Latest Updates
-
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.!
హిమాచల్ ప్రదేశ్ ఫేమస్ కధి పకోడి..వేడి వేడి అన్నంతో తింటే అమృతమే..ఈజీగా చేసుకోండిలా..
మనదేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ప్రత్యేకమైన వంటకాలు ఉంటాయి. కధి అనేది నార్త్ ఇండియాలో ప్రతి ఇంటా ఎంతో ఇష్టంగా తినే ఒక ప్రాథమిక వంటకం. పంజాబీ కధి, గుజరాతీ కధి, రాజస్థానీ కధి ఇలా ఎన్నో రకాలు ఉన్నప్పటికీ, హిమాచల్ ప్రదేశ్ కు చెందిన హిమాచలీ కధి పకోడికు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పెరుగు, శెనగపిండితో చేసే పుల్లటి గ్రేవీని కధి అని, అందులో వేసే శెనగపిండి ఉండలను పకోడి అని అంటారు. వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే దీని రుచి అద్భుతంగా ఉంటుంది.

ప్రముఖ సెలబ్రిటీ చెఫ్ రణవీర్ బ్రార్ తన యూట్యూబ్ ఛానెల్ లో ఈ అద్భుతమైన హిమాచలీ కధి పకోడి రెసిపీని షేర్ చేశారు. ఆయన చెప్పిన ప్రత్యేకమైన తాలింపు పద్ధతితో దీన్ని చేస్తే, దీని రుచి అమృతంలా మారుతుందని ఆయన వివరించారు.
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే
హిమాచలీ కధీ పకోడి తయారీకి కావలసిన పదార్థాలు
పాలకూర పకోడీల కోసం
సన్నగా తరిగిన పాలకూర - 1 చిన్న కట్ట
శనగపిండి - ఒకటిన్నర కప్పులు
గట్టి పెరుగు - 2 నుండి 3 టేబుల్ స్పూన్లు
దంచిన ధనియాలు, కొత్తిమీర తురుము - 1 టేబుల్ స్పూన్
వాము - అర టీస్పూన్
ఇంగువ - అర టీస్పూన్
కారం, పసుపు - అర టీస్పూన్ చొప్పున
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - డీప్ ఫ్రై చేయడానికి
నీళ్లు - తగినంత
కధి తయారీకి కావలసినవి
పెరుగు - 2 కప్పులు కాస్త పుల్లటిది
నీళ్లు - 2 లేదా 3 కప్పులు
శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు
పసుపు, కారం - అర టీస్పూన్ చొప్పున
ఆవ నూనె - 2 లేదా 3 టేబుల్ స్పూన్లు
మెంతులు - కొద్దిగా
ఎండు మిరపకాయలు - 2 లేదా 3
జీలకర్ర - 1 టీస్పూన్
దంచిన ధనియాలు - కొద్దిగా
అల్లం - 1 అంగుళం ముక్క
నెయ్యి - 1 లేదా 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత

పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా!
హిమాచలీ కధీ పకోడి తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో సన్నగా తరిగిన పాలకూర, దంచిన ధనియాలు, శనగపిండి, కొద్దిగా పెరుగు, చేతితో నలిపిన వాము, రుచికి సరిపడా ఉప్పు, ఇంగువ, కారం, పసుపు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పకోడీల పిండిలా కలుపుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె పోసి వేడి చేయండి. నూనె కాగాక పిండిని చిన్నచిన్న పకోడాల్లా వేసుకుంటూ, అవి మంచి బంగారు గోధుమ రంగులోకి మారి కరకరలాడేంత వరకు వేయించాలి. వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో రెండు కప్పుల పెరుగు తీసుకుని ఉండలు లేకుండా బాగా గిలకొట్టాలి. అందులో రెండు కప్పుల నీళ్లు, రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి, పసుపు, కారం వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసి పక్కన ఉంచుకోవాలి.
-ఈ హిమాచలీ కధికి ప్రాణం ఆవ నూనెతో వేసే తాలింపే. ఇందుకోసం స్టవ్ మీద మందపాటి గిన్నె లేదా బాండీ పెట్టి ఆవ నూనె వేడి చేయండి. నూనె వేడెక్కిన తర్వాత మెంతులు, ఎండు మిరపకాయలు, జీలకర్ర, దంచిన ధనియాలు, సన్నగా తరిగిన అల్లం వేసి దోరగా వేయించండి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న పెరుగు మిశ్రమాన్ని అందులో పోసి, అదనంగా మరో కప్పు నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. సన్నని మంట మీద కధిని నెమ్మదిగా ఉడకనివ్వాలి.
-కధి బాగా మరిగి కొద్దిగా చిక్కబడిన తర్వాత, మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కరకరలాడే పాలకూర పకోడాలను అందులో వేయాలి. మరో 2 నుండి 3 నిమిషాల పాటు ఉడికించండి, దీంతో పకోడీలు కధి రసాన్ని పీల్చుకుని లోపల మృదువుగా, భలే రుచిగా మారతాయి. చివరగా పైనుంచి కొద్దిగా కరిగించిన నెయ్యి వేసి బాగా కలపాలి.
-అంతే ఘుమఘుమలాడే హిమాచలీ కధి పకోడి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications