Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గుజరాత్ స్పెషల్ 'ఖఖ్రా' ఎప్పుడైనా తిన్నారా? భలే ఉంటదబ్బా..ఎలా చేసుకోవాలంటే..
మనదేశంలోని గుజరాత్ పరిశ్రమలకే కాదండోయ్ వంటకాలకు కూడా ప్రసిద్ధే. కొన్ని గుజరాతీ వంటకాలు వరల్డ్ వైడ్ గా పాపులారీటీ సంపాదించుకున్నాయి. అలాంటి వాటిల్లో ఖాఖ్రా ఒకటి. దీనిని రోటీ,చపాతీ మాదిరి తయారుచేస్తారు..కానీ చాలా పల్చగా కాల్చి,క్రిస్పీగా చేస్తారు. ఖఖ్రా చాలా సులభంగా జీర్ణమయ్యే ఆహారం కూడా. దీనిని బ్రేక్ ఫాస్ట్ లోకి లేదా ప్రయాణాల్లో తినడానికి అనువుగా ఉంటుంది. గుజరాతీ స్టైల్ లో ఖఖ్రాని మీ ఇంట్లోనే తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
ఖఖ్రా తయారీకి కావలసిన పదార్థాలు
ధనియాల పొడి - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - 1/2 టీస్పూన్
నువ్వులు - 1 టేబుల్ స్పూన్
గోధుమ పిండి - 2 కప్పులు
శెనగ పిండి (బేసన్) - 1/4 కప్పు
నూనె - తగినంత
ఉప్పు - రుచికి తగినంత
నీరు - పిండి కలపడానికి తగినంత
పసుపు పొడి - 1/4 టీస్పూన్
కారం పొడి - రుచికి తగినంత
వాము - 1/2 టీస్పూన్
కసూరి మేథీ- 1 టేబుల్ స్పూన్ నలిపినది

ఖఖ్రా తయారీ విధానం
-ఖఖ్రా తయారీకోసం ముందుగా ఒక పెద్ద గిన్నెలో గోధుమ పిండి, శెనగ పిండి వేయండి. ఇందులో కొద్దిగా నూనె, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నువ్వులు, వాము, కసూరి మేథీ,ఉప్పు వేసి అన్నీ బాగా కలిసేలా చేతితో కలపాలి.
-కొద్ది కొద్దిగా నీరు పోస్తూ మెత్తని పిండి ముద్దలా కలపండి. పిండి మరీ మెత్తగా లేదా గట్టిగా ఉండకూడదు. చపాతీ పిండిలా ఉండాలి.
-పిండిని తడి గుడ్డతో కప్పి 15-20 నిమిషాలు నాననివ్వండి.
-నానిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. నిమ్మకాయ పరిమాణంలో ఉండలు చేస్తే సరిపోతుంది.
-ఒక ఉండను తీసుకొని పొడి పిండిలో అద్ది చపాతీ కర్రతో వీలైనంత పలుచగా రోటీలా ఒత్తండి. ఖఖ్రా ఎంత పలుచగా ఉంటే అంత క్రిస్పీగా వస్తుంది.
Best Breakfast: రాగి పిండితో హెల్దీ బన్ దోశలు..పీకలదాకా తిన్నా ఇంకోటి కావాలంటారు..ఎలా చేయాలంటే
-తర్వాత స్టవ్ మీద పెనం వేడి చేసి ఒత్తిన ఖాఖ్రాను వేడి పెనం మీద వేయండి. ఒక వైపు కొద్దిగా కాలిన తర్వాత దానిని తిప్పి రెండో వైపు కూడా కొద్దిగా కాల్చండి.
-ఇప్పుడు ఒక గుడ్డ లేదా కాటన్ క్లాత్ తీసుకొని ఖఖ్రాను నెమ్మదిగా నొక్కండి. ఇలా చేయడం వల్ల ఖఖ్రా సమానంగా కాలుతుంది, క్రిస్పీగా మారుతుంది.
-రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు, క్రిస్పీగా మారే వరకు కాల్చి దించేయాలి. అంతే గుజరాత్ స్పెషల్ ఖఖ్రా రెడీ. దీనిని మీకు నచ్చిన పచ్చడి, పెరుగు, వెన్నతో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications