Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ఈ పొంగలి తింటే చెక్కెర పొంగలిని కూడా మర్చిపోతారు.. రుచి అద్భుతం, అందరూ సింపుల్‌గా చేసుకునే విధానం ఇదే
పొంగలి అంటేనే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. ఇది సాధారణంగా పండుగల సందర్భంగా ఎక్కువగా వండే వంటకం అయినా, కొందరికి ఇది బ్రేక్‌ఫాస్ట్ ఫేవరెట్ కూడా! కానీ చాలామందికి ఇంట్లో చేసుకునేటప్పుడు పండగలకు చేసినప్పుడు రుచి రాదు. అలాంటి వారికి ఒక సింపుల్ టిప్. ఏంటంటే ఈసారి కట్టె పొంగలి ఈ స్పెషల్ పద్ధతిలో తయారు చేసి చూడండి. రుచిలో అసలు కాంప్రమైజ్ ఉండదు. పర్ఫెక్ట్ టెక్ట్స్‌చర్, కమ్మటి తాలింపు, ప్రెషర్ కుక్కర్‌లో చాలా ఈజీగా రెడీ అవుతుంది. అందుకే ఈ స్టోరీలో కట్టే పొంగలి ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? టిప్స్ ఏంటి అనేది తెలుసుకుందాం.
కట్టే పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలు:
పెసరపప్పు - 1 కప్పు
బియ్యం - 1 కప్పు
నెయ్యి - ¼ కప్పు
వెన్న (బటర్) - ¼ కప్పు
మిరియాలు - 1 టేబుల్ స్పూన్
అల్లం తురుము - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - ½ టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 8 (నరికి పెట్టుకోవాలి)
ఎండుమిర్చి - 4
జీడిపప్పు - ½ కప్పు
కరివేపాకు - కొన్ని ఆకులు
ఇంగువ - ¼ టీ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నీరు - సుమారు 6 కప్పులు (వాడిన కప్పు ప్రమాణంతో)

స్పెషల్ కట్టే పొంగలితయారీ విధానం:
ఈ స్పెషల్ కట్టే పొంగలి తయారు చేసుకోవడానికి ముందుగా.. ఒక పెనంలో పెసరపప్పు వేసుకోవాలి. ఆ పెసరపప్పును లో ఫ్లేమ్‌లో దోరగా వేయించుకోవాలి. పెనంలో వేసిన పప్పు లేత బంగారు వర్ణంలోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ సమయంలో పెసరపప్పు మంచి వాసనను ఇస్తుంది. అప్పటి వరకు దానిని వేయించుకోవాలి.
ఇప్పుడు మనం దోరగా వేయించుకున్న పెసరపప్పుతో బియ్యం కలిపి రెండు లేదా మూడు సార్లు నీటితో శుభ్రంగా కడిగి.. నీరును మొత్తం వడగట్టి.. పక్కన పెట్టుకోవాలి. ఇలా కడిగిన తరువాత వాటిని నానబెట్టాల్సిన అవసరం లేదు. కేవలం కడిగితే సరిపోతుంది.
ఈవెనింగ్ స్నాక్స్‌లో తెలంగాణ ఫేమస్ సర్వ పిండి బెస్ట్.. దీనిని మించింది లేదు,ఎలా చేసుకోవాలో తెలుసా?
ఇప్పుడు ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకోవాలి. అందులో వెన్న వేసుకొని, అది కరిగిన తరువాత అందులో పప్పు, బియ్యం మిశ్రమాన్ని వేయించుకోవాలి. ఈలోపు మరో పాన్‌లో నీటిని మరిగించుకోవాలి. అది మరిగిన తరువాత కుక్కర్‌లో వేయించుకున్న పప్పు, బియ్యం మిశ్రమంలో పోసుకోవాలి. ఇప్పుడు దానికి రుచికి తగినంత ఉప్పు జోడించి మూత వేసి, మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు మిడిల్ ఫ్లేమ్‌లో ఉడికించండి. ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీసి, అవసరమైతే కొంచెం నీరు వేసుకొని మరోసారి కలుపుకోండి.
తాలింపు:
ఇప్పుడు ఒక చిన్న పాన్‌లో నెయ్యి వేసి, మిరియాలు, అల్లం, జీలకర్ర వేసి వేయించండి. అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీడిపప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. చివరగా కరివేపాకు, ఇంగువ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ తాలింపును పొంగలిలో వేసి బాగా కలపండి. అంతే ఎంతో రుచికరమైన కట్టే పొంగలి సిద్ధమైనట్లే. ఈ కట్టే పొంగలిని వేడిగా సర్వ్ చేస్తే, రుచి అమృతంలా ఉంటుంది! పల్లీ చట్నీ, కోబ్బరి చట్నీ లేదా సాంబార్‌తో కలిపితే, మర్చిపోలేని బ్రేక్‌ఫాస్ట్ ట్రీట్ అవుతుంది.
టిప్స్:
వాడే కప్పుతోనే అన్ని పదార్థాల కొలతలు తీసుకుంటే ఫలితం కచ్చితంగా
వస్తుంది. సరిగ్గా సరిపోతుంది కూడా.
ఎక్కువ విజిల్స్ వచ్చేస్తే పొంగలి ముద్దలా అయిపోతుంది. అందుకే
కేర్‌ఫుల్‌గా ఉడకనివ్వండి.
పాన్‌లో పప్పును లైట్‌గా వేయించడం వల్ల రుచి మరింత
మెరుగవుతుంది.
ఇలా చేసుకుంటే, మామూలు పొంగలి కంటే కట్టె పొంగలి స్పెషల్ టేస్ట్
ఇస్తుంది. ఇంట్లో ఒక్కసారి చేసినా మళ్లీ మళ్లీ ఇదే విధానాన్ని ఫాలో
అవుతారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications