Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
గుజరాతీ స్పెషల్ దహీ కిచిడి..అబ్బబ్బా ఏం టేస్ట్ సామీ..ఎలా చేసుకోవాలంటే
గుజరాతీలు తరచుగా ఇంట్లో దహీ కిచిడీ చేసుకుంటుంటారు. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. సులభంగా జీర్ణమయ్యే మరియు పోషకాలు సమృద్ధిగా ఉండే వంటకం. ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్లీ మళ్లీ అదే చేసుకొని తింటుంటారు. ఎన్ని నెలలు అయినా ఇదే మళ్లీ మళ్లీ చేసుకొని రోజూ తింటుంటారు. అయితే దీనిని తయారుచేయడం కూడా చాలా సింపుల్. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా దీనిని తయారుచేసుకోవచ్చు. ప్రత్యేకించి జ్వరం వచ్చినప్పుడు, కడుపు సరిగా లేనప్పుడు లేదా తేలికపాటి ఆహారం తీసుకోవాలనిపించినప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్. గుజరాత్ స్పెషల్ దహీ కిచిడిని మీ ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
దహీ కిచిడి తయారీ విధానం
-బియ్యం
-పెసరపప్పు
-ఉప్పు
-పెరుగు
-పచ్చిమిర్చి
-టమాటో
-ఉల్లిపాయ
-పసుపు
-మిరియాలు
-జీలకర్ర
-కరివేపాకు
-ఇంగువ
-కొత్తిమీర
-నెయ్యి
-నిమ్మరసం
-జీలకర్ర పొడి

దహీ కిచిడి తయారీ విధానం
-ముందుగా 1 కప్పు బియ్యాన్ని గంట సేపు నానబెట్టాలి. 1 టేబుల్ స్పూన్ల పెసరపప్పుని 1 గంట సేపు నానబెట్టాలి.
-తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో నానబెట్టిన బియ్యం,నానబెట్టిన పెసర పప్పు,3 కప్పుల నీళ్లు, పావు టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టేసి 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి.
-తర్వాత స్టీమ్ అంతా పోయాక మూత తీసి ఉడికిన అన్నాన్ని మాష్ చేసి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు మరో గిన్నెలో ముప్పావుకప్పు పుల్లని పెరుగు, 3 పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలపండి.
-చిలికిన పెరుగులో ముప్పావు కప్పు నీళ్లు పోసి బాగా కలపండి. తర్వాత ఇందులో పూర్తిగా చల్లారిన కిచిడి వేసి బాగా కలుపుకొని పక్కనపెట్టుకోండి.
బూరెల్లాంటి మంగళూరు స్పెషల్ బన్స్..మళ్లీ మళ్లీ తినాలనిపించే టేస్ట్ ఉంటది..ఎలా చేసుకోవాలంటే
-తర్వాత తాళింపు కోసం స్టవ్ మీద బాండీ లేదా గిన్నె పెట్టి అందులో అర టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసి అందులో అర టీస్పూన్ మిరియాలు వేసి అవి చిట్లినాక అరటీస్పూన్ జీలకర్ర వేసి చిట్టనిచ్చాక,కరివేపాకు,చిటికెడు ఇంగువ, ఒకటిన్న టేబుల్ స్పూన్ అల్లం తరుగు వేసి వేయించాలి.
-వేగిన తాళింపును కిచిడీలో వేసి కలిపేయండి. అంతే గుజరాతీ స్పెషల్ దహీ కిచిడి రెడీ. దీనిమీద కొంచెం కొత్తిమీర తరుగు వేసి కలిపి పక్కనపెట్టుకోండి.
-తర్వాత ఓ గిన్నెలో ఒక కప్పు సన్నని టమాటో తరుగు, అదే కప్పుతో సప్నని ఉల్లిపాయ తరుగు, కొద్దిగా నిమ్మరసం, పావు టీస్పూన్ జీలకర్ర పొడి వేసి, కొద్దిగా ఉప్పు, కొంచెం చక్కెర, కొంచెం కొత్తిమీర తరుగు వేసి కలుపుకోండి. దీనిని కిచిడితో కలిపి తింటుంటే ఆ మజానే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications