Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఎంత సంపాదిస్తే ఏం లాభం..దహీ తడ్కా శాండ్ విచ్ తినకుంటే జీవితమే వేస్ట్..ఇంట్లోనే నిమిషాల్లో ఎలా చేయాలంటే
రెగ్యులర్ గా తినే ఫుడ్స్ కాకుండా కొత్తగా ఏదైనా ఇంట్లో చేసుకొని తినాలనుకుంటే దహీ తడ్కా శాండ్‌విచ్ సూపర్ ఆప్షన్. దహీ తడ్కా శాండ్‌విచ్ ఒక రుచికరమైన,ఆరోగ్యకరమైన అల్పాహారం. ఇది తయారు చేయడానికి చాలా సులభం..తక్కువ సమయంలో రెడీ అవుతుంది. పెరుగు చల్లదనం, తడ్కా ఘాటైన రుచి కలగలిసి ఈ శాండ్‌విచ్‌ని ప్రత్యేకంగా చేస్తాయి. ఇది పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. ఇంట్లోనే దహీ తడ్కా శాండ్ విచ్ తయారుచేయడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
దహీ తడ్కా శాండ్ విచ్ తయారీకి కావలసిన పదార్థాలు
బ్రెడ్ స్లైసులు - 4
పెరుగు- 1 కప్పు
ఆవాలు - 1/2 టీస్పూన్
జీలకర్ర - 1/2 టీస్పూన్
మినపప్పు - 1/2 టీస్పూన్
ఉల్లిపాయ తరుగు - 2 టేబుల్ స్పూన్లు
టమోటా తరుగు - 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి తరుగు - 1/2 టీస్పూన్
నూనె లేదా నెయ్యి - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
పసుపు - చిటికెడు
కారం - 1/2 టీస్పూన్
కరివేపాకు - 5-6 ఆకులు
కొత్తిమీర తరుగు - 1 టేబుల్ స్పూన్
నూనె లేదా నెయ్యి - 1 టీస్పూన్
దహీ తడ్కా శాండ్ విచ్ తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో గట్టి పెరుగు తీసుకోండి. పెరుగులో నీరు లేకుండా చూసుకోండి. అవసరమైతే పెరుగును ఒక గుడ్డలో వేసి నీరంతా పోయే వరకు వేలాడదీయండి.
-గట్టి పెరుగులో ఉల్లిపాయ తరుగు, టమోటా తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచండి.
-ఇప్పుడు తడ్కా కోసం ఒక చిన్న బాండీలో ఆయిల్ లేదా నెయ్యి వేడి చేయండి.
-ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి.
-తర్వాత జీలకర్ర, మినపప్పు వేసి అవి కొద్దిగా రంగు మారే వరకు వేయించండి.
-ఇప్పుడు కరివేపాకు వేసి ఒక నిమిషం వేయించండి.
-తయారైన తడ్కాను పెరుగు మిశ్రమంలో వేసి బాగా కలపండి.
-బ్రెడ్ స్లైసులు తీసుకోండి. ఒక బ్రెడ్ స్లైస్ పై తయారుచేసిన పెరుగు మిశ్రమాన్ని సమానంగా పరచండి. దానిపై మరొక బ్రెడ్ స్లైస్ ఉంచండి.
-శాండ్ విచ్ ను మధ్యలో కట్ చేసి రెండు భాగాలుగా చేయండి.
-కావాలంటే శాండ్ విచ్ పైన కొద్దిగా నెయ్యి రాసి పెనం మీద లేదా శాండ్‌విచ్ టోస్టర్ లో కొద్దిగా కాల్చుకోవచ్చు. దీంతో శాండ్ విచ్ మరింత రుచిగా, క్రిస్పీగా ఉంటుంది.
-దహీ తడ్కా శాండ్ విచ్ లు రెడీ.
కోటీశ్వరులు కూడా కక్కుర్తి పడి తినే రెసిపి ఇదే..ఎలా చేయాలంటే
దహీ తడ్కా శాండ్ విచ్ ఆరోగ్య ప్రయోజనాలు
తక్షణ శక్తినిస్తుంది
ఈ శాండ్ విచ్ త్వరగా శక్తినిచ్చే మంచి అల్పాహారం. ఇందులో
కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్లు ఉండటం వల్ల ఇది ఎక్కువసేపు శక్తిని
ఇస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
పెరుగులోని ప్రోబయోటిక్స్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి
సహాయపడతాయి. శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి.
శరీరాన్ని చల్లగా ఉంచుతుంది
పెరుగు శరీరాన్ని చల్లగా ఉంచే లక్షణాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా
వేసవి కాలంలో దీనిని తీసుకోవడం వల్ల శరీరం వేడిని తగ్గించవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications






