Just In
- 9 min ago
Diet Tips: మీరు ఉదయాన్నే తినే ఈ ఆహారాలే మీ బరువు పెరగడానికి కారణం...!
- 43 min ago
Amazon Sale: తక్కువ ధరలో నాణ్యమైన ఆరోగ్య ఉత్పత్తులు
- 1 hr ago
రాత్రిపూట సాక్స్లో ఉల్లిపాయను పెట్టుకుని పడుకోవడం వల్ల ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా?
- 1 hr ago
మిమ్మల్ని అవసరానికి వాడుకుంటున్నారని మీకు డౌటా? ఇలా గుర్తించొచ్చు!
Don't Miss
- News
Lady: భర్తకు గుడ్ బై, చిన్నవాడితో సహజీవనం, ఇంట్లోకి ఎంట్రీ, ప్రియుడి మర్మాంగం కోసేసింది !
- Sports
Danish Kaneria : వాళ్లిద్దరు లేకుంటే పాకిస్థాన్ ఉత్తదే.. ఏడాది పాటు ఊరికే టైం పాస్..!
- Automobiles
మహీంద్రా థార్ 5-డోర్ వెర్షన్ను చూస్తారా.. అయితే ఇవిగో చూసేయండి మొదటి స్పై ఫొటోలు..!
- Movies
Bigg Boss 6 Telugu: హౌస్ లోకి రాబోయే ఫైనల్ లిస్ట్.. బజ్ లో నాన్ స్టాప్ యాంకర్!
- Finance
IPO News: మార్కెట్లోకి మరో ఐపీవో.. కంపెనీకి ఫుల్ ఆర్డర్స్.. 32 దేశాలతో వ్యాపారం..
- Technology
8 యూట్యూబ్ ఛానెల్లను బ్యాన్ చేసిన భారత ప్రభుత్వం!! కారణం ఏమిటో...
- Travel
పచ్చని కునూర్లో.. పసందైన ప్రయాణం చేద్దామా?!
బాసుంది తయారీ ; సంప్రదాయ బాసుంది తయారు చెయ్యటం ఎలా
బాసుంది అనే ఒక సాంప్రదాయక స్వీటు ముఖ్యంగా పండగలప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలలో ఎక్కువగా చేస్తారు. పాలతో తయారు చేసే ఈ పదార్థం, పాలను సగానికి మరిగించి, చక్కెర, ఏలకుల పొడి, డ్రైఫ్రూట్లను జతచేసి చేస్తారు.
గుజరాత్ రాష్ట్రంలో ప్రతి పెళ్ళి విందులో తప్పనిసరిగా కన్పించే ఈ స్వీటును పండగలప్పుడు ముఖ్యంగా చేస్తారు. ఎంతో రుచికరంగా ఉండే ఇది వేడిగా లేదా చల్లగా తినవచ్చు.
దీన్ని పూరిలతో కలిపి తింటారు. పెద్ద శ్రమలేకుండానే సులభంగా, త్వరగా దీన్ని చేసుకోవచ్చు. అందుకే పార్టీలలో, పిల్లలకోసం బాసుందిని చేసుకోవచ్చు. మా స్టెప్ బై స్టెప్ విధానంతో, చిత్రాలు, వీడియో సాయంతో మీరే ఇంట్లో తయారుచేసుకోవచ్చు. చదవండి.
బాసుంది రెసిపి వీడియో
Recipe By: మీనా బంఢారి
Recipe Type: స్వీట్లు
Serves: ఇద్దరికి
-
ఫుల్ క్రీమ్ పాలు - అరలీటరు
చక్కెర - 3 చెంచాలు
తరిగిన జీడిపప్పు - 4చెంచాలు
తరిగిన బాదం - 1 చెంచా
ఏలకుల పొడి - ½ చెంచా
-
1. పాలను బాండిలో పోయండి.
2. పాలను మరిగించి మాడిపోకుండా చూసుకోండి.
3. పాలు సగమయ్యేదాకా మరిగించండి.
4. చక్కెర వేసి మరో 2-3 నిమిషాలు కలుపుతూనే ఉండండి.
5. తరిగిన బాదం, జీడిపప్పును వేయండి.
6. అన్నిటినీ బాగా కలపండి.
7. స్టవ్ ఆపేముందు ఏలకుల పొడిని వేసి అందరికీ వడ్డించండి.
- 1.పాలు మరుగుతున్నప్పుడు కింద అతుక్కోకుండా కలుపుతూనే ఉండండి.
- 2. సన్నని మంటలో పాలు సగమయ్యేలా మరగాలి.
- 3. పాలు సగం వరకూ మరిగాకనే చక్కెరను వేయాలి. లేకపోతే గట్టిపడదు.
- 4. కావాలంటే రుచికోసం కుంకుమపువ్వు రేకులను వేసుకోండి.
- వడ్డించే పరిమాణం - 1 కప్పు
- క్యాలరీలు - 398 క్యాలరీలు
- కొవ్వు - 17 గ్రాములు
- ప్రొటీన్ - 14 గ్రాములు
- కార్బొహైడ్రేట్లు - 48గ్రాములు
- చక్కెర - 46 గ్రాములు
- ఐరన్ - 1 %
- విటమిన్ ఎ - 9%
స్టెప్ బై స్టెప్ - బాసుంది తయారీ ఎలా
1. పాలను బాండిలో పోయండి.
2. పాలను మరిగించి మాడిపోకుండా చూసుకోండి.
3. పాలు సగమయ్యేదాకా మరిగించండి.
4. చక్కెర వేసి మరో 2-3 నిమిషాలు కలుపుతూనే ఉండండి.
5. తరిగిన బాదం, జీడిపప్పును వేయండి.
6. అన్నిటినీ బాగా కలపండి.
7. స్టవ్ ఆపేముందు ఏలకుల పొడిని వేసి అందరికీ వడ్డించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.