Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
అమెరికన్ చాప్ సుయ్ ఎప్పుడైనా తిన్నారా? రెస్టారెంట్లో చాలా కాస్ట్లీ..ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
సాధారణంగా సాయంత్రం అయితే మనదేశంలో చాలామంది తినే స్నాన్ ఐటమ్స్ లో నూడిల్స్ ఒకటి. అయితే నూడిల్స్ తో తయారుచేసే అమెరికన్ చాప్ సుయ్ ఎప్పుడైనా తిన్నారా? పెద్ద పెద్ద రెస్టారెంట్లలో దొరికి ఈ అమెరికన్ చాప్ సుయ్ ను టేస్ట్ చేయాలంటే భారీగా ఖర్చుపెట్టాల్సిందే. అయితే చాలా తక్కువ ఖర్చుతో దీనిని ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. దీనిని చేయడానికి పెద్ద సమయం కూడా పట్టదు. రెస్టారెంట్ స్టైల్ లో అమెరికన్ చాప్ సుయ్ ని ఇంట్లోనే తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
అమెరికన్ చాప్ సుయ్ తయారీకి కావలసిన పదార్థాలు
-రోల్ నూడిల్స్
-ఆయిల్
-మొక్క జొన్న పిండి
-మైదా పిండి
-వెల్లుల్లి తరుగు
-స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు
-ఉల్లిపాయ
-క్యాబేజీ రేకులు
-క్యాప్సికమ్
-టమాటో కెచప్
-రెడ్ చిల్లీ సాస్
-వెనిగర్
-డార్క్ సోయా సాస్
-క్యారెట్ ముక్కలు
-రోజ్మేరీ పొడి
-వైట్ పెప్పర్ పొడి
-మిరియాల పొడి
-నీళ్లు
అమెరికన్ వెజ్ చాప్ సుయ్ తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కొంచెం నీళ్లు,ఉప్పు వేసి మరగనివ్వాలి.
-తర్వాత అందులో ఓ చిన్న రోల్ నూడిల్స్ ని వేసి అవి 80 శాతం వరకు ఉడికించుకోవాలి.
-80 శాతం ఉడికిన నూడిల్స్ ని ఓ ప్లేట్ లోకి తీసి పెట్టుకోండి. దానిమీద ఓ టీస్పూన్ ఆయిల్ చల్లినట్లు వేసి నూడిల్స్ ను పూర్తిగా చల్లారనివ్వాలి.
-తర్వాత నూడిల్స్ మీద 1 టేబుల్ స్పూన్ మైదా చల్లుకొని చేతితో బాగా కలపండి.
-తర్వాత స్టవ్ మీద బాండీలో ఆయిల్ వేడి చెయ్యాలి. ఆయిల్ వేడయ్యాక అందులో ప్లేట్ లో పక్కన ఉంచిన నూడిల్స్ ను కారప్పూస చుట్టులా చుడుతూ వేయాలి.
-మీడియం మంట మీద క్రిస్సీగా లేత బంగారు గోధుమరంగులోకి వచ్చేదాకా ఫ్రై చేశాక దానిని ఓ ప్లేట్ లోకి తీసి పక్కనపెట్టుకోండి.
పెళ్లిళ్ల స్పెషల్ పనసకాయ బిర్యానీ..నాన వెజ్ ని మించిన టేస్ట్..ఇంట్లోనో ఎలా చేసుకోవాలంటే..
-ఇప్పుడు స్టవ్ మీద బాండీలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి అందులో 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగు, 2 టేబుల్ స్పూన్ల స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు వేసి పెద్ద మంట మీద వెల్లుల్లి బంగారు గోధుమరంగులోకి వచ్చేదాకా ఫ్రై చెయ్యాలి.
-తర్వాత అందులో సగం క్యారెట్ ముక్కలు, సగం ఉల్లిపాయల రేకులు, అరక్పు క్యాబేజి రేకులు, అరకప్పు ఎర్ర,పచ్చ,పసుపు క్యాప్సికమ్ ముక్కలు వేసి పెద్ద మంట మీద 2 నిమిషాలు వేయించాలి.
-తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ల టమాటో కెచప్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీస్పూన్ డార్క్ సోయా సాస్, 1 టీస్పూన్ వెనిగర్ వేసి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చెయ్యండి.
-తర్వాత అందులో 350 ml నీరు పోిసి పెద్ద మంట మీద ఉడకనివ్వాలి.
-ఉడుకుతున్నప్పుడే అందులో చాలా కొద్దిగా ఉప్ప, 1 టీస్పూన్ రోజ్మేరీ పొడి, 1 టీస్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, అర టీస్పూన్ మిరియాల పొడి వేసి 2 నిమిషాలపాటు హై ఫ్లేమ్ మీద ఉడికించాలి.
-తర్వాత ఓ చిన్న కప్పులో 1 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి,పావుకప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలిపి ఆ మిశ్రం మొత్తాన్ని స్టవ్ మీద పాన్ లో కొద్ది కొద్దిగా కలుపుతూ పోయాలి. 1 నిమిషం తర్వాత స్టవ్ మీదనుంచి పాన్ దించేయాలి.
-ఇప్పుడు వేయించి ప్లేట్ లో ఉంచిన నూడిల్స్ సగం మునిగేదాకా ఈ సాస్ మిశ్రమం పోస్తే తినడానికి అమెరికన్ చాప్ సుయ్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications










