Latest Updates
-
సమ్మర్ లో దొరికే అరుదైన పండు..బీపీ కంట్రోల్, జీర్ణక్రియ నుంచి కాలేయ సంరక్షణ వరకు బోలెడు ప్రయోజనాలు -
నారద జయంతి: వ్యతీపాత యోగంతో ఈ రాశుల వారికి రాజయోగం.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
ఇలా టమాటా రసం చేస్తే పళ్లెంలో అన్నం నిమిషాల్లో ఖాళీ అవ్వాల్సిందే! -
హైదరాబాద్ టెక్కీ రాసిన 19 పేజీల నోట్… ఆ ఒక్క నిర్ణయం వెనుక ఉన్న భయంకరమైన నిజం ఇదే! -
సమీరా రెడ్డి చేసిన గోవా స్పెషల్ మ్యాంగో కొబ్బరి కర్రీ..అన్నంలోకి అమృతమే..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
మేషరాశిలో బుధాస్తమయం: ఈ 26 రోజులు డిజిటల్ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండండి! -
ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనయోగం.. పట్టిందల్లా బంగారం కాబోతోంది..! -
పుచ్చకాయ తింటూ ఈ 3 తప్పులు చేస్తే మీ ప్రాణాలకే ముప్పు! -
నారద జయంతి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
నోట్లో నీళ్లు ఊరించే టమాటా నిల్వ పచ్చడి.. నెలల పాటు నిల్వ ఉండేలా చేసుకోండిలా..
Mushroom Lollipop : మష్రుమ్ లాలీపాప్స్ (పుట్టగొడుగులతో లాలీ పప్స్)ఎలా తయారుచేయాలో తెలుసా?
Mushroom Lollipop : ప్రతి రోజూ తిన్న వంటకాలు, స్నాక్స్ లేదా సైడ్ డిష్ లు ఏవైనా సరే తిన్న వేసి మళ్లీ మళ్లీ తినాలంటే చాలా మందకి బోరుకుడుతుంది. ఇక పిల్లలకైతే రోజూ అవేనా అని అడుగుతుంటా. అందులోనే వేసవి సెలవుల్లో పిల్లల గారాబాలు ఎక్కువ. రోజుకో వరైటీ కోరుకుంటారు. రోజూ ఓకే స్నాక్ ఇస్తే ముఖం చాటేస్తుంటారు.
కాస్త కారంగా..కాస్త తియ్యగా ఉండే ఆహారాలనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా వేసవి సెలవుల్లో ఏదో ఒకటి నెమరేయకపోతే వారికి పొద్దు గడవదు. అలాంటి వారి కోసం ఓ వెరైటీ వంటను ఈ రోజుకు మీకు పరిచయం చేస్తున్నాం. అదే మష్రుమ్ లాలీపాప్ . ఇది మీరు కూడా ప్రయత్నించి రుచి చూసి మీ అభిప్రాయం మాతో పంచుకోండి.
Image courtesy; youtube
కావాల్సిన పదార్థాలు:
పుట్టగొడుగులు: 15 (5నిముషాలు వేడినీటిలో వేసి కడిగి పక్కన
పెట్టుకోవాలి)
మైదా: 1 cup
ధనియాల పొడి ఫ 1tbsp
పసుపు: 1/4tsp
ఛాట్ మసాలా: 1tbsp
మిరయాలపొడి: 1/2tbsp
కార్న్ పౌడ్ : 2tbsp (క్రిస్పీగా ఉండాలంటే కార్న్ ఫ్లేక్స్ ను
మిక్సీలో రఫ్ గా గ్రైడ్ చేసుకోవచ్చు)
బ్రెడ్ పొడి : 1/2 cup
ఓట్స్ పౌడర్: 1/2 cup
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1tbsp
ఉప్పు రుచికి సరిపడా
నీళ్ళు సరిపడా
నూనె: డీప్ ప్రై చేయడానికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో మైదా, అల్లం
వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, చాట్ మసాలా , దనియాలపొడి, పసుపు, మిరియాల
పొడి సరిపడా నీళ్ళు పోసి , పేస్ట్ లా కలుపుకోవాలి.
2. ఈ పేస్ట్ మరీ చిక్కగాను లేదా మరీ జారుడుగాను ఉండకూడుదు. మీడియంగా
డీప్ ఫ్రైకి సరిపోయే విధంగా కలుపుకోవాలి.
3. మైదా మ్యారినేషన్ సిద్దం చేసుకున్నాక, మరో గిన్నెలో కార్న్‌ఫ్లోర్
పౌడర్, ఓట్స్ పొడి వేసి బాగా మిక్స్ చేసి ఇది ఒక సైడ్
పెట్టుకోవాలి.
4. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి కాగిన
తర్వాత ఒక్కో పుట్టగొడుగుకు టూత్ పిక్(పుల్లను) గుచ్చి అన్ని రెడీగా
పెట్టుకోవాలి.
5. తర్వాత వీటిని ఒక్కోదాన్ని మొదట మైదా మిశ్రమంలో డిప్ చేసి ఆ తర్వాత
బ్రెడ్ కార్న్ ఫ్లోర్ మిశ్రమంలో పొర్లించాలి. అన్నివైపులా అంటుకునే
విధంగా ఈ మిశ్రమంలో ముంచి బాగా పట్టిన తర్వాత కాగే నూనెలో వేసి డీప్
ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతే పుట్టగొడుగుల లాలీపాప్స్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












