Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఆహా ఏమి రుచి..బెస్ట్ చికెన్ స్టార్టర్..డ్రాగన్ చికెన్ ను ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూడండి
చికెన్ తో అనేక రకాల వెరైటీలు తయరుచేసుకోవచ్చు. అలాంటి వాటిల్లో డ్రాగన్ చికెన్ ఒకటి. డ్రాగన్ చికెన్ ఒక ప్రసిద్ధ ఇండో చైనీస్ వంటకం. ఇది రుచికరమైనది మాత్రమే కాదు కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. ఈవెనింగ్ టైంలో స్నాక్ గా తినడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది. చాలా రెస్టారెంట్లలో డ్రాగన్ చికెన్ తినాలంటే కొద్దిగా ఎక్కువగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే దీనిని ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. డ్రాగన్ చికెన్ ను తయారు చేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
డ్రాగన్ చికెన్ తయారీకి కావలసిన పదార్థాలు
బోన్‌లెస్ చికెన్ - 500 గ్రాములు
నూనె - సరిపడా
గుడ్డు - 1
పచ్చిమిర్చి - 2
ఉల్లిపాయ - 1
క్యాప్సికమ్- 1
మొక్క జొన్న పిండి - 3 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి తరుగు - 1 టేబుల్ స్పూన్
సోయా సాస్ - 2 టేబుల్ స్పూన్లు
టొమాటో కెచప్ - 3 టేబుల్ స్పూన్లు
రెడ్ చిల్లీ సాస్ - 1 టేబుల్ స్పూన్
అల్లం తరుగు - 1 టీస్పూన్
మిరియాల పొడి - 1/2 టీస్పూన్
మైదా - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
వెనిగర్ - 1 టీస్పూన్
చక్కెర - 1/2 టీస్పూన్
నీరు లేదా చికెన్ స్టాక్ - 2 టేబుల్ స్పూన్లు
వేయించిన జీడిపప్పు - 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర తరుగు - కొద్దిగా
డ్రాగన్ చికెన్ తయారీ విధానం
-ముందుగా ఓ గిన్నెలో సన్నగా కట్ చేసిన బోన్ లెస్ చికెన్ ముక్కలు, గుడ్డు, మొక్క జొన్న పిండి, మైదా, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపండి. చికెన్ కు మసాలా బాగా పట్టేలా కనీసం 15-20 నిమిషాలు నానబెట్టాలి.
- ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ ని వేడి చేయండి. నూనె వేడెక్కిన తర్వాత చికెన్ ముక్కలను బంగారు రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోండి.
మీ ఆకలిని తీర్చే, రుచిని పెంచే దబ్బకాయ పులిహోర..ఎలా చేసుకోవాలంటే
-సాస్ కోసం..పాన్‌లో నూనె వేడి చేసి వెల్లుల్లి, అల్లం,పచ్చిమిర్చి వేసి ఒక నిమిషం వేయించండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కొద్దిగా మెత్తబడే వరకు వేయించాక క్యాప్సికమ్ ముక్కలు వేసి ఒక నిమిషం పాటు వేయించండి. అవి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా క్రంచీగా ఉండాలి. సోయా సాస్, టొమాటో కెచప్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్,చక్కెర వేసి బాగా కలపండి.
-నీరు లేదా చికెన్ స్టాక్ వేసి సాస్ ని కొద్దిగా చిక్కబడనివ్వండి.
వే-యించిన చికెన్ ముక్కలు వేసి సాస్ తో బాగా కలపండి. దీంతో సాస్ చికెన్ కు బాగా పడుతుంది.
-చివరగా వేయించిన జీడిపప్పు వేసి కలపండి.
-కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోండి. అంతే డ్రాగన్ చికెన్ రెడీ. దీనిని వేడి వేడిగా తింటే లేదా ఈవెనింగ్ టైం స్నాక్ గా సూపర్ ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications






