Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
మామిడి పండ్లతో అదిరిపోయే స్మూతీ బ్రేక్‌ఫాస్ట్.. చుక్క చుక్కలో తాజాదనం, ఎలా చేసుకోవాలో తెలుసా?
వేసవి వచ్చిందంటే ప్రతి ఒక్కరూ చల్ల చల్లని కూల్ డ్రింక్స్, కడుపులో చల్లదనాన్ని కోరుకుంటారు. చాలా చల్లని పదార్థాలను తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అలాగే చాలా మందికి ఎండ కారణంగా సాధారణంగానే బ్రేక్‌ఫాస్ట్ తినాలని అనిపించదు. అలా అని బ్రేక్‌ఫాస్ట్ మానేయడం కూడా అస్సలు మంచిది కాదు. అందుకోసమే సమ్మర్ స్పెషల్, ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా, చల్ల చల్లని స్మూతీలు ఎక్కువ మంది మొగ్గు చూపుతుంటారు. వాటిల్లోనూ మ్యాంగో స్మూతీని ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వేసవిలో ఈ పండు ఎక్కువగా దొరకడంతో పాటు.. ఇందులో ఉండే పోషకాలు మంచి శక్తిని అందిస్తాయి. అలాగే జీర్ణవ్యవస్థకు కూడా చాలా మంచిది. అయితే చాలా మందికి ఈ మ్యాంగో స్మూతీ ఎలా చేసుకోవాలో తెలియదు. అందుకే ఈ స్టోరీలో మ్యాంగో స్మూతీ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? చేసుకునే విధానం ఏమిటి అనేది తెలుసుకుందాం.
మ్యాంగో బెర్రీ స్మూతీ తయారీకి కావలసిన పదార్థాలు
1 కప్పు మామిడి ముక్కలు (పండినవి, తరిగి చల్లగా ఉంచినవి)
1/2 కప్పు మిక్స్ చేసిన బెర్రీలు (స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్‌బెర్రీ - ఎంచుకున్నవి)
1/2 కప్పు పెరుగు లేదా యోగర్ట్ (ప్రొబయోటిక్ కోసం)
1/4 కప్పు పాలు (బాదం లేదా సోయా పాలు వాడవచ్చు)
1 టీస్పూన్ తేనె లేదా మెపిల్ సిరప్ (తీపి కోసమైతే)
1 టేబుల్ స్పూన్ చియా గింజలు (ఐచ్చికం)
ఐస్ క్యూబ్స్ - కొంత చల్లదనం కావాలనుకుంటే
కొద్దిగా పుదీనా ఆకులు - అలంకరణకు
తయారు చేసేవిధానం
ఈ స్మూతీ తయారు చేసుకోవడానికి ముందుగా మంచి, తాజా మామిడి పండ్లను తీసుకోవాలి. వాటి తొక్క తీసి, కాండాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకోవాలి. ఆ బ్లెండర్‌లో ముందుగా మామిడి ముక్కలు, బెర్రీలు, పెరుగు వంటి వాటిని వేసుకోవాలి. అలాగే ఆ మిశ్రమంలో కొన్ని చియా గింజలను కూడా జత చేసుకోవాలి. ఇప్పుడు అందులో తేనె కూడా జత చేసుకోవాలి.
స్మూతీ చల్ల చల్లగా కావాలనుకునే వ్యక్తులు ఆ స్మూతీలో కొన్ని ఐస్ ముక్కలను కూడా వేసుకోవాలి. కావాలనుకుంటే పై నుంచి కొద్దిగా పాలు కూడా వేసుకొని స్మూతిని మరింత రుచికరంగా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఆ బ్లెండర్ జార్‌లో వేసుకున్న ముక్కలన్నిటినీ బాగా మెత్తబడి వరకు, మెత్తగా రుబ్బుకోవాలి. అందులో మనం వేసుకున్న ముక్కలన్నీ బాగా గ్రైండ్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఆ తరువాత ఆ స్మూతిని ఒక గ్లాస్‌లో తీసుకొని దానిపై కొన్ని పుదీనా ఆకులను చల్లుకుంటే.. ఎంతో రుచికరమైన మ్యాంగో స్మూతీ బ్రేక్‌ఫాస్ట్ సిద్ధమైనట్లే.
సండే స్పెషల్.. చికెన్ కర్రీని ఇలా చేసుకోండి, జన్మలో మర్చిపోలేని రుచి, కంచం మొత్తం నాకేస్తారు!
ఈ స్మూతీ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
ఈ స్మూతీ ఎంత రుచికరంగా ఉంటుందో, ఆరోగ్యానికి కూడా అంతే మంచిది. ఈ స్మూతీలో ఉండే సహజసిద్ధమైన చెక్కర శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అలాగే నీరసం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. దీంతో పాటు ఇందులోని ప్రోబయోటిక్స్, ఫైబర్ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. తద్వారా జీర్ణక్రియ సరిగ్గా జరగడంతో పాటు తిన్న ఆహరం జీర్ణమైపోతుంది. అలాగే ఈ స్మూతీలోని గుణాలు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఇందులోని విటమిన్ ఏ, సీలు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు చర్మ కాంతిని ఎన్‌హ్యాన్స్ చేస్తాయి. చర్మం మిలమిలా మెరిసిపోయేలా చేస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












