Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
రోడ్డు పక్కన ఈ ఆకు కనబడితే వదలొద్దు..ఆరోగ్యానికి అద్భుతమైన నిధి,జుట్టు సమస్యలకు దివ్యౌషధం
ఈ రోజుల్లో మారిన ప్రజల లైఫ్ స్టైయిల్, ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితుల కారణంగా చాలామంది జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొంతమందికి చిన్నవయస్సులోనే బట్టతల, తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి. అయితే జుల్లు రాలడాన్ని తగ్గించగలిగే, వెంట్రుకలు నెరిసిపోవడాన్ని ఆపగిలిగే ఆకు ఒకటి ఉంది. అదే గుంటగలగర ఆకు(Bhringraj plant). రోడ్డు పక్కన, పొలాల్లో లేదా తడి నేలల్లో ఈ ఆకు కనిపిస్తుంటది. సాధారణంగా పనికిరానిదిగా భావించే ఈ మొక్క వాస్తవానికి ఆరోగ్యానికి ఒక అద్భుతమైన నిధి.
ఆయుర్వేదంలో దీనిని ఔషధ గుణాల నిధిగా పరిగణిస్తారు. దీనిని కేశరాజ్ అని కూడా పిలుస్తారు, అంటే "జుట్టు రాజు". దీని ప్రయోజనాలు జుట్టుకు మాత్రమే పరిమితం కాదు. కాలేయాన్ని శుభ్రపరచడంలో, జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది.

గుంటగలగర ఆకు జుట్టు సమస్యలకు దివ్యౌషధం. దీనిని ఘమారా,భాంగ్రా లేదా భ్రింగ్ అని పిలుస్తారు. ఇది ప్రధానంగా తేమతో కూడిన నేలల్లో కనిపిస్తుంది. దీని ఆకులు మంచి వాసన, ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ ఆకు జుట్టు మూలాలను పోషిస్తుంది, వాటిని బలంగా చేస్తుంది, తొందరగా జుట్టు తెల్లబడటాన్ని నివారిస్తుంది. గుంటగలగర ఆకుతో తయారుచేసిన ఆయిల్ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. దాని ఆకుల నుండి తయారుచేసిన పేస్ట్ జుట్టును నల్లగా మరియు మందంగా చేస్తుంది. గుంటగలగర ఆకులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు స్కాల్ప్
ఇంట్లోనే గుంటగలగర ఆకు ఆయిల్ ఇలా తయారు చేసుకోండి
గుంటగలగర ఆకులను కొబ్బరి లేదా ఆవ నూనెలో మరిగించి వడకట్టి చల్లబరచండి. ఈ ఆయిల్ ని క్రమం తప్పకుండా రాయడం వల్ల జుట్టుకు సహజమైన మెరుపు, బలం లభిస్తుంది.
కాలేయం,జీర్ణక్రియకు ఒక వరం
గుంటగలగర ఆకు బాహ్య సౌందర్యానికే కాకుండా అంతర్గత ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కాలేయ పనితీరును పెంచుతుంది, కామెర్లు వంటి సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది..జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ఈ ఆకు వినియోగం కడుపు గ్యాస్,వికారం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
మధుమేహ రోగులకు దివ్యౌషధం
గుంటగలగర ఆకులో ఉండే యాంటీ-హైపర్గ్లైసీమిక్ లక్షణాలు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు దీని ఆకుల కషాయం లేదా పొడి తీసుకోవడం మంచిది. ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడం ద్వారా డయాబెటిస్ సమస్యలను తగ్గిస్తుంది.
ఎలా ఉపయోగించాలి?
మీ ఆరోగ్య దినచర్యలో గుంటగలగర ఆకు చేర్చుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి.
గుంటగలగర ఆకు రసం - నీటితో కలిపి తాగడం వల్ల కాలేయం, జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
గుంటగలగర ఆకు పౌడర్ - 1-2 గ్రాముల పొడిని తేనె లేదా గోరువెచ్చని నీటితో తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
క్యాప్సూల్స్ - ఈ రోజుల్లో దీని క్యాప్సూల్స్ మార్కెట్లో కూడా అందుబాటులో ఉన్నాయి, ఇవి కాలేయం, చర్మానికి ప్రయోజనకరంగా ఉంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications