Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
అనపగింలు, వంకాయ పులుసు: వింటర్ స్పెషల్
Anapa Ginjalu, Vankaya Pulusu జలుబును నివారించే శక్తిని కూడా పెంచుతాయి. డిసెంబర్ చివరి వారం, వచ్చే ఏడాది మొదటి వారంలో రాష్ట్రంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ హేమంతరుతువులో అడుగు పెట్టగానే మార్కెట్లో వీధులన్నీఅనప కాయలతో నిండిపోయాయి. ఈ సీజన్లో అనపకాయలకు చాలా డిమ్యాండ్. ఒక కేజి అనపకాయలు రూజ 50 నుండి రూ. 100 వరకు అమ్ముతుంటారు.
అనపగింజలతో చేసిన రకరకాల వంటలు క్షణాల్లో నోరూరిస్తాయి. అనపగింజలతో ఉప్మా, వేపుడు, అనపగింజల నిప్పట్టు, కోడుబాలె, పులుసు, ఉప్పునీళ్ళ చారు, మసాలావడే, పితికిపప్పు, పితికన పప్పుచికెన్. చికెన్ కైమా పితికప్పు, మటన్ లెగ్ వింత్ పితికిపప్పు ఇలా ఒకట్రెండు..కాదు అనపగింజలతో ఇంకా ఎన్ని రకాల వంటలు వండుతారో ఈ దేవుడికే తెలియాలి. ఇవి రుచితో పాటు, ఇది మంచి పోషకాహారం కలిగిన కూరగాయ.

అనపగింజలు రుచికరంగా ఉండటమే కాదు, పోషకాలు నిండుగా ఉంటాయి. చలి కాలంలో కూడా నోటికి రుచికరంగా ఉంటుంది. జలుబును నివారించే శక్తిని కూడా పెంచుతాయి. డిసెంబర్ చివరి వారం, వచ్చే ఏడాది మొదటి వారంలో రాష్ట్రంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. చలిని తట్టుకోవడానికి అనపగింజలను వివిధ రకాలుగా వంటల్లో చేర్చుకోవడం మంచిది. అయితే ఈరోజు మనం అనపగింజల పులుసు ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకుందాం?
కావలసిన పదార్థాలు:
అనపకాయలు: 1kg(పొట్టు తీసి గింజలు సపరేట్ చేసుకోవాలి)
వంకాయలు : 2(బాగా కడిగి కావల్సిన సైజ్ లో కట్ చేసి పక్కన
పెట్టుకోవాలి)
టమోట: 2
ఉల్లిపాయ: 2
వెల్లుల్లి: 5రెబ్బలు
కొబ్బరి: చిన్న ముక్క
జీలకర్ర: 1/2tsp
మిరియాలు: 1/2tsp
ధనియా: 2tsp
కారం: 1 1/2tsp
పసుపు: 1/2tsp
కొత్తిమీర: కొద్దిగా
కరెపాకు: రెండు రెమ్మలు
ఆవాలు: 1tsp
చింతపులుసు: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినింత
తయారు చేయు విధానము:
1. మొదటగా అనపకాయల నుండి గింజలను వేరు చేసి పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఒక గిన్నెలో అనపగింజలను వేడినీళ్ళలో వేసి ఉడికించాలి.
అందులోనే 1టమోటో, చిన్న ఉల్లిపాయ కూడా వేసి ఉడించికించి, టమోటో,
ఉల్లిపాయను పక్కన తీసి పెట్టుకోవాలి.
3. తర్వాత గింజలు ఉడుకుతున్నంతనప్పుడు , దోరగా వేయించిన వంకాయ
ముక్కలను కూడా వేసి ఉడికించాలి.
4. అంతలోపు పులుసుకు రెడీ చేసుకోవాలి. కొద్దిగా కొబ్బరి తురుము,
జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, ఉడికించిన ఉల్లిపాయ, టమోటో వేసి
మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
5. ఇప్పుడు అందులోనే కారం, ధనియా, పసుపు, కొత్తిమీర, ఉడుకుతున్న
అనపగింజలు ఒక చెంచా వేసి మెత్తగా గ్రైడ్ చేసుకోవాలి.
6. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతటిని ఉడుకుతున్న గింజల్లో పోసి, బాగా
కలియబెట్టాలి. తర్వాత ఒక టమోటో కట్ చేసి అందులో గింజలు మొత్తబడే వరకూ
ఉడికించాలి. చివరగా రెండు టీస్పూన్ల చింత పులుసు అందులో కలిపి
దింపుకోవాలి.
7. మరో పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక, ఆవాలు,
కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేగించి గింజల పులుసును
అందులో పోసి ఐదు నిమిషాల తర్వాత దించేయాలి. అంతే అనప గింజల పులుసు
రెడీ. ఇది వేడి వేడి అన్న, ముద్ద(సంగటి), చపాతిలలోకి చాలా రుచికరంగా
ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications