Latest Updates
-
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.! -
డబ్బు రెట్టింపు చేయడంలో వీరికి సాటి లేరు.. కుబేరుల జాబితాలే ఈ రాశుల వారే టాప్.! -
బ్లాక్ కాఫీ vs గ్రీన్ టీ.. బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ కి ఈ రెండింటిలో ఏది బెస్ట్? -
బ్రేకప్ తర్వాత కూడా..మాజీ లవర్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఎందుకు చూస్తారు?
బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకునేలా క్రిస్పీ సొరకాయ బజ్జీలు.. టీ, కాఫీలోకి ఆ మజానే వేరు.!
బజ్జీలు అనగానే మనకు ఆలూ బజ్జీ, మిర్చి బజ్జీ, అరటికాయ బజ్జీలు గుర్తొస్తాయి. కానీ సొరకాయతో ఎప్పుడైనా ఈ స్నాక్స్ ట్రై చేశారా. పైన సాఫ్ట్‌గా లోపల క్రిస్పీగా ఉండే వీటిని ఒక్కసారి చేశారంటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు. ఇక వర్షాకాలంలో బజ్జీల క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో బయట ఫుడ్ జోలికి వెళ్లకుండా హెల్తీగా సొరకాయతో ఇలా స్నాక్స్ ట్రే చేయండి. వదలకుండా తినేస్తారు. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా వీటిని చేసుకోవచ్చు. సొరకాయ బజ్జీ ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం..

సొరకాయ బజ్జీ తయారీకి కావాల్సిన పదార్థాలు
లేత సొరకాయ- ఒకటి(మీడియం సైజు)
శనగ పిండి- ముప్పావు కప్పు
బియ్యం పిండి- ⅓ కప్పు
కొత్తిమీర- కొద్దిగా
ఉప్పు- రుచికి సరిపడా
కారం- అర టీస్పూన్
పసుపు- పావు టీస్పూన్
ధనియాల పొడి- అర టీస్పూన్
అల్లంవెల్లుల్లి పేస్ట్- టీస్పూన్
కరివేపాకు- కొద్దిగా
వాము- అర టీస్పూన్
సొరకాయ బజ్జీ తయారీ విధానం
ముందుగా ఒక లేత సొరకాయను తీసుకుని తొక్క తీసి కడిగి పెట్టుకోవాలి. దీనిని మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం థిక్‌నెస్‌తో గుండ్రంగా కట్ చేసుకోవాలి.
టేస్టీ మంచూరియానే కాదు, కరకరలాడే అప్పాలు సైతం రెడీ.. క్యాబేజ్‌తో ఇలా ఈజీగా చేసేయండి.!
ఒక వెడల్పాటి గిన్నెలో సగం వరకు నీళ్లు పోసి ఉప్పు వేసుకోవాలి. అందులో ఈ సొరకాయ ముక్కలను పది నిమిషాల పాటు ఉంచాలి.
ఇప్పుడు మరో బౌల్ తీసుకుని అందులో శనగపిండి, బియ్యం పిండి వేసి కలుపుకోవాలి. ఇందులో కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి మొత్తంగా కలిసేలా చూడాలి.

చివరిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసిన కరివేపాకుతో పాటు వామును చేతితో నలిపి వేసి కలపాలి.
ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోసి పిండిని జారుగా(మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా) బజ్జీల పిండి కలుపుకోవాలి.
పది నిమిషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు సొరకాయ ముక్కలను నీళ్లలో నుంచి తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి.
స్టవ్ పైన కడాయి పెట్టుకుని డీప్ ఫ్రేకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె బాగా కాగనివ్వాలి.
వేడివేడి అన్నంలోకి అదిరిపోయే దొండకాయ రోటీ పచ్చడి.. ఇలా చేశారంటే ఇక కూరల జోలికి వెళ్లరు.!
ఇప్పుడు ఒక్కొక్కటిగా సొరకాయ ముక్కలను తీసుకుని శనగపిండి మిశ్రమంలో ముంచి మెల్లగా నూనెలో వేయాలి.
వీటిని బజ్జీల మాదిరిగా రంగు మారేవరకు కాల్చుకోవాలి. ఇలా అన్ని సొరకాయ ముక్కలను పిండిలో ముంచి వేయించి పక్కన పెట్టుకోవాలి.
అంతే టేస్టీ అండ్ క్రిస్పీ సొరకాయ బజ్జీలు రెడీ. బ్యాచ్లర్స్ సైతం వారి రూమ్‌లో దొరికే పదార్థాలతోనే వీటిని ఈజీగా చేసుకోవచ్చు.
సాయంత్రం సమయంలో వర్షం పడుతుండగా టీ, కాఫీ తాగుతూ ఈ సొరకాయ బజ్జీలను ఆస్వాదిస్తుంటే వచ్చే మజానే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
