Latest Updates
-
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.!
ఫర్ఫెక్ట్ గులాబ్ జామూన్ రిసిపి: నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాలంతే.. ఎలా తయారుచేయాలో తెలుసా..?
Gulab Jamun Recipe: మనం ఇంట్లో శుభకార్యాలు లేదా ఏదైనా ప్రత్యేక సందర్భంలలో స్వీట్ చేయాలనుకున్నప్పుడు, మనకు వెంటనే గుర్తొచ్చే ఒక వంటకం గులాబ్ జామూన్ ఎందుకంటే చాలా సులభంగా..త్వరగా..సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. అంతే కాదండోయో..ఇది పిల్లలు పెద్దలకు అత్యంత ఇష్టమైన స్వీట్ కూడా.
అయితే మరీ మెత్తగా ఉంటే పంచదార పాకంలో నాసిరకం అవుతుంది, ఒక్కోసారి పిండి మెత్తగా కలపడం వల్ల పాకంలో పూర్తిగా కరిగిపోతుంది. లేదాపాకం ముదురుగా ఉంటే జామూన్లు గట్టిగా మారుతాయి. మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురైన సందర్భాలు ఉంటాయి? కాబట్టి ఇప్పటి నుండి ఈ చిట్కాలను అనుసరించండి.

*నూనెలో వేయించేటప్పుడు, స్టౌ మంటను మీడియంగా లేదా అతి తక్కువ మీద ఎక్కవు సేపు బ్రౌన్ రంగులోకి వచ్చే వరకూ వేగించుకోవాలి.
*ముందుగా మీరు నూనెను వేడి చేసి, మీడియం మంట మీద గ్యాస్ ఉంచండి, తరువాత నెమ్మదిగా గ్యాస్ మంటను పెంచండి, మరుగుతున్న నూనెలో గులాబ్ జామును ఉండలు వేయకూడదు. అలా కాగే నూనెలో వేసినప్పుడు వెంటనే పైభాగం నల్లగా మారి లోపల బాగా సరిగా ఉడకదు.
* ముద్దలో పగుళ్లు ఉండకూడదు, ఉంటే నూనెలో వేస్తే పగిలిపోతుంది కాబట్టి గుండ్రంగా లేదా ఓవల్ షేప్ లో చేస్తే గులాబ్ జామును ఫ్రై బాగా చేసుకోవచ్చు.
గులాబ్ జామూన్ పిండిని కలుపుతున్నప్పుడు ఈ చిట్కాలను అనుసరించండి
* జామున్ పిండిని మెత్తగా పిసికినప్పుడు, పిండి గట్టిగా ఉండకూడదు
మరియు డ్రైగా ఉండకూడదు.
* పాలు వేసి కలిపితే పిండి మెత్తగా ఉంటుంది.
* పిండిని కలుపుతున్నప్పుడు ఉండలు ఉండకూడదు
* పిండిని ఎక్కువగా పిసికి వేయకూడదు. హార్డ్ గా కాకుండా సాప్ట్ గా
కలుపుకోవాలి
* పిండిని కలిపిన వెంటనే రోలింగ్ చేయడం ప్రారంభించండి.
* పిండితో మీకు నచ్చిన సైజ్ లో ఉండలు తయారు చేస్తున్నప్పుడు, మీ
చేతులకు నెయ్యి రాసుకున్న తర్వాత, ఉండలు తయారు చేయండి.
* తర్వాత నూనెలో వేయించి పంచదార పాకంలో వేయాలి.
గులాబ్ జామూన్ చేసేటప్పుడు దీని సిరప్ కూడా చాలా ముఖ్యం
షుగర్ సిరప్ కూడా సరైన పద్ధతిలో ఉంటేనే జామూన్ పర్ఫెక్ట్ గా
ఉంటుంది, కాబట్టి షుగర్ సిరప్ మరీ గట్టిగా, లేదా మరీ నీళ్ళగా ఉండకూడదు
కాబట్టి 2 కప్పుల పంచదారకు ఒక కప్పు నీళ్లు కలిపి కాస్త చిక్కగా
చేసుకోవాలి.
* ముందుగా సిరప్ సిద్ధం చేసుకున్న తర్వాత జామూన్ను తయారు
చేసుకోవాలి.
జామూన్ చేయడానికి కావలసిన పదార్థాలు:
జామూన్ రెడీమేడ్ పౌడర్ దొరుకుతుంది.
జామూన్ రెడీమేడ్ పౌడర్ కాకుండా ఇలా చేస్తే వావ్ సూపర్!
కోవా 300 గ్రాములు
200 గ్రాముల పనీర్ (తురిమినది)
పాల పొడి 4 స్పూన్లు
3/4 కప్పు మైదా
1/4 టీస్పూన్ ఏలకులు
1 చెంచా పొడి చక్కెర
చక్కెర సిరప్
కొబ్బరి తురుము
2 కప్పుల నెయ్యి
తయారు చేయు విధానం
* పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి కలపాలి.
* తర్వాత ఉండలు కట్టుకోవాలి.
* తర్వాత పైన సూచించిన విధంగా నూనెలో వేసి మీడియం మంట మీద బంగారు
రంగులో వచ్చే వరకు వేగించాలి
* పంచదార పాకంలో వేయాలి.
డ్రై జామును కావాలంటే
షుగర్ సిరప్లో వేసి కొబ్బరి పొడిలో రోల్ చేస్తే డ్రై జామును రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications