ఫ్రిజ్‌లో పెట్టినా నిమ్మకాయలు రంగు మారుతున్నాయా.. ఈ 3 టిప్స్‌తో ఎన్ని రోజులైనా తాజాగానే.!

సీజన్‌ ఏదైనా మన కిచెన్‌లో నిమ్మకాయలు తప్పనిసరిగా ఉండాల్సిందే. పులిహోర, జ్యూస్‌, సలాడ్‌, కూరలు ఇంకా పూజలు ఇలా రకరకాలుగా నిమ్మకాయలను వాడుతుంటాం. కొన్న ప్రతిసారీ కనీసం పది అయినా కొనుగోలు చేసి ఫ్రిజ్‌లో పెట్టేస్తాం. మార్కెట్‌ నుంచి తెచ్చేటప్పుడు తాజాగా, ఆకుపచ్చగా ఉండే నిమ్మకాయలు.. ఫ్రిజ్‌లో పెట్టిన కొన్ని రోజులకే రంగు మారడంతో రుచి, సువాసన కోల్పోతాయి. దీంతో ప్రాణం ఉసూరుమనిపిస్తుంది. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటంటే ఈ సింపుల్‌ చిట్కాలు పాటిస్తే చాలు..

follow these 3 tips lemons kept in the fridge will not change color or dry out

కూరగాయలు, పాలు, పెరుగు ఇలా కిచెన్‌ పదార్థాలను ఎక్కువ కాలం తాజాగా ఉంచేందుకు ఫ్రిజ్‌లు ఉపయోగిస్తుంటాం. అదేవిధంగా నిమ్మకాయలను కూడా స్టోర్‌ చేస్తాం. అయితే వీటిని సరైన విధానంలో ఫ్రిజ్‌లో నిల్వ ఉంచకపోతే అవి త్వరగా పసుపు రంగుకి మారడంతో పాటు ఎండిపోవడం, రుచి కోల్పోవడం వంటివి జరుగుతాయి. అందుకే నిమ్మకాయలు ఎక్కువ కాలం తాజాగా, ఆకుపచ్చగా ఉండాలంటే ఈ సారి కొనుగోలు చేసినప్పుడు ఈ మూడు టిప్స్‌ ట్రై చేసి చూడండి. మీ డబ్బులు వృథా కావు.

చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్‌తో కరకరలాడే మరమరాల మిక్స్చర్‌.!

నీళ్లలో స్టోర్‌ చేయడం

తాజా నిమ్మకాయలు ఇంకా ఎక్కువ రోజు తాజాగా ఉండాలంటే వాటిని నీళ్లలో స్టోర్‌ చేయడం చాలా సులువైన పద్ధతి. ఇందుకోసం మార్కెట్‌ నుంచి తెచ్చిన వెంటనే వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. తర్వాత వాటిని గాలి చొరబడని గాజు లేదా ప్లాస్టిక్‌ పాత్రలో ఉంచాలి. ఇప్పుడు నిమ్మకాయలు మునిగేంత వరకు నీటితో నింపాలి. తర్వాత గాలిచొరబడకుండా గట్టిగా మూత పెట్టి ఫ్రిజ్‌లో స్టోర్‌ చేసుకోవాలి.

follow these 3 tips lemons kept in the fridge will not change color or dry out

నిమ్మకాయలను నీళ్లలో స్టోర్‌ చేయడం వల్ల ఎండిపోకుండా, వాడిపోకుండా ఎక్కువ కాలం తేమగా ఉంటాయి. వాటిలోని నీటి శాతం తగ్గిపోదు. అయితే వీటిని వాడుకునేంతవరకు నీరు మారుస్తూ ఉండటం తప్పనిసరి. వంటలో ఉపయోగించే ముందు ఒకసారి కడిగి వాడుకోండి.

follow these 3 tips lemons kept in the fridge will not change color or dry out

కాగితం లేదా టిష్యూ పేపర్

నిమ్మకాయలు ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉండేలా చేసే మరో సులభమైన పద్ధతి వాటిని విడివిడిగా స్టోర్‌ చేయడం. పేపర్‌ టవల్‌ లేదా టిష్యూ పేపర్‌లో ఒక్కొక్క నిమ్మకాయను విడివిడిగా చుట్టుకోవాలి. వీటన్నిటినీ వీలైతే అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టుకోండి. దీని ద్వారా అధికంగా ఉన్న తేమ పీల్చుకుంటుంది. బూజు పట్టకుండా నిరోధిస్తుంది. అయితే ఈ నిమ్మకాయలన్ని తాజాగా ఆకుపచ్చగా ఉండేలా చూసుకోండి. రంగు మారిగా, మెత్తగా ఉన్నా, పాడైపోయినా వీటి వల్ల మిగతావి తాజాదనాన్ని కోల్పోతాయి.

బ్యాచ్‌లర్స్‌ సైతం ఈజీగా చేసుకునేలా క్రిస్పీ సొరకాయ బజ్జీలు.. టీ, కాఫీలోకి ఆ మజానే వేరు.!

ఆయిల్‌ కోటింగ్‌

పైన చెప్పిన రెండు పద్ధతులు వీలు కాకపోతే సింపుల్‌గా ఈ చిట్కా ట్రై చేయండి. నిమ్మకాయలను శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత వాటిపై చేతితో వంటనూనెను చాలా పలుచని పొరలా అప్లై చేయండి. చాలా తక్కువ నూనెను వాడండి. తర్వాత గాలి చొరబడకుండా గాజు డబ్బాలో వేసి గట్టిగా మూత పెట్టండి. లేదా క్లాత్‌ క్యారీబ్యాగ్‌లో పెట్టి స్టోర్‌ చేయండి. పలుచగా నూనె అప్లై చేయడం ద్వారా తేమను నిలుపుకొంటుంది. త్వరగా ఎండిపోకుండా ఎక్కువ కాలం తాజాగా ఉండేలా చేస్తుంది.

[ of 5 - Users]
Story first published: Thursday, September 10, 2026, 18:16 [IST]
Desktop Bottom Promotion