Latest Updates
-
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్
కరకరలాడే... KFC చికెన్ ఇంట్లోనే ఎలా చేస్తారో తెలుసా?
అత్యంత ఇష్టపడే నాన్ వెజ్ వంటల్లో KFC చికెన్ ఒకటి. పిల్లలు ముఖ్యంగా ఈ చికెన్ తినడానికి ఇష్టపడతారు. అయితే ఈ చికెన్ షాపుల్లో కొనుక్కుని తినాలంటే కనీసం 500 రూపాయలు వెచ్చించాల్సిందే.
అయితే ఈ KFC చికెన్ ను మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. మరి ఈ చికెన్ ని ఇంట్లో చేస్తే ఎంత కావాలంటే అంత తినొచ్చు. అయితే, ఈ KFC చికెన్‌ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చాలా మందికి తెలియదు.

KFC చికెన్‌ని ఇంట్లోనే సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో క్రింద ఉంది. చదివి రుచి చూసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.
కావల్సిన పదార్థాలు:
* చికెన్ - 500 గ్రాములు (పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి)
* మైదా - 1 కప్పు
* మొక్కజొన్న పిండి - 1/2 కప్పు
* నూనె - వేయించడానికి కావలసినంత
మ్యారినేట్ చేయడానికి...
* బేకింగ్ పౌడర్ - 1/2 టీస్పూన్
* వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
* అల్లం పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
* పొడి థైమ్ ఆకులు - 2 టేబుల్ స్పూన్లు
* ఎండిన ఒరేగానో - 2 టేబుల్ స్పూన్లు
* డ్రై బాసిల్ - 2 టేబుల్ స్పూన్లు
* మిరియాల పొడి - 1 టేబుల్ స్పూన్
* జీలకర్ర పొడి - 1 టేబుల్ స్పూన్
* ఉప్పు - 2 టేబుల్ స్పూన్లు
* చికెన్ స్టాక్ పౌడర్ - 3 టేబుల్ స్పూన్లు
* తెల్ల మిరియాల పొడి - 2 టేబుల్ స్పూన్లు
* ఆవాల పొడి - 2 టేబుల్ స్పూన్లు
అదనపు రుచి కోసం...
* చక్కెర - 2 టేబుల్ స్పూన్లు
* ఉప్పు - 2 టేబుల్ స్పూన్లు
* నిమ్మకాయ - 1
తయారుచేయు విధానం:
* ముందుగా చికెన్‌ని బాగా కడగాలి.
* తర్వాత కడిగిన చికెన్‌ని ఒక గిన్నెలో వేసి అందులో పంచదార,
ఉప్పు, నిమ్మరసం వేసి చికెన్‌ని కొద్దిగా నీళ్ళు కలిపి బాగా
మిక్స్ చేసి 2 గంటలపాటు ఫ్రిజ్‌లో నాననివ్వాలి.
* చికెన్ బాగా నానబెట్టిన తర్వాత, నీటిని తీసివేసి, చికెన్ ముక్కలను
విడిగా ఉంచండి.
* తర్వాత వెడల్పాటి ప్లేట్లో మైదా, మొక్కజొన్న పిండి, మసాలా
పొడులు, పచ్చిమిర్చి, బేకింగ్ పౌడర్ వేసి కలిపి పక్కన
పెట్టుకోవాలి.
* తర్వాత ఒక పాత్రలో బాగా చల్లటి ఐస్ వాటర్ తీసుకోవాలి. తర్వాత ఒక్కో
చికెన్ ముక్కను అందులో వేసి 7 సెకన్ల పాటు ఉంచి, మైదా మిశ్రమంలో వేసి
బాగా కోట్ చేసి ప్లేట్లో పెట్టుకోవాలి. అన్ని చికెన్
ముక్కలకు ఇలాగే చేయండి.
* తర్వాత ఓవెన్లో వెడల్పాటి ఫ్రైయింగ్ పాన్ పెట్టి
వేయించడానికి కావల్సినంత నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడి కాగానే
చికెన్ ముక్కలను వేసి మూతపెట్టి 7 నిమిషాలు వేయించాలి.
* తర్వాత మూత తెరిచి చికెన్‌ని తిప్పి మళ్లీ మూతపెట్టి 7
నిమిషాలు ఉడికించాలి. అదే విధంగా మళ్లీ తిప్పి బంగారు రంగు వచ్చేవరకు
వేయించుకుంటే రుచికరమైన కేఎఫ్ సీ చికెన్ రెడీ.
Image Courtesy: yummytummyaarthi
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
