ఆషామాషీ కాదు.. ఈ పుట్టగొడుగుల పచ్చడి తింటే,నోరు ఊరాల్సిందే.. అమోఘం అంతే ఇంట్లో ఎలా చేసుకోవాలంటే

ప్రస్తుతం మార్కెట్లో చికెన్, మటన్, రొయ్యల పచ్చడులు అధికంగా అమ్ముడవుతున్నాయి. నాన్​వెజ్​ ప్రియులు ఈ రకాల పచ్చడులతో భోజనం చేస్తూ తమ భోజనాన్ని అనుభవిస్తున్నారు. కొందరు ఇంట్లోనే రకరకాల పచ్చడులను తయారు చేస్తారు. అలాంటి వారికి, సింపుల్‌గా తయారుచేసుకునే పచ్చడి ఏదైనా ఉందంటే అది పుట్టగొడుగుల పచ్చడి. ఈ పుట్టగొడుల పచ్చడి రెసిపీని మీకు అందిస్తున్నాం. ఈ పచ్చడి చేయడం చాలా ఈజీ, ఫ్లేవర్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇక, ఈ మష్రూమ్ పచ్చడి తయారీ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి తెలుసుకుందాం రండి.

మష్రూమ్ పచ్చడి కోసం కావలసిన పదార్థాలు

పుట్టగొడుగులు (మష్రూమ్స్) - 500 గ్రాములు
నూనె - 100 మి.ల.
ఉప్పు, కారం - రుచికి సరిపడా

మసాలా కోసం:

దాల్చిన చెక్క - 1
యాలకులు - 2
లవంగాలు - 3
మెంతులు - అరటీస్పూన్
ఆవాలు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు

మష్రూమ్ పచ్చడి తయారీ విధానం

ముందుగా, పుట్టగొడుగులను శుభ్రంగా కడగాలి. వాటిపై మట్టి ఉన్నట్లయితే, కత్తి ఉపయోగించి తొలగించుకోవాలి. తరువాత, వాటిని గోరువెచ్చటి నీళ్లలో ఉప్పు వేసి 2 నిమిషాలు ఉంచాలి.

ఇప్పుడు, పుట్టగొడుగులను తీసి, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు అంతగా చిన్నగా కాకుండా, వాటి సైజుకు అనుగుణంగా కట్ చేయండి.

ఈ కిచిడి తింటే, బిర్యానీని కూడా వద్దంటారు.. చాలా మందికి ఫేవరెట్,ఎలా చేసుకోవాలో చూడండి?

ఒక పాన్‌లో, మసాలా పదార్థాలను వేసి, ఒక నిమిషం పాటు వేయించాలి. మసాలాలు బాగా వేయించి, వాటిని చల్లార్చి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.

ఆ పాన్‌లో నూనె వేసి, వేడి చేసిన తర్వాత, పుట్టగొడుగులను, కొద్దిగా ఉప్పు, అరటీస్పూన్ పసుపు వేసి ఫ్రై చేయాలి.

మష్రూమ్స్​ ఫ్రై అవుతుండగా, వాటి లోపలి నీరు పూర్తిగా ఊరిపోతుంది. ఇప్పుడు, పాన్ మూత వేసి, వాటిని కలుపుతూ, నీరు మొత్తం పోయే వరకు ఫ్రై చేయాలి.

మష్రూమ్స్ గోల్డెన్ కలరులో ఫ్రై అయిన తర్వాత, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి.

తరువాత, స్టవ్ ఆఫ్ చేసి, పాన్‌ను పక్కన పెట్టుకోండి. పచ్చడి గోరువెచ్చగా ఉండే సమయంలో, గ్రైండ్ చేసిన మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన పుట్టగొడుగుల పచ్చడి సిద్ధమైనట్లే. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే.. అబ్బా ఆ రుచి వేరే లెవెల్ అంతే.

పుట్టగొడుగుల పచ్చడి ఆరోగ్య ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: పుట్టగొడుగుల్లో బీటా-గ్లూకాన్స్ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలపరిచి, వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: పుట్టగొడుగుల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది, ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే, వీటిలో కొవ్వు మరియు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటం వల్ల గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది: పుట్టగొడుగులు తక్కువ కేలరీలు మరియు ఎక్కువ ఫైబర్‌ను కలిగి ఉంటాయి. ఇది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది మరియు తక్కువ ఆహారం తీసుకోవడానికి సహాయపడుతుంది, తద్వారా బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: పుట్టగొడుగుల పచ్చడిలో వాడే కొన్ని రకాల మసాలాలు జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి.

యాంటీఆక్సిడెంట్ లక్షణాలు: పుట్టగొడుగులు మరియు పచ్చడిలో ఉపయోగించే కొన్ని దినుసులు (ఉదాహరణకు పసుపు, అల్లం) శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి కణాలను నష్టం నుండి రక్షిస్తాయి.

విటమిన్ డి ని అందిస్తుంది: కొన్ని రకాల పుట్టగొడుగులు, ముఖ్యంగా అతినీలలోహిత కాంతికి గురైనవి, విటమిన్ డి ని కలిగి ఉంటాయి. ఇది ఎముకల ఆరోగ్యానికి మరియు రోగనిరోధక శక్తికి చాలా ముఖ్యం.

రుచిని పెంచుతుంది: పుట్టగొడుగుల పచ్చడి ఆహారానికి ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది, ఇది భోజనాన్ని మరింత ఆనందదాయకంగా చేస్తుంది.

[ of 5 - Users]
Story first published: Sunday, April 6, 2025, 9:30 [IST]
Desktop Bottom Promotion