Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
బీర పొట్టు నువ్వు పచ్చడి: ఆహా ఏమి రుచి తినరా మైమరచి..!
Ridge Gourd Chutney: ఈ రోజు మనం బీర పొట్టు నువ్వు పచ్చడి గురించి తెలుసుకోబోతున్నాం. రోజూ పప్పు, సాంబార్లు తిని తిని నోరు చెడిపోయింటే, కాస్త వరైటీగా పచ్చళ్ళు తయారుచేసుకోవచ్చు.
పచ్చళ్ళల్లో వివిధ రకాలున్నాయి. అయితే చాలా సింపుల్ గా తయారుచేసుకునే పచ్చడి బీర పొట్టు నువ్వుల పచ్చడి. ఈ రెండు పదార్థాలు కూడా చాలా ప్రధానమైనవి. ఈ రెండు ఆరోగ్య పరంగా శరీరానికి ఎన్నో లాభాలను అందిస్తాయి. ముఖ్యంగా ఫైబర్ కంటెంట్ తో పాటు నువ్వుల్లో ఉండే ఐరన్ క్యాల్షియం రెండూ కూడా ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన పోషకాలు. కాబట్టి రుచికి రుచి..ఆరోగ్యానికి ఆరోగ్యం.

ఇంకెందుకు ఆలస్యం బీర పొట్టు నువ్వుల పచ్చడి ఎలా తయారుచేయాలో తెలుసుకుని, రుచి చూసి టేస్ట్ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.
కావాల్సిన పదార్థాలు:
బీరకాయ పొట్ట: 1 cup
నువ్వులు: 1 tbsp
పచ్చిమిర్చి: 5-10(మీ రుచికి సరిపడా వేసుకోవచ్చు)
ఎండు మిర్చి: 3(మద్యకు కట్ చేసుకోవాలి)
పసుపు: 1/2 tsp
ఉప్పు: 1tsp(రుచికి సరిపడా)
చింతపండు: నిమ్మకాయ సైజ్ అంత(నీళ్ళలో నానబెట్టుకోవాలి)
కొత్తిమీర: కొద్దిగా తరిగిపెట్టుకోవాలి
కరివేపాకు: రెండు రెమ్మలు
పోపుకోసం:
ఎండుమిర్చి: 2
నూనె: 2 tsp
ఆవాలు: 1tsp
శెనగపప్పు: 1tsp
ఉద్దిపప్పు: 1tsp
జీలకర్ర: 1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
తయారుచేయు విధానం:
1. ముందుగా స్టౌ ఆన్ చేసి, పాన్ పెట్టి నూనె వేసి , వేడి అయ్యాక అందులో పోపు దినుసులు , కరివేపాకు , పచ్చిమిర్చి, ఎండు మర్చి, నువ్వులు వేసి బాగా వేగనివ్వాలి.
2. అవి వేగిన కొద్ది సేపటికి బీర పొట్టు కూడా వేసి బాగా వేగనివ్వాలి.
3. ఆ తర్వాత పసుపు, ఉప్పు కూడా వేసి బాగా వేగిస్తూ పచ్చి వాసన పోయే వరకూ వేగించుకుని క్రిందికి దింపి, చల్లారనివ్వాలి.
4. వేగించి పెట్టుకున్న మిశ్రమం చల్లారిన తర్వాత మొత్తం మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి , దానికి నీళ్ళలో నానబెట్టుకున్న చింత పండుకూడా జోడించి మిక్స్ పట్టాలి. (కొంత మంది నైస్ రుబ్బుకుంటారు)కచపచాగా రుబ్బుకున్నా రైస్ కు బాగుంటుంది.
5. చివరగా స్టౌ మీద పాన్ పెట్టి, నూనె వేసి వేడి అయ్యాక అందులో కరివేపాకు, పోపు దినుసులు, ఎండు మిర్చి వేసి వేగిన తర్వాత పచ్చడిలో కలుపుకోవాలి. అంతే బీర పొట్టు నువ్వుల పచ్చడి రెడీ. ఇది రైస్ లోకి బెస్ట్ కాంబినేషన్. కాస్త నెయ్యి వేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications