ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్‌ స్టైల్‌లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.!

చిక్కుడుకాయ అంటే ముందుగా గుర్తొచ్చేది అందులో గింజలే. మార్కెట్‌కి వెళ్తే గింజలు లేని చిక్కుడు జోలికి వెళ్లరు. సీడ్స్‌ పుష్కలంగా లావుగా ఉన్న వాటిని మాత్రమే కొనుగోలు చేస్తారు. అలాంటి వాటితో చేసే కర్రీతోనే మజా ఉంటుంది. తినేటప్పుడు క్రిస్పీగా తగులుతుండటంతో ఇంట్లో వాళ్లు రెండు ముద్దలు ఎక్కువే తినేస్తారు. అయితే చిక్కుడుకాయ వండిన ప్రతిసారీ వాటిని ఉడకబెట్టడం తప్పనిసరి. కానీ ఇలా కేటరింగ్‌ స్టైల్‌లో చేశారంటే ఉడకబెట్టాల్సిన పని లేకుండా ఎంతో ఇష్టంగా ఈ కర్రీని చేయొచ్చు. ఎలా చేయాలో చూద్దాం..

Catering style chikkudukaya recipe for chapati and rice here is the process in telugu

కేటరింగ్‌ స్టైల్‌ చిక్కుడుకాయ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు

గింజలు ఉన్న చిక్కుడుకాయలు- అర కేజీ
పచ్చి కొబ్బరి ముక్కలు- కప్పు
నూనె- డీప్‌ ఫ్రైకి సరిపడా
పచ్చిశనగపప్పు- టీస్పూన్‌
మినప్పప్పు- టీస్పూన్‌
జీలకర్ర- టీస్పూన్‌
కరివేపాకు- రెండు రెబ్బలు
ఎండు మిర్చి- మూడు
పసుపు- అరటీస్పూన్‌
వెల్లుల్లి రెబ్బలు- ఆరు
ఇంగువ- కొద్దిగా
ఉప్పు- రుచికి సరిపడా
కారం- రెండు టీస్పూన్లు
ధనియాల పొడి- టీస్పూన్‌
కొత్తిమీర- గుప్పెడు

కేటరింగ్‌ స్టైల్‌ చిక్కుడుకాయ కర్రీ తయారీ విధానం

కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్‌ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే..

ముందుగా చిక్కుడుకాయలను పురుగు లేకుండా చూసుకుంటూ ఒలిచి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి నీళ్లన్నీ పోయేవరకు తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.

స్టవ్‌పైన కడాయి పెట్టుకుని డీప్‌ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుని బాగా కాగిన తర్వాత ఒలిచి కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను డీప్‌ ఫ్రై చేసుకోవాలి. చిక్కుడు కాయ మెత్తగా అయ్యేవరకు వేయించిన తర్వాత వేరే ప్లేట్‌లోకి సర్వ్‌ చేసుకోవాలి.

Catering style chikkudukaya recipe for chapati and rice here is the process in telugu

ఇప్పుడు వేయించిన నూనెలో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె ఉంచి మిగతా ఆయిల్‌ను వేరే డబ్బాలో స్టోర్‌ చేసుకోవాలి. కడాయిలో నూనె వేడయ్యాక పచ్చి శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసి వేయించాలి. ఇంగువ, ఎండుమిర్చి, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి వేసి వేగనివ్వాలి.

తర్వాత పసుపు, కరివేపాకు వేసి కలిపిన తర్వాత వేయించిన చిక్కుడుకాయలను వేసి కలుపుకోవాలి. కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి కాసేపు మగ్గనివ్వాలి.

చుక్క నూనె లేకుండా లంచ్‌ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.!

ఐదు నిమిషాల తర్వాత గ్రైండ్‌ చేసుకున్న పచ్చికొబ్బరి మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి మిశ్రమం నుంచి పచ్చి వాసన పోయి బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవడమే..

ఈ కేటరింగ్‌ స్టైల్‌ చిక్కుడుకాయ వేపుడు వేడివేడిగా అన్నంలోకి, చపాతీల్లోకి అద్భుతంగా ఉంటుంది. లంచ్‌ బాక్స్‌లోకి లేదా డిన్నర్‌లోకి తప్పక ట్రై చేయండి.

[ of 5 - Users]
Desktop Bottom Promotion