Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్‌తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
ఈవెనింగ్ స్నాక్స్‌లో తెలంగాణ ఫేమస్ సర్వ పిండి బెస్ట్.. దీనిని మించింది లేదు,ఎలా చేసుకోవాలో తెలుసా?
ఈవెనింగ్ టైంలో టీ తాగుతూ స్నాక్స్ తినడం చాలా మందికి అలవాటు ఉంటుంది. కొందరు టీలో బిస్కెట్స్ తింటే మరికొందరు ఇంట్లో చేసుకున్న స్నాక్స్ తింటుంటారు. మరికొందరు బజ్జీలు, పకోడీలు వంటివి చేసుకొని తింటుంటారు. అలాంటి స్నాక్స్‌లో ఒకటి సర్వపిండి. ఇది తెలంగాణలో చాలా ఫేమస్. చాలా మంది ప్రజలు దీనిని ఎంతో ఇష్టంగా చేసుకొని తింటుంటారు. అలాగే దీనిని చేసుకోవడం చాలా సింపుల్. కేవలం నిమిషాల వ్యవధిలోనే దీనిని చేసుకోవచ్చు. కానీ ఇప్పుడున్న చాలా మందికి దీనిని ఎలా చేసుకోవాలో తెలియదు. అందుకే ఈ స్టోరీలో తెలంగాణలో అత్యంత ఫేమస్ అయిన సర్వపిండిని ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది తెలుసుకుందాం.
తెలంగాణ ఫేమస్ సర్వపిండి తయారీకి కావాల్సిన పదార్థాలు
రెండు కప్పుల బియ్యం పిండి
మూడు టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలు
ఒక టేబుల్ స్పూన్ నువ్వులు
ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర
ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి
గుప్పెడు కొత్తిమీర తరుగు
గుప్పెడు కరివేపాకు తరుగు
రెండు ఇంచుల అల్లం
ఎనిమిది పచ్చి మిర్చి
గంట ముందు నానబెట్టిన రెండు టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు
తగినంత నీళ్లు
కొంచెం నూనె
రుచికి సరిపడా ఉప్పు

తెలంగాణ ఫేమస్ సర్వపిండి తయారీ విధానం
తెలంగాణ స్టైల్, మోస్ట్ స్పెషల్ సర్వపిండి చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో రెండు కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. ఆ పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే మూడు టేబుల్ స్పూన్ వేయించిన పల్లీలను వేసుకోవాలి.
దీంతో పాటు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఆ తరువాత మనం ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు గుప్పెడు కొత్తిమీర తరుగును, అలాగే గుప్పెడు కరివేపాకు తరుగును కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఈ దోశ పిల్లలకు పెడితే.. ముక్క మిగిల్చకుండా మొత్తం నాకేస్తారు, ఎలా చేసుకోవాలంటే?
ఆ తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎనిమిది పచ్చిమిర్చి, రెండు ఇంచుల అల్లం వేసి.. కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఆ తరువాత వాటిని ముందుగా మనం కలిపి పెట్టుకున్న మిశ్రమంలో వేసుకోవాలి. ఆ తరువాత అందులో రెండు గంటల ముందు నానబెట్టుకున్న పచ్చి శనగ పప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో కొంచెం నీళ్లు పోసి.. మరీ గట్టిగా, మరీ లూజ్‌గా లేకుండా కలుపుకోవాలి. పిండి బాగా కలిసిన తరువాత ఆ పిండిని సైజుకు తగ్గుట్లుగా ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక పెనం తీసుకొని.. స్టవ్‌పై పెట్టుకోవాలి. దానిపై కొద్దిగా ఆయిల్ పూసుకొని దానిపై సర్వపిండి ఉండను పెట్టుకొని ఒక రోటి మాదిరిగా ఒత్తుకోవాలి. ఆ తరువాత దానిపై ఆయిల్ పూసుకొని.. పై నుంచి మూత పెట్టి కప్పెయ్యాలి. ఒక పది నిమిషాల తరువాత రెండు వైపులా దానిని కాల్చుకుంటే తెలంగాణ ఫేమస్ సర్వపిండి సిద్ధమైనట్లే. ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈవెనింగ్ టైములో స్నాక్స్ మాదిరిగా అదిరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications