Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
చికెన్, మటన్ లేకుండా ఎంప్టీ బిర్యానీ.. టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది, ఎలా చేసుకోవాలంటే?
ఇప్పుడున్న కాలంలో చాలా మందికి వంటలు ఎలా చేసుకోవాలో తెలియడం లేదు. అందుకే అందరూ బయటి నుంచి ఆహారాన్ని తీసుకొచ్చి తింటున్నారు. అలాగే ఎక్కువగా అనారోగ్యం బారిన పడుతున్నారు. మరీ ముఖ్యంగా బ్యాచిలర్స్ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. అయితే బ్యాచిలర్స్ సులభంగా తమ ఇంట్లోనే బిర్యాని చేసుకోవచ్చు. అది చికెన్, మటన్ బిర్యానీని మించి ఉంటుంది. అదే ఎంప్టీ బిర్యాని. ఇది చాలా సింపుల్ రెసిపీ.. వంట ఏంటో తెలియని వ్యక్తులు కూడా దీనిని చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి రెసిపీ, ఈ ఎంప్టీ బిర్యానీని చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు అన్నీ ఈ స్టోరీలో వివరించాము. మీరూ ఓసారి ట్రై చేయండి.
ఎంప్టీ బిర్యాని తయారీకి కావాల్సిన పదార్థాలు
ఒక కేజీ బియ్యం
12 ఇలాచీ
రెండు ఇంచుల దాల్చిన చెక్క
20 లవంగాలు
100 గ్రాముల పెరుగు
ఒక చెంచా ధనియాల పొడి
నాలుగు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్
ఒక గుప్పెడు జీడిపప్పు
మూడు ఉల్లిపాయలు
నాలుగు టమోటాలు
పిడికెడు కొత్తిమీర
మూడు పచ్చి మిర్చి
పిడికెడు పుదీనా
నాలుగు చెంచాల నూనె
ఒక చెంచా కారం
రుచికి సరిపడా ఉప్పు
ఎంప్టీ బిర్యాని తయారీ విధానం
ఈ ఎంప్టీ బిర్యానీ చేసుకోవడానికి ముందుగా.. మీకు కావాల్సినంత బియ్యం తీసుకోవాలి. ఆ బియ్యాన్ని మూడు సార్లు బాగా కడిగి.. అందులో నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట పాటు అలా పక్కన పెట్టేస్తే ఆ బియ్యం సరిగ్గా నానుతుంది. ఇప్పుడు 12 ఇలాచీ, రెండు ఇంచుల దాల్చిన చెక్క, 20 లవంగాలు తీసుకోవాలి. వాటిని దోరగా వేయించుకొని, చక్కగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే టమాటోలు, ఉల్లిపాయలను సన్నగా తురుముకోవాలి.
ఇప్పుడు బిర్యాని హండి తీసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో నాలుగు చెంచాల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తరువాత అందులో ఉల్లిపాయలను వేసుకోవాలి. ఆ తరువాత మూడు పచ్చి మిర్చి వేసుకొని.. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ అయ్యాక.. అందులో గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఒక్కసారి అలా కలుపుకున్న తరువాత.. అందులో నాలుగు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని.. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
మామిడి పండ్లతో అదిరిపోయే స్మూతీ బ్రేక్‌ఫాస్ట్.. చుక్క చుక్కలో తాజాదనం, ఎలా చేసుకోవాలో తెలుసా?
పచ్చి వాసన పోయిన తరువాత అందులో పెరుగు వేసుకోవాలి. ఆ పెరుగును బాగా కలుపుకున్న తరువాత అందులో గరం మసాలా పొడి, ఒక్క చెంచా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తరువాత కోసిపెట్టుకున్న టమాటోలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆ తరువాత ధనియాల పొడి వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఆ తరువాత అందులో బియ్యం ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకోవాలి. అంటే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఆ తరువాత ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని ఓసారి కలుపుకోవాలి.
ఇప్పుడు అందులో అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. బియ్యం మొత్తం కలిసే విధంగా కలుపుకొని.. ఉప్పు రుచి చూసుకోవాలి. ఇప్పుడు ఆ హండిని అయిదు నిమిషాల పాటు అలానే ఉడకనివ్వాలి. ఆ తరువాత అందులో వేసిన బియ్యం 75 శాతం నీటిని పీల్చుకుంటే.. సిమ్‌లో మంటను ఉంచుకొని పైన ఒక బరువు పెట్టాలి. ఆ తరువాత ఒక 12 నిమిషాల పాటు ఉడికించుకుంటే.. ఎంతో రుచికరమైన వేడి వేడి ఎంప్టీ బిర్యాని సిద్ధమైనట్లే. బ్యాచిలర్స్‌కి ఒక అమృతమైన వంటకం అని చెప్పుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












