్సిన తేది కంటే ముందుగా ప్రసవించడం అనేది గర్భిణీల్లో ఆందోళన కలిగించే విషయం. ప్రీమెచ్యుర్ లేబర్ ను నివారించడంలో ప్లమ్ ఫ్రూట్ సహాయపడుతుంది. ప్లమ్ ఫ్రూట్ లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది మజిల్స్ రిలాక్స్ చేస్తుంది. ప్రీమెచ్యుర్ కాంట్రాక్షన్ మరియు లేబర్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఐరన్ అందిస్తుంది:

ఐరన్ అందిస్తుంది:

గర్భధారణ సమయంలో హార్ట్ కు ఎక్కువ బ్లడ్ ను పంప్ చేస్తుంది . ఇది బేబీ గ్రోత్ కు కూడా సహాయపడుతుది. అందువల్ల గర్భిణీ స్త్రీలు అనిమీయాకు గురౌతుంటారు . ఐరన్ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల ఐరన్ లోపంను కంట్రోల్ చేయవచ్చు, అయితే నేచురల్ గా ప్లమ్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే విటమిన్ సి తల్లితీసుకునే డైట్ నుండి ఐరన్ త్వరగా గ్రహిస్తుంది.

మలబద్దకం మరియు హెమరాయిడ్స్ ను తగ్గిస్తుంది:

మలబద్దకం మరియు హెమరాయిడ్స్ ను తగ్గిస్తుంది:

గర్భధారణ సమయంలో ఎక్స్ ట్రాహార్మోన్స్ మరియు యూట్రస్ పెరగడం వల్ల కడుపుబ్బరం, మలబద్దకం మరియు హెమరాయిడ్స్ సమస్య ఉంటుంది. ప్లమ్ ఫ్రూట్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది బౌల్ మూమెంట్ ను సులభం చేస్తుంది . దాంతో మీరు బెటర్ గా ఫీలవుతారు.

స్ట్రెస్ మరియు అలసటను తగ్గిస్తుంది:

స్ట్రెస్ మరియు అలసటను తగ్గిస్తుంది:

గర్భధారణ సమయంలో చాలా మంది మహిళలు స్ట్రెస్ మరియు అలసటకు గురి అవుతుంటారు. కారణమేదైన ఫలితం చాలా చెడుగా ఉంటుంది. ఎనర్జీ లెవల్స్ తగ్గిపోతుంటాయి. నార్మల్ లైఫ్ పొందడానికి చాలా కష్టంగా భావిస్తుంటారు. కాబట్టి గర్భిణీ రెగ్యులర్ డైట్ లో ప్లమ్ ఫ్రూట్ చేర్చుకోవడం వల్ల ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు పొటాషియంలు తగినంత ఎనర్జీని అందిస్తాయి.

బోన్ హెల్త్:

బోన్ హెల్త్:

గర్భధారణలో ఎముకల ఆరోగ్యం అత్యంత ముఖ్యమైనది . ఎందుకంటే పుట్టేబోయే బిడ్డకు క్యాల్షియం సప్లిమెంట్ అత్యధికంగా అవసరమవుతుంది. స్కెలిటల్ స్ట్రక్చర్ ఇంప్రూమెంట్ కు చాలా అవసరం అవుతుంది. అందుకు గర్భిణీలకు క్యాల్షియం సప్లిమెంట్ సూచిస్తుంటారు. ప్లమ్స్ లో విటమి్ కె, క్యాల్షియం మరియు విటమిన్ డిలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి గొప్పగా సహాయపడుతాయి.ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

వ్యాధినిరోధకతను పెంచుతాయి

వ్యాధినిరోధకతను పెంచుతాయి

గర్భధారణలో జలుబు, దగ్గు, డయోరియా వంటి సమస్యలను తగ్గించుకోవడం చాలా అవసరం . గర్భధారణ సమయంలో ఇటువంటి సాధరణ జబ్బులు ఎక్కువగా బాధిస్తుంటాయి. వీటి నుండి బయటపడాలంటే ప్లమ్ ఫ్రూట్స్ లోని విటమిన్ సి గ్రేట్ గా సహాయపడుతుంది. వ్యాదినిరోధకత పెంచుతుంది.

బ్లడ్ క్లాట్స్ నివారిస్తుంది:

బ్లడ్ క్లాట్స్ నివారిస్తుంది:

ప్లమ్ ఫ్రూట్ లో విటమిన్ కె అధికంగా ఉంటుంది. ఇది బ్లడ్ క్లాట్స్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

జస్టేషనల్ డయాబెటిస్ నివారిస్తుంది:

జస్టేషనల్ డయాబెటిస్ నివారిస్తుంది:

గర్భాధారణ సమయంలో వచ్చే జస్టేషనల్ డయాబెటిస్ ను నివారించడానికి లోగ్లిజమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవాలి. ప్లమ్ ఫ్రూట్ ఒక బెస్ట్ ఫ్రూట్ . దీన్ని తీసుకోవడం వల్ల జస్టేషనల్ డయాబెటిస్ నివారించుకోవచ్చు.

బ్లెడ్ ప్రెజర్ ను రెగ్యులేట్ చేస్తుంది:

బ్లెడ్ ప్రెజర్ ను రెగ్యులేట్ చేస్తుంది:

గర్భిణీలు తరచూ హైబ్లడ్ ప్రెజర్ కు గురౌతుంటారు. ప్లమ్స్ లో ఉండే పొటాషియం హైబ్లడ్ ప్రెజర్ ను రెగ్యులేట్ చేస్తుంది . ప్లమ్ లో ఉండే ఫైబర్ కంటెంట్ అందుకు గ్రేట్ గా సహాయపడుతుంది.

Story first published: Sunday, July 31, 2016, 12:00 [IST]
Desktop Bottom Promotion