Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
ఈ ముల్లంగి చట్నీ10 రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు! ఎలా చేయాలంటే..రైస్ రోటి, చపాతీ దేనీకైనా సూపర్ గా ఉంటుంది
మన ఆంధ్రులకు పచ్చళ్ళు అంటే అత్యంత ప్రియం. ఎందుకంటే అది భోజనం, అల్పాహారం ఏదైనా సరే.. దానితో పాటు కాస్త చట్నీ ఉంటే దాని రుచి వేరు అని ఫీలవుతుంటారు. అలా పుట్టినవే డజన్ల కొద్దీ చట్నీలు ఉన్నాయి. లంచ్ మరియు స్నాక్ ఏదైనా సరే ప్లేట్లో పక్కన చట్నీ ఉండాల్సిందే. అన్ని చట్నీలు అందరికీ రుచిగా ఉంటాయని చెప్పలేము. అందరూ ఇష్టపడే కొన్ని చట్నీలు ఉన్నాయి.
ఇలా కూరగాయలతో చేసే చాట్జీ రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ఈ రోజు ముల్లంగి చట్నీ చేయడం గురించి తెలుసుకుందాం. ముల్లంగి చాలా ఆరోగ్యకరమైన కూరగాయ.
ముల్లంగిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది మరియు కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో ఫైబర్ మరియు ఫోలేట్ కూడా ఉంటాయి. కాబట్టి అనారోగ్యంతో ఉన్నవారు కూడా ఆనందించవచ్చు. ముల్లంగి మలబద్ధకం నివారించడంలో చక్కగా పనిచేస్తుంది.
ఈ ఆరోగ్యకరమైన పదార్థాలన్నీ ఉన్న ఈ ముల్లంగి చట్నీని రోజువారి వంటల్లో చేర్చుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. అయితే కొందరు మాత్రం ముల్లంగికి దూరంగా ఉండాలి . ముఖ్యంగా గ్యాస్ , గ్యాస్ట్రిక్ సమస్యలు, హార్ట్ సమస్యలున్నవారు ముల్లంగాకి దూరంగా ఉండాలి. అంతకూ తినాలనిపిస్తే డాక్టర్ ను సంప్రదించండి.
మరి ముల్లంగి చట్నీ రుచికరంగా నోరూరించే విధంగా ఎలా చేయాలి? ముల్లంగి చట్నీ చేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటి? తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
ముల్లంగి: 2 (మీడియం సైజ్ వి) తొక్క తీసి శుభ్రంగా కడిగి ముక్కలుగా
కట్ చేసి పెట్టుకోవాలి.
ఎండుమిర్చి: 10
జీలకర్ర : ఒక టీస్పూన్
ఆవాలు: 1 టీస్పూన్
పసుపు చిటికెడు
చింతపండు పులుపుకోసం చింతపండు సైజ్ అంత
కొబ్బరి (అవసరం అనిపిస్తే వేసుకోవచ్చు)
ధనియాలు: 1టీస్పూన్
ఇంగువ: చిటికెడు
ఉప్పు : రుచికి సరిపడా
ఉల్లిపాయ: ఒకటి
కరివేపాకు : కరివేపాకు రెబ్బలు
నూనె
ముల్లంగి చట్నీ తయారుచేయు విధానం
1. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నూనె వేయాలి. తర్వాత
ముల్లంగి ముక్కలు వేసి బాగా వేయించాలి. అందులో నీటి శాతం పోయే వరకు
వేయించాలి. ముల్లంగి రంగు కొద్దిగా మారినప్పుడు అందులో ఉల్లిపాయలు,
కరివేపాకు వేయాలి.
2. తరవాత కొబ్బరి, అరకప్పు, చింతపండు వేసి ఒక నిముషం వేగించాలి.
తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. దాన్ని బయటకు తీసి మరో
గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో మళ్లీ కొంచెం నూనె
వేయండి.
3. ఈ నూనెలో జీలకర్ర, ధనియాలు, ఎండు మిర్చి వేసి వేయించాలి. తర్వాత
తీసి మిక్సీ జార్ లో వేసి ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
4. ఇది పొడిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే జాడీలో ఇంతకు ముందు
సిద్ధం వేగించి పెట్టుకున్న ముల్లంగిని వేసి మెత్తగా
రుబ్బుకోవాలి.
5. ఇప్పుడు మళ్లీ స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి బాగా కలపాలి.
జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండు మిరిపకాయలు, ఇంగువ వేసి ఒక నిముషం
పాటు వేగించుకోవాలి. ఈ పోపును చట్నీలో వేసి బాగా కలపుకోవాలి. అంతే
ముల్లంగా చట్నీ రెడీ. ఫ్రిజలో పెట్టుకుంటే సుమారు ఒక వారం నుండి 10
రోజులు నిల్వ ఉంచుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












