Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Banana Bread: అరటి పండుతో బ్రెడ్.. తింటే బాడీలోని కొవ్వు అంతా కారిపోతుంది.. ఎలా చేసుకోవాలంటే?
అరటి పండుతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ప్రతిరోజూ అరటిపండు తినడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరగడంతో పాటు శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. అరటి పండుతో జ్యూస్, సలాడ్ వంటివి చేసుకొని తింటూ ఉంటారు. అయితే అరటిపండుతో చేసుకునే బ్రేడ్ వేరే లెవెల్లో ఉంటుంది. దీనిని బనానా బ్రేడ్ ఫిట్టరా అని పిలుస్తారు. గుడ్డు, అరటిపండు, బ్రేడ్ మిశ్రమంతో దీనిని తయారు చేస్తారు. ఎంతో సులభంగా రుచికరమైన పద్దతిలో దీనిని ఎలా చేసుకోవాలి? దీనిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బనానా బ్రెడ్ ఫిట్టారా తయారీకి కావాల్సిన పదార్థాలు
- దోరగా మగ్గిన అయిదు అరటి పండ్లు
- పన్నెండు కోడిగుడ్లు
- ముప్పావు కప్పు కొబ్బరి పాలు
- అర కప్పు ఖర్జూరాలు
- నాలుగు చిన్న ముక్కల దాల్చిన చెక్క పొడి
- రుచికి సరిపడా ఉప్పు
- ఒక టీస్పూన్ వెనీలా క్రీమ్
- అరకప్పు డ్రై ఫ్రూట్స్
బనానా బ్రెడ్ ఫిట్టారా తయారీ విధానం
ఈ బనానా బ్రెడ్ ఫిట్టారా తయారు చేసుకోవడానికి ముందుగా ఒవేన్ను బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ బనానా బ్రెడ్ చేసుకునే గిన్నెలో లోపలి భాగంలో కాస్త ఆయిల్ పూసుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే గిన్నెను ఎంచుకునే ముందు గుడ్లు సరిగ్గా ఉడికేందుకు వీలుగా ఉండే గిన్నె తీసుకోవడం ఉత్తమం.
ఆ తరువాత గుడ్లను పగలగొట్టి అందులో కొబ్బరి పాలను వేసుకోవాలి. ఆ తరువాత కొబ్బరి పాలలో గుడ్ల సోన కలిసే విధంగా మెల్లగా సున్నితంగా సులభంగా గుడ్ల సొనను గిలకొట్టుకోవాలి. ఆ తరువాత అందులో నిలువునా చీరిన అరటి పండు ముక్కలను వేసుకోవాలి. అలాగే ఖర్జూర గుజ్జును కూడా వేసుకోవాలి. అన్ని చక్కగా కలిసిపోయినట్లు నిర్ధారించుకున్న తరువాత ఆ గిన్నెను ఒవేన్‌లో పెట్టుకోవాలి.
కొన్ని నిమిషాల పాటు బ్రెడ్ వేడైన తరువాత.. ఒవేన్ తీసి అందులో వాల్నట్స్ లేదా డ్రై ఫ్రూట్స్ చల్లుకోవాలి. ఆ తరువాత 30 లేదా 40 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే బనానా బ్రెడ్ ఫిట్టారా సిద్ధమైనట్లే. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది.
దీనిని తయారు చేసిన వెంటనే తినేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది సుమారు నెల రోజుల పాటు నిలువ ఉంటుంది. ఈ సీజన్లో అయినా దీనిని తయారు చేసుకొని తినేయొచ్చు. ఆరోగ్యంపై ద్రుష్టి పెట్టేవారు. ఫిట్నెస్ సరిగ్గా ఉండాలని కోరుకునే వ్యక్తులు ఈ బ్రెడ్‌ని తినడం వల్ల మంచి ఫలితాలను పొందొచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications