Latest Updates
-
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్! -
ఉదయం 5 గంటలకు నిద్రలేస్తేనే సక్సెస్ వస్తుందా?.. ప్రముఖ న్యూరోసైంటిస్ట్ చెబుతున్న సంచలన నిజాలివే!
గర్భిణీ స్త్రీలు వాక్ చేయడం వల్ల పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్
మహిళలు, నెలతప్పిన వెంటనే గర్భాదారణ కాలం మొదలవుతుంది. అంటే మూడు త్రైమాసికాలు ఉంటాయి . ఈ మూడు త్రైమాసికాలు, ఒక్కోత్రైమాసిక ఒక్కో విధంగా ఉంటుంది. పొట్టలో పెరిగే శిశువును బట్టి త్రైమాసికంలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి .
మహిళల జీవితంలో గర్భధారణ చాలా ముఖ్యమైన గట్టం . మరియు ఈ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. గర్భిణీలు ఫిజికల్ గా మరియు మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి.
వ్యక్తిగతంగా మీఅంతట మీరు ఫిజికల్ గా హ్యాపిగా ఉండటం కోసం మీరు తరచూ డాక్టర్స్ సలహాలను తీసుకోవాలి. అలాగే డాక్టర్ సలహా ప్రకారం డైటరీలో మార్పులు చేసుకోవాలి.
అదేవిధంగా , ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలంటే, మీ రెగ్యులర్ డాక్టర్ కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ లేదా వ్యాయామాలను సూచిస్తుంటారు ., వాటిలో గర్భిణీ స్త్రీలకు నడక చాలా సులభమైనది మరియు సురక్షితమైనది.
మీకు దగ్గరలో ఉన్న పార్క్ లో చాలా సింపుల్ గా నడక సాగించడం వల్ల బాగా నిద్రపడుతుది మరియు స్ట్రెస్ లెవల్స్ తగ్గించుకోవచ్చు, ఇది ఖచ్చితంగా ప్రసవంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఫాస్ట్ గా రికవర్ అవ్వడానికి సహాయపడుతుంది.
ఫిజికల్ యాక్టివిటీస్ లో వాకింగ్ చాలా ఉత్తమమైనది . ఇది చాలా వ్యాయామం కంటే చాలా సులభమైనది, నడకకు ఎలాంటి సూచనలు, లేదా పరికరాలు అవసరం ఉండదు. మీకు కావాల్సిందల్లా ఒక చక్కటి మంచి షు ఉంటే సరిపోతుంది.
గర్భధారణ సమయంలో చిన్న పాటి నడక సాగించడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు . మరి గర్భిణీలు చిన్న పాటి నడక వల్ల పొందే ప్రయోజనాలేంటో చూద్దాం...

ఒత్తిడి తగ్గించుకోవచ్చు:
గర్భాధారణ సమయంలో, ప్రతి ఒక్క మహిళ మూడ్ లో మార్పులుంటాయి . ఆ సమయంలో డిప్రెషన్ కు గురి అవుతారు, ఒత్తిడికి లోనవుతారు. కాబట్టి, ఈ సమయంలో వాక్ చేయడం వల్ల మెదడులో ఎండోర్ఫిన్ ఎంజైమ్స్ స్రవిస్తాయి. ఇవి మంచి మూడ్ ను అందిస్తు. అందువల్ల గర్భిణీ స్తరీలు ఒత్తిడి తగ్గించుకోవడానికి, మంచి మూడ్ పొందడానికి నడక మంచిది.

మలబద్దకం నివారిస్తుంది:
గర్భిణీలు గర్భాధారణ సమయంలో చిన్న పాటి నడక సాగించడం వల్ల మలబద్దకం నుండి ఉపశమనం కలుగుతుంది . గర్భాదారణ కాలంలో శరీరంను యాక్టీవ్ గా ఉంచుకోవడం వల్ల, బౌల్ కూడా యాక్టివ్ గా ఉంటుంది. 15నుండి 20 నిముషాలు డైలీ బ్రిస్క్ వాక్ చేయడం వల్ల క్లెవర్ బౌల్ ను పొందవచ్చు. మలబద్దకం నివారించుకోవచ్చు.

అలసటను తగ్గించుకోవచ్చు:
గర్భాదారన సమయంలో చాల మంది మహిళలు తరచూ అలసటకు గురి అవుతుంటారు . ముఖంగా మొదటి త్రైమాసికం, మరియు మూడవ త్రైమాసికంలో అలసట ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కొద్దిగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అయితే అదేపనిగా రెస్ట్ తీసుకోవడం వల్ల వ్యతిరేఖ ఫలితాలను సూచిస్తుంది . వ్యాయమం మరియు రెస్ట్ రెండు మరింత ఎక్స్క్యూట్ చేస్తుంది. మద్యమద్యలు చిన్న పాటి నడక వల్ల అలసటను తగ్గించుకోవచ్చు . ఎనర్జీలెవల్స్ రీస్టోర్ చేసుకోవచ్చు.

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:
సాధారణంగా, గర్భాధారణ సమయంలో బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంటుంది. హైలీ బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ఫలితంగా ప్రి ఎక్లిప్సియా కు గురికావల్సి వస్తుంది. కాబట్టి రెగ్యులర్ వాక్ వల్ల మీ బ్లడ్ ప్రెజర్ లెవల్స్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు . గర్భాధారణ సమయంలో వాకింగ్ వల్ల పొందే బెస్ట్ బెనిపిట్ ఇది.

ఫెక్సిబిలిటీగా ఉంటుంది:
నార్మల్ గా వాక్ చేయడం వల్ల బాడీ ఫెక్సిబిలిటి మెరుగుపడుతుంది.మరియు హిప్ మజిల్స్ ను స్ట్రాంగ్ గాఉంచుతుంది .దాంతో ప్రసవం ఈజీగా త్వరగా అవుతుంది . నొప్పిని నివారిస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో వాక్ చేయడం వల్ల ఇది ఒక హెలతీ బెనిఫిట్

బెటర్ స్లీప్:
గర్భిణీ స్త్రీలు, బ్రిస్క్ లేదా లీజర్ వాక్ ను అరగంట చేయడం వల్ల మంచి నిద్రపడుతుంది. గర్భాధారణ సమయంలో నిద్రలేమిని నివారిస్తుంది.

బాడీ వెయిట్ ను మెయింటైన్ చేస్తుంది. :
గర్భిణీ స్త్రీలు రెగ్యులర్ వాక్ వాక్ వల్ల శరీరం యొక్క బరువు కంట్రోల్లో ఉంచుతుంది . ఇది క్రమంగా బేబీ వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటుంది . ఇలా ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువ. అందుకే గర్భాధారణ సమయంలో వాకింగ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.



Click it and Unblock the Notifications