Latest Updates
-
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా
ప్రెగ్నెన్సీ సమయంలో ఈ నట్స్ తింటే పుట్టబోయే బిడ్డ తెలివిగా ఉంటుంది
ప్రెగ్నెన్సీ సమయంలో ఈ నట్స్ తింటే పుట్టబోయే బిడ్డ తెలివిగా ఉంటుంది
గర్భధారణ సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా గర్భిణి నిత్యం తినే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే గర్భధారణ సమయంలో తల్లి తినే చాలా ఆహారాలు తల్లికి మాత్రమే కాదు కడుపు పెరుగుతున్న శిశువుకు కూడా మంచివి.
గర్భిణీ స్త్రీలు తినేటటువంటి ఆహారాల్లో ముఖ్యమైన ఆహారాల్లో ఒకటి నట్స్(డ్రై ఫ్రూట్స్)ఒకటి. నట్స్ సాధారణంగా ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి మంచివి. అలాంటి గర్భిణీలకు రెట్టింపు ప్రయోజనాలను అందిస్తాయి. ఎలాగంటే వీటిలో ప్రోటీన్లు, క్యాల్షియం, ఐరన్ మరియు ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు ఉండటం వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతాయి. అంతే కాదు కొలెస్ట్రాల్ బూస్టర్ గా చెప్పుకొనే వాటిలో ఇవి ఒకటి. బాదం, అంజీర, జీడిపప్పు, పిస్తా వంటి చాలా రకాల డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలను అందిస్తాయి. వాస్తవంగా చెప్పాలంటే ఇవి తల్లి కంటే శిశువుకే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
గర్బిణీ స్త్రీలు వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

శిశువు మెదడు అభివృద్ధి చెందుతుంది
గర్భధారణ సమయంలో డ్రై ఫ్రూట్స్ (ఎండు ఫలాలు) తినడం వల్ల శిశువు మెదడు అభివృద్ధి చెందడానికి సహాయపడుతాయి. ఇది భవిష్యత్తులో పిల్లల తెలివితేటలకు సహాయపడుతాయి. వీటి వల్ల పిల్లలో మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. గర్భధారణ సమయంలో ఎండు గింజలు తినడం వల్ల మొదడు యొక్క నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గర్భం పొందిన మొదటి 12 వారాల్లో అంటే మొదటి మూడు నెలలు ఇది చాలా ఉత్తమంగా జరుగుతుంది.

వీటిలో
వీటిలో భాస్వరం, పొటాషియం, జింక్, సెలీనియం మరియు రాగి వంటివి అధిక శాతం ఉంటాయి. పిండం సరైన ఎదుగుదలకు ఇవన్నీ చాలా అవసరం. భాస్వరం, క్యాల్షియం మరియు సెలీనియంలు ఎముకుల అభివ్రుద్దికి చాలా మంచిది. అలాగే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే పొటాషియం చాలా ముఖ్యం. అలాగే తల్లికి అవసరమయ్యే ఆరోగ్యకరమైన కొవ్వును అందిడానికి మంచి మూలం. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ను పెంచి, గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

డ్రైనట్స్ లో విటమిన్ ఇ
డ్రైనట్స్ లో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఇది తల్లి మరియు శిశువు చర్మ సంరక్షణకు చాలా అవసరం అవుతుంది. చర్మం యవ్వనంగా మరియు ఎటువంటి ముడతలు లేకుండా చేస్తుంది. ఈ నట్స్ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మకణాలు యవ్వనంగా పెరగడానికి మరియు చర్మాన్ని మృదువుగా ఉంచడానికి సహాయపడుతుంది. వేరుశెనగ, వాల్ నట్స్, బాదం మరియు జీడిపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.

ప్రోటీన్లు :
నట్స్ లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. మాంసాహారాలు తినని వారికి ఈ నట్స్ ఒక గొప్ప మార్గం. మాంసాహారాల్లో ఉన్న ప్రోటీన్లన్నీ ఈ నట్స్ ద్వారా పొందుతారు. ఇవి శిశువులో కండరాలు ఏర్పడటానికి చాలా అవసరం. గర్బధారణ సమయంలో శిశువు ఆరోగ్యకరమైన బరువును పెంచడానికి ఉత్తమమైన మార్గాల్లో ఇది ఒకటి.

నట్స్ అలర్జీలను నివారిస్తాయి :
శరీరంలో ఏవైనా అలర్జీ ఉన్నవారు నట్స్ తినడం వల్ల, శిశువుల్లో కూడా భవిష్యత్తులో ఎలాంటి అలార్జీలు రాకుండా నివారించడానికి సహాయపడుతాయని కొన్ని అధ్యనాలు చెబుతున్నాయి. అయితే వీటి వల్ల గర్భిణీ స్త్రీకి అలర్జీ ఉన్నట్లైతే వెంటనే వీటిని తినడం మానేయాలి.

ఐరన్ సమృద్ధిగా ఉంటుంది
నట్స్ లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది తల్లి, బిడ్డకు చాలా అవసరం. ఇద్దరిలో హీమోగ్లోబిన్ ఉత్పత్తి చేయడానికి సహాయపడుతాయి. గర్భాధారణ సమయంలో రక్తహీనతనను నివారించడానికి సహాయపడుతాయి. ఇది కడుపులో పెరుగుతున్న శిశువుకు రక్తం మరియు ఆక్సిజన్ సరఫరా చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ శిశువు యొక్క మొదడు మరియు హృదయ ఆరోగ్యానికి సహాయపడతాయి.

గర్భిణీ స్త్రీలకు :
గర్భధారణ సమయంలో గర్భిణీలు సాధారణంగా ఎదుర్కొనే సమస్య మలబద్దకం. ఈ సమస్యను ఎదుర్కోవడానికి నట్స్ గొప్పగా సహాయపడుతాయి. వీటిలో ఉండే ఫైబర్ కంటెంట్ ఈ గుణాన్ని అందిస్తాయి. ఇవి జీర్ణక్రియ సాఫీగా జరగడానికి మరియు ప్రేగు ఆరోగ్యంగా ఉండటానికి గొప్పగా సహాయపడుతాయి



Click it and Unblock the Notifications











