Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
రెస్టారెంట్స్ కి మించిన టేస్ట్..జ్యూసీ తందూరి చికెన్ ను ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూడండి
నాన్ వెజ్ లో ఎక్కువమంది ఇష్టపడేది చికెన్. చికెన్ తో తయారుచేసే బోలెడు వెరైటీల్లో తందూరి చికెన్ ఒకటి. వాస్తవానికి చాలామంది దీనిని ఎక్కువగా రెస్టారెంట్స్ లోనే తింటుంటారు. అయితే తందూరి చికెన్ ను రెస్టారెంట్స్ ని మించిన టేస్ట్ తో ఉండేలా ఇంట్లోనే చేసుకోవచ్చు. దీనిని తయారుచేసుకోవడం కూడా చాలా ఈజీ. జ్యూసీగా చూస్తేనే నోరూరిపోయే తందూరి చికెన్ ను ఇంట్లోనే తయారచేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
తందూరి చికెన్ తయారీకి కావలసిన పదార్థాలు
-తందూరి చికెన్ జాయింట్స్
-కశ్మీరీ కారం
-ఉప్పు
-జీలకర్ర పొడి
-నల్ల ఉప్పు
-కారం
-గరం మసాలా
-శెనగపిండి
-ఆవాల నూనె
-పెరుగు
-కసూరి మేథీ
-ఆమ్చూర్ పొడి
-సొంటి పొడి

తందూరి చికెన్ తయారీ విధానం
-ముందుగా మస్లీన్ కాత్( చాలా మృదులమైన, తేలికైన, పారదర్శకమైన వస్త్రం)లో పెరుగు వేసి ఫ్రిడ్జ్ లో పెడితే అందులోని నీరు అంతా దిగిపోయి పన్నీరులా చిక్కగా హంగ్ కర్డ్ తయారు అవుతుంది.
-స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆవాల నూనె పోసి వేడి చెయ్యండి.
-ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ శెనగపిండి వేసి కలిపితే అది పొంగుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అందులో అర టేబుల్ స్పూన్ కశ్మీరీ కారం వేసి కలిపి ఆ మొత్తాన్ని మాడకముందే ఓ బౌల్ లో వేయండి.
-తర్వాత అందులో అర టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, అర టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అర టీస్పూన్ నల్ల ఉప్పు, అర టీస్పూన్ గరం మసాలా, అర టీస్పూన్ సొంటి పొడి, అర టీస్పూన్ ఆమ్చూర్ పొడి, 1 టేబుల్ స్పూన్ కసూరి మేథీ, 1 టేబుల స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర చెక్క నిమ్మరసం పిండి కలపండి.
నార్త్ ఇండియా స్పెషల్ 'మలై కోఫ్తా'..చపాతీ,రైస్ లోకి అదిరిపోద్ది..ఎలా చేసుకోవాలో చూడండి
-తర్వాత అందులో కొద్దిగా చిక్కన్ హంగ్ కర్డ్ వేసి మొత్తం కలిసేలా కలిపి ఇందులోనే 3 తందూరి చికెన్ కట్ జాయింట్స్ లేదా తందరూరి కట్ చికెన్ ముక్కలకు గాట్లు పెట్టి వేసి మెత్తం మసాలాను ముక్కలకు బాగా పట్టించాలి.
-తర్వాత ఈ బౌల్ ను రాత్రంతా ఫ్రిడ్జ్ లో పెట్టాలి.
-తర్వాత చికెన్ జాయింట్స్ ని గ్రిల్ పాన్ మీద పెట్టండి. దీనిని ప్రీహీటెడ్ ఓవెన్ లో 250 డిగ్రీల టెంపచేర్ మీద అరగంటసేపు గ్రిల్ చేయండి. అంతే జ్యూసీగా ఉండే తందూరి చికెన్ రెడీ. దీనిని స్పైసీ పుదీనా చట్నీతో తింటే నోట్లో బ్లాస్టే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications