Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
Best Breakfast: రాగి పిండితో హెల్దీ బన్ దోశలు..పీకలదాకా తిన్నా ఇంకోటి కావాలంటారు..ఎలా చేయాలంటే
మన ఆరోగ్యం మొత్తం దాదాపు మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. కరోనా తర్వాత నుంచి అధికశాతం మంది తమ ఆరోగ్యంపై ఎక్కువ ఫోకస్ పెడుతూ హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారు. హెల్దీ ఫుడ్స్ లో రాగి పిండితో చేసే బన్ దోశలు కూడా ఒకటి. సాధారణంగా పొద్దున్నే పూరీ,బోండా,ఇడ్లీ,బియ్యం పిండితో దోశ వంటివి మనం తింటుంటాం. అయితే ఇవి కాకుండా పొద్దున్నే రాగిపిండితో చేసే హెల్దీ బన్ దోశలు ఓ సారి టేస్ట్ చేసి చూడండి..అస్సలు వదలిపెట్టరు. అంత రుచిగా ఉంటాయి..అంతేకాకుండా ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. రాగి పిండిలో ఐరన్, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాంటి రాగి పిండితో హెల్దీ బన్ దోశలు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
రాగి పిండితో బన్ దోశలు తయారీకి కావాల్సిన పదార్థాలు
-రాగి పిండి
-బొంబాయి రవ్వ
-పెరుగు
-నీళ్లు
-ఆవాలు
-జీలకర్ర
-కరివేపాకు
-ఆయిల్
-ఇంగువ
-పచ్చిమిర్చి

రాగి పిండితో బన్ దోశలు తయారీ విధానం
-రాగి బన్ దోశలు తయారుచేయడం కోసం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో అరకప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు రాగి పిండి, 1 కప్పు పెరుగు వేసి మొత్తం కలిసేలా కలుపుకున్నాక ఇందులో అరకప్పు నీళ్లు పోసి బాగా కలిపి 10 నిమిషాలు పక్కనపెట్టేయాలి.
-10 నిమిషాలు నానిన తర్వాత ఈ పిండిని మిక్సీ గిన్నెలో వేసి నీళ్లు ఏమీ వేయకుండానే దోశ పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులో ఒకటిన్నర స్పూన్ ఆయిల్ వేడి చేసి ఇందులో కొద్దిగా ఆవాలు,జీలకర్ర వేసి అవి చిటపటలాడిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసి కలిపాక 2 పచ్చిమిర్చి తరుగు,కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక ఇందులో చిన్నగా కట్ చేసిన 1 టమాటో ముక్కలు వేసి అవి కొంచెం మెత్తబడేదాకా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి.
ఇది తినని మనిషి జన్మ ఎందుకు..మన పూర్వీకుల ఎనర్జీకి కారణం ఇదే..ఎలా చేసుకోవాలంటే
-ఈ తాళింపుని ముందుగా రెడీ చేసుకున్న పిండిలో వేసేయాలి. ఇందులోనే సన్నగా కట్ చేసిన 2 ఉల్లియాల ముక్కలు, కొత్తిమీర తరుగు,రుచికి తగినట్లుగా ఉప్పు, కొద్దిగా వంటసోడా వేసి పిండిలో అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద చిన్న బాండీ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి దానిమీద పెద్ద గరిట పిండిని వేసుకొని ఒకవేపు కాలిన తర్వాత తిప్పుకొని దానిని రెండోవైపు కాల్చి దించేయాలి. అంతే రాగి బన్ దోశలు రెడీ. దీనిని మీకు నచ్చిన చట్నీతో కలిపి తింటే నోట్లో బ్లాస్టే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
