Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
గుంటూరు చికెన్ మసాలా..తింటే నోట్లో బ్లాస్టే..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
గుంటూరు చికెన్ మసాలా చాలా ఫేమస్ అని మీరు చాలా సందర్భాలలో విని ఉంటారు. గుంటూరు కొత్తగా వెళ్లినవాళ్లు అయితే ఎక్కడ స్పెషల్ గుంటూరు చికెన్ మసాలా దొరుకుందా అని అడ్రెస్ వెతుక్కొని వెళ్లి మరీ తింటుంటారు. చాలా రుచికరంగా ఉండే గుంటూరు చికెన్ మసాలాని ఇంట్లో కూడా సులభంగా తయారుచేసుకోవచ్చు. గుంటూరు ఫేమస్ చికెన్ మసాలా తయారుచేయడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
గుంటూరు చికెన్ మసాలా తయారీకి కావలసిన పదార్థాలు
-ధనియాలు
-జీలకర్ర
-ఎండుమిర్చి
-ఆవాలు
-ఆయిల్
-వెల్లుల్లి
-అల్లం
-కొత్తిమీర
-కరివేపాకు
-చికెన్
-కారం
-ఉప్పు
-పసుపు
-మిరియాలు
-ఉల్లిపాయ
-పచ్చిమిర్చి
-టమాటో

గుంటూరు చికెన్ మసాలా తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 6 ఎండుమిర్చి వేసి ఆయిల్ లేకుండానే వేయించాలి.
-కొద్దిగా రంగు మారిన తర్వాత వాటిని ఓ ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి
-చల్లారిన వాటిని మిక్సీలో వేసి మెత్తని పౌడర్ లా చేసి ఒకటిన్నర స్పూన్ మాత్రం మిక్సీ గిన్నెలో ఉంచి మిగిలినదంతూ ఓ గిన్నెలోకి తీసుకొని పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు మసాలాల మిశ్రమం ఉన్న మిక్సీ గిన్నెలో 4 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం ముక్కలు వేసి కావాలనుకుంటనే కొంచెం నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా చేసుకొని దీనిని మరో ప్లేట్ లోకి తీసుకొని పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు అరకేజీ చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఓ బౌల్ లో వేసి అందులో పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు,తయారుచేసుకున్న మసాలా పేస్ట్, 1 స్పూన్ కారం వేసి మొత్తం ముక్కలకు పట్టేలా బాగా కలపి అరగంట పాటు పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 3 స్పూన్ల ఆయిల్ వేడి చెయ్యాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి అవి వేగాక ఇందులోనే 2 తరగిన ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసి వేగించాలి.
రాముడి కాలం నాటి బ్రేక్ ఫాస్ట్..తింటే 100 ఏళ్లు గ్యారెంటీ,ఎలా చేయాలంటే..
-ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులో మసాలాలు పట్టించి బౌల్ లో ఉంచిన చికెన్ ముక్కలు వేసి బాగా కలపాలి.
-తర్వాత అందులోనే 2 తరిగిన టమాటో ముక్కలు వేసి కలపాలి. 5 నిమిషాల తర్వాత అందులో ముందుగా రెడీ చేసుకున్న పౌడర్ ని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి.
-తర్వాత అందులో తాజా కరివేపాకు వేసి కలపండి.
-టమాటోలు మెత్తబడిన తర్వాత అందులో అర కప్పు మంచినీళ్లు పోయండి. అందులో అర స్పూన్ ఉప్పు వేసి బాగా కలబెట్టి మూతపెట్టి 15 నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడికించాలి.
-తర్వాత మూత తీసి ముందుగా రెడీ చెసి పెట్టుకున్న మసాలా పౌడర్ కొంచెం, కొత్తిమీర తరుగు చల్లి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే గుంటూరు చికెన్ మసాలా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications