Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పక్కా విలేజ్ స్టైల్ రుచితో శనగపప్పు చట్నీ..అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది
Senagapappu Chutney Recipe In Telugug: ఎప్పుడూ తిన్న చట్నీలే తిని తిని బోరు కొడుతుందా. అయితే కాస్త వరైటీగా తయారుచేసుకోండి. అయితే ఈ సారి ఈ తయారుచేసే చట్నీకి కొంచెం విలేజ్ స్టైల్లో తయారుచేసి చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది.
ఈరోజు ఇక్కడ పరిచయం చేస్తున్న చట్నీ సెనగపప్పు చట్నీ, దీన్నే పల్లుల సైడ్ శెనగబ్యాళ్ళు చట్నీ అంటారు. ఈ చట్నీ ఒక ఇంట్లో చేస్తే ఆ సువాసన పది ఇండ్లకైనా పాకాల్సిందే..ఈ చట్నీ ముఖ్యంగా సంగటి ముద్ద, అన్నంలోకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వేరుశెనగ చట్నీని నీళ్లలా చేసి ఇడ్లీ, దోసెతో తింటే అద్భుతం. ప్రధానంగా ఈ చట్నీ చేయడం చాలా సులభం. దీన్ని చేయడానికి 5 పదార్థాలు సరిపోతాయి.

అన్నంలోకి కాస్త నెయ్యి వేసి వడ్డిస్తే ఇక ఆ టేస్ట్ ను 10 రోజులైన గుర్తు పెట్టుకుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం అలాంటి రుచికరమైన ఘుమఘుమలాడే చట్నీ ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ఈ సాధారణ వంటకం క్రింద ఉంది. చదివి రుచి చూసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.
కావాల్సిన పదార్థాలు:
* శెనగపప్పు or చనగ బ్యాళ్ళు(చిక్పీస్): 1 కప్పు
* ఉల్లిపాయలు -1
* వెల్లుల్లి - 5 రెబ్బలు
* చింతపండు -నిమ్మపండు సైజు
* ఎండుమిర్చి - 10
* నూనె - 1 టేబుల్ స్పూన్
పోపు కోసం...
* నూనె - 2 టేబుల్ స్పూన్లు
* ఆవాలు - 1/2 tsp
* శెనగబ్యాళ్ళు - 1/4 tsp
* ఉద్ది బ్యాళ్ళు- 1/4 tsp
* జిలకర్ర- 1
* కరివేపాకు - కొద్దిగా
* ఎండుమిర్చి - 1
రెసిపీ:
* ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి అందులో 1 టీస్పూన్ నూనె
పోసి వేడయ్యాక అందులో శెనగ బ్యాళ్లు దోరగా బంగారు రంగు వచ్చే వరకూ
వేయించాలి.
* వాటిని ఒక ప్లేట్ లోనికి తీసుకుని పక్క పెట్టి చల్లారనివ్వాలి.
* తర్వాత ఎండు మిర్చిని పాన్ లో వేసి మాడిపోకుండా దోరగా
వేగించాలి.
* తర్వాత మిక్సీ జార్ లో ఎండు మిర్చి, శెనగ బ్యాళ్లు, కొద్దిగా
జీలకర్ర, ఉప్పు, చింత పండు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అన్నంలోకి
అయితే కొద్దిగా గరుకుగా రుబ్బుకుంటే రుచి బాగుంటుంది.
* ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు , వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కచ్చపచ
రుబ్బుకోవాలి. (పచ్చిగా ఇష్టపడని వాళ్ళు, పోపులో వేసి వేగించి చట్నీలో
కలుపుకోవచ్చు)
* చివరగా స్టౌ మీద పాన్ పెట్టి, అందులో నూనె పోసి వేడయ్యాక, అందులో
ఆవాలు, ఉల్లి, కరివేపాకు, ఎండుమిర్చి,జీలకర్ర, ఇంగువ పొడి వేసి
తాలింపు చేసి, రుబ్బిన చట్నీ వేసి, కావాల్సినంత నీళ్లు పోసి కలపాలి.
రుచికరమైన చెనిగిబ్యాళ్ళు చట్నీ రెడీ.
image courtesy: Vidhya's Vegetarian Kitchen
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications