Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
ఆంధ్రా స్పెషల్ గోంగూర చికెన్ బిర్యానీ..ఇలా చేశారంటే మతి పోయే రుచి
సాధారణంగా రెస్టారెంట్లలో లేదా రోడ్డు పక్కన హోటల్స్ లో చికెన్ తో తయారుచేసిన అనేక రకాల బిర్యానీలు అందుబాటులో ఉంటాయి కానీ గోంగూర బిర్యానీ మాత్రం చాలా తక్కువ ప్లేస్ లలో దొరుకుతుంది. ఆంధ్రా స్పెషల్ గోంగూర చికెన్ బిర్యానీ ఎప్పడైనా తినకుంటే ఒక్కసారి రుచి చూడండి. మతి పోగొట్టే రుచికరంగా ఉంటుంది. దీనిని ఇంట్లో తక్కువ సమయంలోనే ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోవచ్చు. గోంగూర చికెన్ బిర్యానీ తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
గోంగూర చికెన్ బిర్యానీ తయారీకి కావలసిన
పదార్థాలు
-గోంగూర
-పెద్ద చికెన్ ముక్కలు
-బాస్మతి బియ్యం
-ఉల్లిపాయ
-పచ్చిమిర్చి
-షాజీర
-యాలకలు
-గరం మసాలా పొడి
-ధనియాల పొడి
-కారం
-ఉప్పు
-పసుపు
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-దాల్చిన చెక్క
-అనాస పువ్వు
-బిర్యానీ ఆకు
-లవంగ మెగ్గలు
-జీడిపప్పు
-ఆయిల్
గోంగూర చికెన్ బిర్యానీ తయారీ విధానం
-ముందుగా అరకేజీ పెద్ద చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఓ బౌల్ లో వేయాలి.
-తర్వాత అంవులో 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ గరం మసాలా పొడి, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేలా కలిపి అరగంట సేపు పక్కపెట్టుకోండి.
-ఇప్పుడు రెండు గ్లాసుల బాస్మతి రైస్ ని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ ఆన్ చేసి దాని మీద పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్, శుభ్రంగా కడిగి 1 పెద్ద కట్ట గోంగూర ఆకులు వేసి 4-5 నిమిషాలు లో ప్లేమ్ మీద నిదనంగా ఉడికంచుకోవాలి.
-గోంగూర ఆకు మొత్తం ఉడికి దగ్గరపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దానిని మిక్సీ గిన్నెలో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
కాకరకాయను ఇలా వండుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.. చేదు ఉండదు, రుచి మాత్రం వేరే లెవెల్
-ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 2 గరిటెల ఆయిల్ పోసి వేడయ్యాక అందులో 1 స్పూన్ షాజీరా, 2 యాలకలు, 1 అనాస పువ్వు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 బిర్యానీ ఆకులు, 4 లవంగ మొగ్గలు, కొన్ని జీడిపప్పు పలుకులు వేసి వేయించుకోవాలి.
-తర్వాత అందులో సన్నగా తరగిన 2 ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. అందులో కొద్దిగా ఉప్పు వేస్తే త్వరగా వేగిపోతాయి. తర్వాత అందులో సన్నగా కట్ చేసిన 4 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయాలి. ఉల్లిపాయలు రంగు మారాక అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి.
-తర్వాత మసాలాలు కలిపి పక్కన ఉంచిన చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా ఇందులో వేసి మీడియం మంట మీద 2 నిమిషాలు కలుపుతూ ఉడికించాలి.
-తర్వాత మూతపెట్టేసి మీడియం మంట మీద 5 నిమిషాలు చికెన్ ను ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి గ్రైండ్ చేసిన గోంగూర పేస్ట్ వేసి బాగా కలిపి మూతపెట్టి మళ్లీ 5 నిమిషాలు ఉడికించుకోవాలి.
-తర్వాత మూత తీసి చూడండి. ఆయిల్ సపరేట్ అయ్యి ముక్క కొంచెం మెత్తబడుతుంది. ఇప్పుడే కావాలనుకుంటే ఉప్పు, కారం అడ్జెస్ట్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర చల్లుకొని దాని మీద నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి అందులో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి కలిపి మూతపెట్టి 1 విజిల్ వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే గోంగూర చికెన్ బిర్యానీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications









