Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
కాకరకాయ కారం పొడి..వన్స్ మోర్ అనిపించే టేస్ట్, ఎలా చేయాలంటే..
ఆరోగ్యానికి మేలు చేసే కాయగూరల్లో కాకరకాయ బకటి. అయితే చాలామంది కాకరకాయ అనగానే ముఖం తిప్పేసుకుంటారు..కారణం చేదుగా ఉంటదని. కానీ సరైన పద్దతిలో చేయాలేగానీ దీని టేస్ట్ మరే ఇతర కూరగాయకు రాదు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. కాకరకాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో ఉండే ఇన్సులిన్ వంటి పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది కంటి ఆరోగ్యానికి మంచిది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది, చర్మ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.
కాకరకాయ కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. ఇందులో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. కాకరకాయతో అనేక రకాల వెరైటీలు తయారుచేస్తుంటారు. దేని ప్రత్యేకత దానిదే. అయితే కాకరకాయ కారం పొడి అనేది దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో తయారుచేసే ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకం. కాకరకాయ కారం పొడి ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇక్కడ చూడండి.
కాకరకాయ కారం పొడి తయారీకి కావలసిన పదార్థాలు
శనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు
మినప్పప్పు - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
చింతపండు- నిమ్మకాయ సైజు అంత
కాకరకాయలు - 1/2 కేజీ
ఎండు మిరపకాయలు - 15-20
ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు - 10-12
నూనె - వేయించడానికి సరిపడా
ఉప్పు చేప పప్పు చారు..రుచిలో దీనికి సాటి మరొకటి లేదు,ఎలా చేసుకోవాలంటే
కాకరకాయ కారం పొడి తయారీ విధానం
-ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి, గుండ్రని ముక్కలుగా కోయాలి. కావాలంటే గింజలు తీసేయవచ్చు.
-కోసిన కాకరకాయ ముక్కలకు ఉప్పు కలిపి ఒక గంట సేపు నీటిలో నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయలోని చేదు తగ్గుతుంది.
-ఒక గంట తర్వాత కాకరకాయ ముక్కల నుండి నీటిని పిండి వాటిని ఎండలో పొడి గుడ్డపై ఆరబెట్టాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేడి చేసి అందులో కాకరకాయ ముక్కలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. వేయించిన ముక్కలను పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు అదే పాన్ లో ఎండు మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేయించాలి.
-తర్వాత అందులో చింతపండు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కొద్దిసేపు వేయించాలి.
-వేయించిన దినుసులను చల్లారనిచ్చి, మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
-తర్వాత వేయించిన కాకరకాయ ముక్కలను కూడా మిక్సీలో వేసి కారం పొడితో కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. అంతే కాకరకాయ కారం పొడి రెడీ. తయారైన కాకరకాయ కారం పొడిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
-కాకరకాయ కారం పొడిని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది దోశ, ఇడ్లీ, చపాతీ వంటి వాటితో కూడా తినవచ్చు. కాకరకాయ కారం పొడిని మితంగా తీసుకోవడం మంచిది. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి. అధిక రక్తపోటు ఉన్నవారు ఉప్పు తక్కువగా వేసుకోవాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












