Latest Updates
-
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే..
కొబ్బరి లడ్డూ తయారీ విధానంః గడ్డకడుతున్న పాలతో కొబ్బరి లడ్డూ
కొబ్బరి లడ్డూను అన్నిపండగల్లో సంప్రదాయపు భారత వంటకంగా వ్యవహరిస్తారు. ఇది కొబ్బరి కోరు, గట్టిపడుతున్న పాలతో తయారవుతుంది. స్టెప్ బై స్టెప్ విధానం, చిత్రాలు, వీడియో ఇదిగో, చేసేయండి.
ప్రతి ఇంట్లో ముఖ్య ఉత్సవాలకు, అన్ని పండగలకూ చేసుకునే స్వీటు పదార్థం కొబ్బరి లడ్డూ. ఇది పొడి కొబ్బరికోరు, గట్టిపడే పాలతో తయారవుతుంది.కొబ్బరి, గట్టిపడుతున్న పాలతో ఉడికి ఈ లడ్డూ ప్రత్యేకమైన వాసనను సంతరించుకుంటుంది.
తింటున్నప్పుడు రసంతో కూడిన ఈ లడ్డూ తిరిగి తిరిగి తినాలనిపించేలా చేస్తుంది. ఈ నోరూరించే వంటకం సులువుగా, తొందరగా వండుకోవచ్చు. వంటరాని వారు కూడా ఎక్కువ శ్రమలేకుండానే దీన్ని బాగా తయారుచేసుకోవచ్చు. హఠాత్తుగా స్వీట్లు తినాలపించేవారికి ఇది మంచి ఉపాయం.
కొబ్బరి లడ్డూ తయారీ వీడియో

Recipe By: మీనా బంఢారి
Recipe Type: స్వీట్లు
Serves: 8-10 లడ్డూలు
-
పొడి కోరిన కొబ్బరి - 2 కప్పులు + 1 కప్పు పైన పూతకి
తీపి గట్టిపడిన పాలు (మిల్క్ మెయిడ్ ) - 200 గ్రాములు
తరిగిన బాదం - 2చెంచాలు+ అలంకరణకి
ఏలకుల పొడి - 1 చెంచా
-
1. గట్టిపడిన పాలను వేడిచేసిన కడాయిలో పోసి వెనువెంటనే 2 కప్పుల కొబ్బరికోరును వేయండి.
2. మిశ్రమం గట్టిపడి, అతుక్కుపోతున్నంతవరకు కలుపుతూనే ఉండండి.
3. ఏలకుల పొడి, బాదం పప్పులు వేసి పిండి ముద్దలా మారుతున్నంతవరకూ కలపండి.
4. ఈ మిశ్రమాన్ని గుండ్రటి బంతుల్లాగా చేసుకోండి.
5. ఈ గుండ్రటి లడ్డూలను పొడి కొబ్బరిలో పొర్లించి పట్టించండి.
6. బాదంపప్పులతో అలంకరించండి.
- 1. ఈ లడ్డూలను పచ్చి కొబ్బరికోరుతో కూడా చేసుకోవచ్చు. తాజా కొబ్బరిని వాడితే మొదట తేమను తొలగించటానికి పొడిగా వేయించుకోండి.
- 2. మిశ్రమాన్ని కలుపుతున్నప్పుడు, పిండిముద్దలా మారిన మిశ్రమం అతుక్కోకుండా కడాయి నుంచి ఊడిరావాలని గుర్తుంచుకోండి.
- 3. మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలుగా చేయాలి.
- సరిపోయే పరిమాణం - 1 లడ్డూ
- క్యాలరీలు - 54
- కొవ్వు - 2 గ్రాములు
- ప్రొటీన్ - 1 గ్రాము
- కార్బొహైడ్రేట్లు - 9 గ్రాములు
- చక్కెర - 9 గ్రాములు
స్టెప్ బై స్టెప్ - కొబ్బరి లడ్డూలు చేయటం ఎలా
1. గట్టిపడిన పాలను వేడిచేసిన కడాయిలో పోసి వెనువెంటనే 2 కప్పుల కొబ్బరికోరును వేయండి.


2. మిశ్రమం గట్టిపడి, అతుక్కుపోతున్నంతవరకు కలుపుతూనే ఉండండి.

3. ఏలకుల పొడి, బాదం పప్పులు వేసి పిండి ముద్దలా మారుతున్నంతవరకూ కలపండి.



4. ఈ మిశ్రమాన్ని గుండ్రటి బంతుల్లాగా చేసుకోండి.

5. ఈ గుండ్రటి లడ్డూలను పొడి కొబ్బరిలో పొర్లించి పట్టించండి.


6. బాదంపప్పులతో అలంకరించండి.

Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
