Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
పెళ్లిళ్ల స్పెషల్ పనసకాయ బిర్యానీ..నాన వెజ్ ని మించిన టేస్ట్..ఇంట్లోనో ఎలా చేసుకోవాలంటే..
ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లలో చికెన్ బిర్యానీ,మటన్ బిర్యానీ,వెజ్ బిర్యానీకి బదులు పసనకాయ బిర్యానీ ఎక్కువగా పెడుతున్నారు. ముఖ్యంగా ఏపీ, తమిళనాడులో పెళ్లి పంక్షన్ అయినా లేదా మరేదైనా పంక్షన్ అయినా పనసకాయ బిర్యానీని పెడుతున్నారు. పనసకాయ బిర్యానీ నాన్ వెజ్ కి ధీటుగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మాత్రం మళ్లీ ఎప్పుడా అని ఎదురుచూడాల్సిందే. అంత అద్భుతంగా ఉంటుంది మరి రుచి. పనసకాయ బిర్యానీని ఇంట్లోనే తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
పనసకాయ బిర్యానీ తయారీకి కావలసిన పదార్థాలు
-పనసకాయ ముక్కలు
-అల్లం
-వెల్లుల్లి
-మిరియాలు
-ధనియాలు
-సోంపు
-బిర్యానీ ఆకు
-అనాస పువ్వు
-జాపత్రి
-జీలకర్ర
-యాలకలు
-లవంగాలు
-దాల్చిన చెక్క
-పత్తర్ పూల్
-ఆయిల్
-బాస్మతి బియ్యం
-టమాటో
-పచ్చిమిర్చి
-ఉల్లిపాయ
-స్టార్ అనాస
-పుదీనా
-కొత్తిమీర
-పెరుగు
-పాలు
-నిమ్మరసం
-బాస్మతి బియ్యం
-నెయ్యి

పనసకాయ బిర్యానీ తయారీ విధానం
-ముందుగా పచ్చి పనసకాయ ముక్కలను మజ్జిగలో రాత్రంతా నాననెట్టాలి.
-తర్వాత స్టవ్ మీద బాండీ లేదా మూకుడు పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 బిర్యానీ ఆకు, 2 అనాస పువ్వులు, 1 జాపత్రి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 7 యాలకలు, 8 లవంగాలు,1 ఇంచు దాల్చిన చెక్క వేసి సన్నని సెగమీద వేయించాలి.
-మసాలాలు సగంపైన వేగిన తర్వాత అందులో పత్తర్ పూల్(రాతి పువ్వు)కొద్దిగా వేసి వేయించాలి.
-తర్వాత వీటన్నింటిని మిక్సీ గిన్నెలో వేసి అందులో కొంచెం అల్లం, 7 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేయాలి.
-తర్వాత స్టవ్ మీద బాండీపెట్టి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసి అందులో నానబెట్టిన పనస ముక్కలను వేయండి. అవి మెత్తబడి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేదాకా వేయించి తీసి పక్కనపెట్టుకోండి. దీనికి 5 నిమిషాల టైం పడుతుంది.
-తర్వాత స్టవ్ మీద అడుగు మందంగా ఉండే గిన్నెలో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి అది వేడయ్యాక అందులో 1 టీస్పూన్ జీలకర్ర, 4 లవంగ మెగ్గలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 దంచిన యాలకలు,2 స్టార్ అనాస వేసి వేయించి అందులో పొడవుగా,సన్నగా చీరిన 200 గ్రాముల ఉల్లిపాయలు, 4 పొడవుగా చీరిన పచ్చిమిర్చి,కొద్దిగా ఉప్పు వేసి మూతపెట్టి వేయించుకోండి
-ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత అందులో రాత్రంతా నానబెట్టిన అరకప్పు డబుల్ బీన్స్ వేసి మగ్గనివ్వాలి.
-తర్వాత అందులో 1 టమాటో తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా పుదీనా తరుగు, ఒకటిన్నర టీస్పూన్ కారం, అర టీస్పూన్ పసుపు, 50ml నీరు పోసి మెత్తం కలపండి.
-తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసి ఉంచిన మసాలాల పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు కూడా పోసి నీరు పైకి తేలేంతవరకు ఉడికించాలి.
రెస్టారెంట్స్ కి మించిన టేస్ట్..జ్యూసీ తందూరి చికెన్ ను ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూడండి
-నీరు పైకి తేలిన తర్వాత అందులో నానబెట్టిన పనసకాయ ముక్కలు వేసి బాగా కలపి అందులోనే అరకప్పు చిలికిన పెరుగు, అరకప్పు పాలు,1 నిమ్మకాయ రసం పోసి నెమ్మదిగా కలిపి మూతపెట్టి నూనె పైకి తేలేదాకా ఉడికించండి.
-తర్వాత అందులో గంటసేపు నానబెట్టిన రెండున్నర కప్పుల(1 కప్పు 150 గ్రాముల లెక్కన) బాస్మతి బియ్యం, 5 కప్పుల హాట్ వాటర్ పోసి మూతపెట్టి పెద్ద మంటమీద 5 నిమిషాలు ఉడికించాలి.
-పూర్తిగా ఉడకడానికి రెండునిమిషాల ముందు పావుకప్పు నెయ్యి అందులో వెయ్యాలి. అంతే పనసకాయ బిర్యానీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications