చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్‌తో కరకరలాడే మరమరాల మిక్స్చర్‌.!

ప్రతిరోజూ సాయంత్రం కాగానే స్నాక్స్‌లో ఏదో ఒకటి తినాలని నాలుక పీకేస్తూ ఉంటుంది. ఇంట్లో చేసుకునే ఓపిక లేక బయట బజ్జీలో, పునుగులో తెచ్చుకుని లాగించేస్తుంటారు. కానీ వీటిలో ఆయిల్‌ ఇంకా స్ట్రీట్‌ ఫుడ్‌ కారణంగా జీర్ణక్రియపైనా ప్రభావం పడుతుంది. కాస్త ఓపిక తెచ్చుకున్నారంటే పదే నిమిషాల్లో ఇంట్లోనే హెల్తీగా మిక్స్చర్‌ చేసుకోవచ్చు. అదే మరమరాల మిక్స్చర్. కరకరలాడుతూ పుదీనా ఫ్లేవర్‌తో చేసే ఈ స్నాక్స్‌ను కరెక్ట్‌ ప్రాసెస్‌లో చేస్తే వారం రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. ఆఫీస్‌ క్యాంటీన్‌లో మైదా జోలికి వెళ్లకుండా లైట్‌గా ఉండే ఈ చిరుతిండిని లాగించేయొచ్చు. ఎలా తయారుచేయాలో చూద్దాం..

Healthy evening snacks murmura mixture ingredients and preparation process

మరమరాల మిక్స్చర్‌ తయారీకి కావాల్సిన పదార్థాలు

నూనె- డీప్‌ ఫ్రైకి సరిపడా
తాజా పుదీనా- రెండు కట్టలు
తాజా కొత్తిమీర- రెండు కట్టలు
పచ్చిమిర్చి- ఐదు
కరివేపాకు- మూడు రెబ్బలు
వేరుశనగ- అర కప్పు
జీడిపప్పు పలుకులు- పది
నెయ్యి- టేబుల్‌ స్పూన్‌
పసుపు- అర టీస్పూన్‌
ఇంగువ- పావు టీస్పూన్‌
ఉప్పు- టీస్పూన్‌
మరమరాలు- 100 గ్రాములు
చాట్‌ మసాలా పౌడర్‌- అరటీస్పూన్‌

మరమరాల మిక్స్చర్‌ తయారీ విధానం

ముందుగా పుదీనా ఆకులను కట్‌ చేసి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. కొత్తిమీరను కూడా కట్ చేసుకుని కడిగి ఆరబెట్టుకోవాలి.

maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా!

స్టవ్‌పైన కడాయి పెట్టుకుని డీప్‌ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుని కాగనివ్వాలి. ఇప్పుడు తడి లేకుండా పూర్తిగా ఆరిన పుదీనా, కొత్తిమీర ఆకులను విడివిడిగా కాగిన నూనెలో వేయించుకోవాలి.

పొడుగ్గా కట్‌ చేసిన పచ్చిమిర్చిని అదే మాదిరిగా నూనెలో వేయించుకోవాలి. తర్వాత కరివేపాకును డీప్‌ ఫ్రై చేసుకోవాలి.

Healthy evening snacks murmura mixture ingredients and preparation process

వేరుశనగ, జీడిపప్పును కూడా డీప్‌ ఫ్రై చేసుకున్న అనంతరం స్టవ్‌ ఆఫ్‌ చేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి.

మిక్సీ జార్‌ తీసుకుని అందులో వేయించిన పుదీనా, కొత్తిమీర ఆకులు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మెత్తగా పేస్ట్‌ మాదిరిగా చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్‌పైన వెడల్పాటి బాణలి పెట్టుకుని వేడయ్యాక అందులో నెయ్యి వేసుకోవాలి. కరిగిన తర్వాత పసుపు, ఇంగువ వేసి కలిపాక గ్రైండ్‌ చేసి పెట్టుకున్న పేస్ట్‌ వేసి కాసేపు వేగనివ్వాలి.

గణేశ్‌ చతుర్థి స్పెషల్‌.. తమిళనాడు స్టైల్‌లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.!

పేస్ట్‌ వేగిన తర్వాత మరమరాలు వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. మరమరాలన్నిటికీ బాగా పట్టిన తర్వాత అందులో వేయించిన వేరుశనగ, జీడిపప్పు పలుకులు వేసి మరోసారి మొత్తం కలిసేలా కలిపి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి.

హెల్తీ, టేస్టీ, క్రంచీ మరమరాల మిక్స్చర్‌ రెడీ. సాయంత్రం స్నాక్స్‌లోకి వీటిని తీసుకుంటే పొట్టకి చాలా లైట్‌గా ఉండటంతో పాటు త్వరగా జీర్ణం అయ్యేందుకు దోహదపడుతుంది.

[ of 5 - Users]
Story first published: Thursday, September 10, 2026, 16:57 [IST]
Desktop Bottom Promotion