Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
మిల్లెట్ నూడిల్స్ ఎప్పుడైనా తిన్నారా? ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచి కూడా..ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూడండి
సాయంత్రం అయిందంటే చాలు చాలామంది రోడ్డుమీదకు అలా సరదాగా వెళ్లి జంక్ ఫుడ్స్ తింటుంటారు. అయితే చాలామంది ముఖ్యంగా యువత ఎక్కువగా తినే అలాంటి ఈవెనింగ్ జంక్ ఫుడ్స్ లో నూడిల్స్ ఒకటి. వెజ్ నూడిల్స్,ఎగ్ నూడిల్స్,చికెన్ నూడిల్స్ ఇలా రకరకాలుగా దీనిని తయారుచేస్తారు. ఆరోగ్య స్పృహ పెరగడంతో ప్రస్తుతం ప్రజలు తమ ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చేసుకుంటున్నారు. ప్రాసెస్ చేసిన ఆహారాలకు బదులుగా సహజమైన పోషక విలువలు కలిగిన ఆహారాలను తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వాటిలో మిల్లెట్స్ లేదా చిరుధాన్యాలు ఒకటి.
మిల్లెట్స్ తో తయారుచేసిన నూడిల్స్.. గోధుమ నూడిల్స్‌కు అద్భుతమైన ప్రత్యామ్నాయం. ఇవి రుచిగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయి. మిల్లెట్ నూడిల్స్‌ను ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. ఈ మిల్లెట్ నూడిల్స్ ను ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

మిల్లెట్ నూడిల్స్ తయారీకి కావలసిన పదార్థాలు
మిల్లెట్ నూడిల్స్ - 1 ప్యాకెట్ సుమారు 150-200 గ్రాములు
ఉండేది
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ - 1
క్యాప్సికమ్- 1
క్యారెట్ - 1
క్యాబేజీ - 1 కప్పు
పచ్చిమిర్చి - 1-2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్
సోయా సాస్ - 1 టేబుల్ స్పూన్
వెనిగర్ - 1 టీ స్పూన్
టొమాటో కెచప్ - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - తగినంత
మిరియాల పొడి - 1/2 టీ స్పూన్
కొత్తిమీర - గార్నిష్ కోసం
నీరు - నూడిల్స్ ఉడికించడానికి తగినంత
రాముడి కాలం నాటి బ్రేక్ ఫాస్ట్..తింటే 100 ఏళ్లు గ్యారెంటీ,ఎలా చేయాలంటే..
మిల్లెట్ నూడిల్స్ తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నెలో నీరు పోసి బాగా మరిగించండి. నీరు మరుగుతున్నప్పుడు మిల్లెట్ నూడిల్స్ వేసి ప్యాకెట్ పై సూచనల ప్రకారం ఉడికించుకోండి. సాధారణంగా ఇవి 5-7 నిమిషాల్లో ఉడికిపోతాయి.
-నూడిల్స్ ఉడికిన తర్వాత వెంటనే చల్లటి నీటిలో వేసి కడగాలి. ఇలా చేయడం వల్ల నూడిల్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. తర్వాత నీటిని పూర్తిగా వడగట్టి నూడిల్స్ ను పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఒక బాండీ లేదా కడాయిని స్టవ్ మీద పెట్టి వేడి చేయండి. అందులో నూనె వేయండి. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించుకోండి.
-ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పచ్చిమిర్చి వేసి ఒక నిమిషం పాటు వేయించండి.
-తర్వాత సన్నగా తరిగిన క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ వేసి 2-3 నిమిషాలు పాటు మధ్యస్థ మంటపై వేయించండి. కూరగాయలు మరీ మెత్తగా కాకుండా కొద్దిగా క్రంచీగా ఉండేలా చూసుకోండి.
-వేయించిన కూరగాయలలో సోయా సాస్, వెనిగర్, టొమాటో కెచప్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపండి.
-ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న మిల్లెట్ నూడిల్స్ వేసి కూరగాయలతో బాగా కలిసేలా టాస్ చేయండి. నూడిల్స్ కు మసాలా అంతా పట్టేలా నెమ్మదిగా కలపండి. మీ ఇష్టానికి అనుగుణంగా ఇతర కూరగాయలను కూడా ఇందులో చేర్చుకోవచ్చు.
-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేస్తే వేడి వేడి మిల్లెట్ నూడిల్స్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
