Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
తవ్వకాల్లో బయటపడిన పాతకాలం రెసిపి.. తింటే నోట్లే బ్లాస్టే,సింపుల్ గా ఇలా చేసుకోండి
మన పూర్వీకులు ఆరోగ్యంగా ఉక్కులా ఉండటానికి కారణం వారి జీవనశైలి. ఇప్పట్లోలా ఏది పడితే అది తినేవాళ్లు కాదు. మంచి హెల్దీ ఫుడ్ తినేవాళ్లు కనుకనే ఎక్కువ సంవత్సరాలు బతికేవాళ్లని చెబుతుంటారు. మన పూర్వీకులు తిన్న ఆరోగ్యకరమైన వంటకాలలో పాల సక్కు ఒకటి. ఇది చాలా చాలా టేస్టీగా ఉండే స్వీట్. పాల సక్కు..దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రా, తెలంగాణలో బాగా ప్రాచుర్యం పొందిన రుచికరమైన, పోషకమైన వంటకం. పాల సక్కుని మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే దీనిని తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
పాల సక్కు తయారీకి కావలసిన పదార్థాలు
బియ్యం:
1 కప్పు
పాలు: 2 కప్పులు
చక్కెర లేదా బెల్లం: 1 కప్పు
నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు: అరకప్పు
కొబ్బరి ముక్కలు: అరకప్పు

పాల సక్కు తయారీ విధానం
-రెండు కప్పుల పాలలో కప్పు బియ్యం నానబెట్టాలి.
-రెండు గంటలపాటు నానిన తర్వాత దీనిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో గ్రైండ్ చేసిన పాలు బియ్యం మిశ్రమాన్ని వేయాలి. ఇందులోనే అరకప్పు జీడిపప్పు,అరకప్పు కొబ్బరి ముక్కలు, 2 కప్పుల పాలు, 1 కప్పు పంచదార వేసి దగ్గరగా ఉడికించుకోవాలి. ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలి.
-దగ్గరకి అయిన తర్వాత అందులో 4 స్పూన్ల నెయ్యి వేయాలి. మంటను సిమ్ లో పెట్టి కొద్దిసేపు కలిపి దించేయాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఓ పాన్ పెట్టి అందులో నాలుగు స్పూన్ల నెయ్యి వేసి ఇందులో వండిన పాలసక్కుని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. దానీమీద ఇంకొంచెం నెయ్యి వేసి తక్కువ మంట మీద పావు గంట సేపు కాల్చుకోవాలి. అంతే పాల సక్కు రెడీ. దీనిని ముక్కలుగా కట్ చేసుకొని తింటే నోట్లో బ్లాస్టే.
-పాల సక్కును వేడి వేడిగా లేదా చల్లగా కూడా వడ్డించవచ్చు.
పెరుగు ఇడ్లీ..జిందగీలో మర్చిపోలేని టేస్ట్,ఎలా చేయాలంటే
పాల సక్కు ప్రయోజనాలు
పాల సక్కులో పాలు, నెయ్యి ఉండటం వలన ఇది పోషక విలువలు కలిగిన ఆహారం. ఇది శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులను అందిస్తుంది. పాలలో కాల్షియం, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలు, దంతాలను బలపరుస్తుంది. కండరాల అభివృద్ధికి సహాయపడుతుంది. పాల సక్కు తేలికగా జీర్ణమయ్యే ఆహారం. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. పాల సక్కులో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. పాల సక్కు పిల్లలకు,వృద్ధులకు మంచి ఆహారం. ఇది తేలికగా జీర్ణమవుతుంది, పోషకాలను అందిస్తుంది. పాలలో ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది సెరోటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. సెరోటోనిన్ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది.
పాల సక్కులో ఉండే పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడానికి సహాయపడతాయి. పాల సక్కులో క్యాలరీలు ఎక్కువగా ఉండటం వలన ఇది బరువు పెరగడానికి సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారు పంచదారకు బదులుగా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన బెల్లం లేదా స్వీటెనర్లను ఉపయోగించవచ్చు. నెయ్యి బదులుగా వెన్న కూడా ఉపయోగించవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications