Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
కోడిగుడ్డు ఎల్లిపాయ కారం..ఇలాంటి రుచి జన్మలో మరెక్కడా దొరకదు, ఎలా చేయాలంటే
కోడిగుడ్డు ఎల్లిపాయ కారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా ప్రసిద్ధి చెందిన వంటకం. కోడిగుడ్డు ఎల్లిపాయ కారంను అన్నం, చపాతీ, రోటీతో కలిపి తింటే చాలా రుచికరంగా ఉంటుంది. ఇది పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే వంటకం. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ వంటకంలో ఉపయోగించే మసాలాలు జీర్ణక్రియను మెరుగుపరచుతుంది. కోడిగుడ్డు ఎల్లిపాయ కారం తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. దీనిని ఇంట్లోనే చాలా ఈజీగా తయారుచేసుకోడానికి కవాలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
కోడిగుడ్డు ఎల్లిపాయ కారం తయారీకి కావలసిన పదార్థాలు
కోడిగుడ్లు: 6
ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగినవి)
వెల్లుల్లి రెబ్బలు: 10-12
ఎండుమిర్చి: 8-10
కారం: 2 టేబుల్ స్పూన్లు
పసుపు: 1/2 టీస్పూన్
జీలకర్ర: 1 టీస్పూన్
ఆవాలు: 1/2 టీస్పూన్
నూనె: 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
కరివేపాకు: కొద్దిగా
కొత్తిమీర: కొద్దిగా (సన్నగా తరిగినది)

తయారీ విధానం
-కోడ్డిగుడ్డు ఎల్లిపాయ కారం తయారుచేయడానికి మొదటగా మొదటగా కోడిగుడ్లను ఉడికించి చల్లారాక పొట్టు తీసి, వాటిని పెద్ద ముక్కలుగా కోయాలి.
-వెల్లుల్లి కారం కోసం, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కారం, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.తర్వాత
-స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేడి చేయాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. కొద్దిసేపటి తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
రోడ్డు పక్కన ఈ ఆకు కనబడితే వదలొద్దు..ఆరోగ్యానికి అద్భుతమైన నిధి,జుట్టు సమస్యలకు దివ్యౌషధం
-తర్వాత అందులో పసుపు వేసి కలపాలి.
-రుబ్బిన వెల్లుల్లి కారం వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి.
-కోడిగుడ్డు ముక్కలు వేసి, మసాలా బాగా పట్టేలా కలపాలి.
-తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి, రెండు నిమిషాలు ఉడికించ కొత్తిమీరతో గార్నిష్ చేస్తే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications