Latest Updates
-
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక
జూనియర్ ఎన్టీఆర్ కి ఎంతో ఇష్టమైన ఫైనాఫిల్ కర్రీ..మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి,రుచి అమోఘం
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి చాలా ఇష్టమైన వంటకాల్లో ఫైనాఫిల్ కర్రీ కూడా ఒకటి. నటుడు రాజీవ్ కనకాల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తనకు ఓ సందర్భంలొ ఫైనాఫిల్ కర్రీని చేసిపెట్టాడని, అది చాలా టేస్టీగా ఉందని ఉన్నారు. ఆ ఇంటర్వ్యూ తర్వాత చాలామంది ఫైనాఫిల్ కర్రీ రెసిపీ కోసం గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. తీపి, పుల్లని రుచుల కలయికతో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కర్రీ. జూనియర్ ఎన్టీఆర్ కి ఇష్టమైన ఫైనాఫిల్ కర్రీని మీరు కూడా మీ ఇంట్లో ఎలా తయారుచేసుకోవచ్చో ఇక్కడ చూడండి.
ఫైనాఫిల్ కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు
-ఫైనాఫిల్ ముక్కలు
-ఉప్పు
-కారం
-జీలకర్ర
-ఎండు కొబ్బరి
-చింతపండు
-ఎండుమిర్చి
-నువ్వులు
-పచ్చి శెనగపప్పు
-ఆయిల్
-కరివేపాకు
-కొత్తిమీర
-ఆవాలు

ఫైనాఫిల్ కర్రీ తయారీ విధానం
-నిమ్మకాయ సైజు అంత చింతపండుని నీటిలో నానబెట్టండి
-తర్వాత ఓ ఫైనాఫిల్ ని తీసుకోండి. మరీ పచ్చిగా ఉండకూడదు, మరీ పండుగా ఉండకూడదు. మీడియంగా ఉండాలి. పైన తొక్కు మొత్తం తీసేసి ఫైనాపిల్ ను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
-ఫైనాఫిల్ ముక్కలను ఓ బౌల్ లో వేసి అందులో అర స్పూన్ ఉప్పు వేసి నీళ్లతో బాగా శుభ్రంగా కడుక్కోవాలి.
-తర్వాత స్టవ్ ఆన్ చేసి ఓ కాడాయి పెట్టి అందులో రెండు గ్లాసుల నీళ్లు పోయాలి. ఇందులో శుభ్రంగా కడిగిన ఫైనాఫిల్ ముక్కలు వేసి 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది.
-తర్వాత స్టవ్ మీద మరో కడాయి పెట్టి అందులో 1 స్పూన్ పచ్చి శెనగపప్పు, 10 ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు వేసి తక్కువ మంట మీద ఆయిల్ లేకుండానే ఒట్టిగానే వేయించుకోవాలి.
ఆంధ్రా స్పెషల్ గోంగూర చికెన్ బిర్యానీ..ఇలా చేశారంటే మతి పోయే రుచి
-గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాక దించేసి కాసేపు చల్లారక ఈ మొత్తాన్ని మిక్సీ గిన్నెలో వేసి ఇందులోనే కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు,నానబెట్టిన చింతపండు కూడా వేసి అవసరమైతే కొద్దిగా నీళ్లు కూడా పొసుకొని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఒకటిన్నర స్పూన్ ఆయిల్ వేడి చేసి అందులో అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు వేసి వేయించాక ఇందులో ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ వేసి కలిపి లో ఫ్లేమ్ మీద కలుపుతూ బాగా ఫ్రై చేయాలి.
-తర్వాత అందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసి మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలపండి.
-తర్వాత అందులో ఉడికించిన ఫైనాఫిల్ ముక్కలు వేసి మెల్లగా కలపాలి. తర్వాత అందులో 1 గ్లాస్ నీళ్లు పోసి కలిపి మూతపెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. అంతే ఫైనాఫిల్ కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications